WELCOME


అతిధులు రానీ!....బంధువులు రానీ!......స్నేహితులు రానీ!.....చేతులెత్తి నమస్కరిస్తూ!.....చిరునవ్వుతో పలకరించేది నేనే!.....తరవాతే మా యింట్లో వాళ్ళు......నాకు పెద్ద ఖర్చుండదు......రూపాయలు పెట్టి తెస్తే  చాలు!...నా పని నే చేసుకుపోతాను......ఇంతకీ!...నా పేరు....."వెల్కమ్".....అదేనండీ!.....మీ యింటి ప్రవేశ ద్వారం దగ్గర వేలాడిస్తారు కదా!.......వచ్చినవాళ్ళందరికి అదేపనిగా పలకరించమని!....ఆ గతిలేని గొట్టాన్ని!......ఎప్పస్ సేవకా వృత్తిని!....మంచ్చి నీళ్లు పొయ్యకపోయినా పర్లేదు!.....నేనుంటే.    అందుకే!.....గబుక్కున కొని పడేస్తే!.......ఓ మేకు కొట్టి గోడకి......నన్ను వేలాడదీస్తే......నా ఏడుపేదో నే ఏడుస్తాను......నాతొ వాళ్లకేం పని!.....ఎవరొచ్చినా హ్యాపీ.....వస్తారు....పోతారు......ఎందుకంటే స్వాగతం బాధ్యత నాది కదా!....నా చావేదో నే చస్తాను గనకా!....పూచి, పేచీ లేదు.....ఎంచక్కా వచ్చిన వాళ్ళని.....బుర్ర వాయించేసి పంపించేయడమే.....ఫ్రిజ్లో నీళ్లడిగినా బాధే!.....మళ్ళీ సీసాల్లో నీళ్లు నింపి పెట్టాలని!....నాకైతేనా ఏమి పెట్టక్కర్లేదు....ఆకలేస్తోంది...అన్నం పెట్టమంటానా....నవకాయ పిండివంటలడుగుతానా......బుర్ర దువ్వమంటానా......ఏమీ అడగని గోడ మీద బొమ్మని.....కంటి మీద కునుకు లేకుండా.....అహోరాత్రులు....మీ యింటికి ఎవరు వచ్చినా!......స్వాగతం పలకడమే నా పని......నా దౌర్భాగ్యమేంటంటే!.......ఆఖరికి దొంగ గారికి కూడా స్వాగతం చెప్పాల్సిందే.....రా!ఆలస్యమెందుకు!దోచుకుపో!...అనీ....తూఊ....నా స్వాగతం సంతకెళ్లా?......అర్ధం పర్ధం ఉందా?....వీళ్ళు లేదు వాళ్ళు లేదు.....కనిపించిన వాళ్లందరికీ యిదే పని!.....ఏవిటో ఆ గొప్ప....పూర్వ ఐతే!.....యింటికి  అతిధులొస్తే...యింటి వారు చేతులెత్తి నమస్కరించి.....రండి!రండి!....అనీ..ఆహ్వానం పలికి....చెంబుతో నీళ్లిచ్చి.....కాళ్ళు కడుక్కోమని....ఆ తర్వాత లోపలికి  తీసుకెళ్లి.......పిండివంటలతో కొసరి కొసరి దగ్గరుండి వడ్డించి.....తృప్తి తీరా భోజనం చేసిన పిదప.....తాంబూలం యిచ్చి సత్కరించేవారు....అదీ!....అతిధి మర్యాదంటే!.....ఇప్పుడా.....రావడం అవసరమా?.....యెంత వేగం పోతారు?......మీకో దండం అన్నట్టు వుంది.....నేను, నా స్వాగతమూను!.....చెప్పలేక చెబుతున్నాను....కానీ.....మంట పుడుతోంది.....కొందరైతే మరీ ఘోరం!.....వింటూ వుంటాను కదా!.....ఎవరైతే వచ్చారో......వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత....ఏం చర్చలో.....చిరాకేస్తుంది.....వీళ్ళ మర్యాదలకి నేనొక్కదాన్నే తక్కవయ్యానని.....అయినా తప్పదుగా!.....కాళ్ళు,చేతులు ఆడని బొమ్మని కదా!......ఎక్కడికి పోతాను!.......మీ గౌరవతిది మర్యాదలకి శతకోటి నమస్కారాలు......వుంటాను!.....ఎక్కడకెళ్లి  చస్తాను!..ఇట్లు....నవరస నటనా చాతుర్యవిదుషీమణి,వెల్కమ్ బొమ్మ.......జయప్రభాశర్మ.



Comments

Popular posts from this blog

Articles