Cup Coffee 

ఎవర్రా!నన్ను వదల్రా! చంపేస్తున్నారనుకో! ఇంత మోజా నేనంటే! ఎలా తప్పించుకోవాలో తెలియలేదు నాయన! మీకు పుణ్యం ఉంటుందర్రా! అరిచీ గీ పెట్టినా వినిపించుకోరా! ఏంటీ మొండి వైఖరి!అమ్మో!అమ్మో! నీరసం వస్తోందమ్మా!.     ఏవిటీ రంకెలు! ఎవరు నువ్వు!.  ఎవరు నువ్వా!. ఎవరు ఊదుకుంటూ తాగుతారో అదే "కాఫిని"!.  ఇప్పుడడిగావుగాని ఇంకెప్పుడు అడగక. అబ్బో! కాఫివారా! ఎవరో అనుకొంటిని! క్షమాకరో!. టీకే! మేటరు కొద్దాం!. అవునూ! ఉదయాన్నే లేచిపోయి పెద్ద పనున్నట్టు! గుడ్లగూబలా నాకోసమే వెతుకులాట! ఎక్కడున్నానో అనీ దేవులాట!.  మొహం కడిగి కొందరు,మొహం కడక్క ఇంకొందరు! ఇది ఏవైనా బాగుందా!ఎక్కువ నన్ను సేవించకూడదురా బాబూ అన్నా! పెడా చెవిన పెడతారా! నాలో కెఫిన్ అనే
చెడు పదార్ధముంది మొర్రో అని గోల చేస్తున్నా వినరా!.  బీ.పీ, షుగరు ఉన్న వాళ్ళైతే, నన్ను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఓ..రాజావారిలా, కాలుమీద కాలు వేసుకొని,తాగుతుంటే! నాకొస్తుందీ మంటా! ఇంతా అంతా కాదు. దానికి తోడు తాగుతున్నప్పుడు! రోత పుట్టే సౌండొకటీ!.   అయినా! మిమ్మల్నని లాభమేంటిలే! ఆ బ్రిటిషు వాళ్ళు, ఓ యేలుబడి ఏలారు చూడు! అప్పుడు మప్పేసి పోయారు! ఠికానా లేకుండా!.   నేను మాత్రం మిగిలిపోయాను మీ చేతిలో ఏడుస్తూ!. లేకపోతె! ఏంటి! మీకు తెలుసా ఏమైనా!.  వద్దురా బాబూ అన్నా వినకుండా తాగించేసరికి! ఆ రుచి మరిగి, అద్భుతం, అమోఘం అంటూ, ఇప్పుడు వదలమన్నా,వదిల్తే ఒట్టు.  వాళ్ళ అసాధ్యం కూలిపోను! తెలియని వాళ్లకి తెలియబరుస్తారా!. ఇది ఏమైనా బాగుందా?. ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఎలా మండిందో! నాకు పాఠాలు చెబుతున్నారు. గుడ్డొచ్చి పిల్లని వెక్కరించినట్టు.  అబ్బో! నాలో ఎన్ని రకాలు మళ్ళీ!.  బ్రూ. సన్రైజు, నెస్కేఫు, ఫిల్టరుకాఫీలూ.  ఇవేవి చాలవన్నట్లు కాఫి కేఫ్లు, అరకు కాఫి ఐతే అద్భుతః అట.  వామ్మో!
నా వల్ల కాదురా నాయన! రెండుసార్లు, మూడుసార్లు! అలా కాచుకుంటూ తాగుతుండడమే పని!.   అది కడుపు కాదురా తండ్రి! కుడితి గోలెంల వుంది!కొన్నాళ్ళకి పొడుం పీకినట్టు పీకలేమో కాఫీ గుండని. అంచేత అవస్థలు కొని తెచ్చుకోకండి! సుఖానున్న ప్రాణాన్ని దుఃఖపెట్టకండి! చెప్పిన మాట వినండి!ఉదయాన్నే తాగండి చాలు.   అంతకు మించి వద్దు.ఆకల్ని అణచివేస్తుంటాను.మంచిదాన్ని కాదు. యింతకు మించి చెప్పలేను. అర్ధం చేసుకుంటే మంచిది.వుంటాను........సెలవ్.ఇట్లు,ఊరించే కాఫి......జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles