Povvaaku
పొవ్వాక్కాడా!ఎవులికి తెలుసునో సెప్పండి! అచ్చే తెలుస్తాది. ఎలాగ తెలుస్తది. ఒలమ్మ! నను సెబుతాను యినండి.యి మాటంటే సాలు మా ఆడోళ్లకి, మొగోల్లకి గొప్ప యిట్టము. మా కాసి బాగా పండిత్తాము. ఏటనుకుంటన్నారు! మరేటి కాదు బాబు! మీరు సదువుకున్నోళ్ళు, అంసేత,పొగాకు అంటరు. మాకేటి సదువా ఏటా? మోటోల్లము పొవ్వాకు అంతము. అదన్న మాట! పోవ్వకు బాగా పండిన తర్వాత ఎండబెట్టి, ఎండలోన అనుకుంట్టన్నారు! కాదమ్మో!ఎండబెట్టికండిమా! పాడైపోద్ది! మన యింట్లోన ఆరబెట్టినట్టు, ఏలాడగట్టాల. అప్పుడు తీసి సుట్టలు సుట్టుకొని, నోట్లోనెట్టి వూదితే,ఎలాగుంటాది, అంటననుకుంటన్నారు. నీనలపింటి మాట్లాడతాను.తప్పుకదూ! యిప్పుడికే ఎలాగంటే అలాగున్నారు.యిలపింటివి ఆలకిస్తే తిన్నగుంట్టారు. అప్పుడైతే మావోల్లు అదే పని.అడ్డపోగనెట్టుకొని గుప్పు గుప్పుని కాలిస్తే,గొప్పగుండేది.అలేటైనారందుకే!. అదేటమ్మ!ఆ జబ్బు!కేన్సరట!. ఒలమ్మ! నీకేటి పట్టుకున్నాది! యిన్రా నాయన! అని తల బాదుకున్నా యిన్నారా! ఎటైనాది. ఎప్పుడు సూడో, సుట్టలు కట్టడం, ఎట్టడం!
సుట్టలు కట్టడం, ఎట్టడం!. పోవ్వకు పంట ఎలాగ పండించొలు. ఎటుకాసనుకుంటన్నారు! మాది!. వోయిజాక్కి దెగ్గిరే! నాగావొలి, ఒంసదారా పారతాది కదా!అటుకాసే! నాకంతకమించి నాకు తెల్దు!. మా బాబు ఆ మద్దికాన యినిపించినాడమ్మా,ఒక పాట!. మా పోవ్వకు మీద పాట! పాపము పెల్లి అవనేదు, అందుకు నీనటుకేసి సికాకులము యెల్లి పిల్లని సూసినాను, సుట్ట బాగా పీకుతంది, బాగున్నది గానీ అన్నాడట. నాగొప్ప కోపమొచ్చినాది. యిప్పుడేవులైనున్నారు! ఎంత బాగా సదువుతన్నారు! అమ్ములు, బాబులు. ఎక్కడకొచ్చినాము! పొవ్వాకాడ! ఈ పోవ్వక్కాడా సుబ్బర్గ నలిపి పుచ్చిపన్ను సలుపెట్టినదనుకో పల్లు మద్దిలోన యిరకపెడితే! తెల్లారి నేసి సూత్తే పోవడమే. అంత మంచి మందన్నమాట. ఏంచేపు సుట్ట, సుట్ట అండమే గాని దానివల్ల యేటి మనకి అన్న మాట ఆలోచించినారా. సుట్టపీకి, సుట్టపీకినాగున్నాడు అని ఎప్పుడనకండి! యేటి. పనున్నది ఎలిపోతన్నాను......సరదాగా మాటాడ్డాకి వొచ్చినాను.....మా పొవ్వాక్కాడని ఎప్పుడు తిట్టకండి....దండము మీకు......ఇట్లు, సిర్రు, బుర్రు పొవ్వాకు......జయప్రభాశర్మ.
Comments
Post a Comment