ROTI

అవునూ!.....తెలీకడుగుతాను!.....మీ వొంటి కొవ్వు తియ్యాలంటే!....నేనుండాలా!.....తుంటి కొడితే పళ్ళు రాలినట్లు!....ఇరవైనాలుగంటలు!....యంత్రంలా నోరాడుతుంటే!....కొవ్వు కాదూ!......నూనెలు, నేతులు చూసి!....వెర్రెత్తిపోతే!....ఒళ్ళు రాక ఎవవుతుంది!.....ముందే జాగ్రత్తుంటే!.....అబ్బే!....జానేదో!.....అంత లేక సంత!...ఓ!...గోధుమ పిండి రొట్టెలు రాత్రి వేళ!....అనీ!...ప్రవరాఖ్య కబుర్లా!.....ఎంత బుద్ధిశాలి బుంగో అన్నట్లు!....ఆ రోటీలు!...ఒకటో రెండో తింటే ఏమో!.....అః...ఓ అరడజను!....దొంతులు పెట్టి లాగించేస్తావా!.....నీ బుర్రంతకూరా!.....ఆ పక్కన!.....పేరుకే రొట్టి గాని బకాసుర తిండా!....నువ్వెందుకు!.....రాలిపోతున్నావ్ అంటారా?.....అనండి!.....మీ గోల" గోధుమ పిండిని".....నేనే గనకా!...నన్ను పిసికేసి!....ఉండ చేసేసి!....కింద మీద తెగ బాదేస్తారా! పల్లెంకేసి!.....ఊపిరాడకుండా!....మూత పెట్టిసి!.....మూల పెడతారా?.....ఉండనీ!....బాగా పొంగుతాయంటారా!.....నన్ను మంట పెట్టి కాల్చిపారేస్తారా!....నా పొంగడం చూసి!.....మీరు పొంగి పోతారా!....పొంగుతున్నాయి, పొంగుతున్నాయి అనీ!.....నన్ను కుంగదీస్తారా!.....పూర్వం నావంక...... ఇంత ఆతృతగా  చూసేవారా!......ఎప్పుడైనా తినాలంటే!.....చిత్తుకి!.....చేసుకొనేవారు!.....నాకు ముచ్చటేసేది!.....పోనీలే!.....మనం అందుకోసమే పుట్టాం కదా!.....అనీ!....ఇప్పుడు!....పెద్ద గొప్ప!....చుక్కా రొట్టెలే!....తింటాము సుమండీ!....అంటూ!.....సోకులు!.....ఒయ్యారాలు!.....స్లిమ్ముగా ఉండాలి!.....ఓయబ్బో!...కుస్తీపోటీలకు వెళ్ళేవాళ్ళలా!....వస్తాదులా తయారైనక!.....అప్పుడా!.....భయం!....రొట్టెలంటే పంజాబీ వాళ్ళే తినేవారు!....అక్కడ నన్ను నొల్లి నోట్లో పడేసుకున్నది చాలకా!...యిక్కడానా!...ఎంచక్కా చక్కటి చారు!.....కమ్మటి కూర వండుకొని!.....కడుపు నిండా తిని పడుకొనే వారు!....ఈ సింగినాదలెరుగుదురా!...చస్తునాం  వినలేక!......మీ ఒళ్ళు ఒంటెలు తొక్కా!....నాకా ఉద్ధరింపు!.....ఒక్కటే నాబతుక్కి సంతోషం!....ఆ షిరిడీబాబాగారికి యిష్టమైనదాన్నని!......ఏంచేస్తాం!.....ఏజన్మ పాపవో!...ఈ జన్మకి కట్టికుడుపుతోంది!.....అనుభవించక ఛస్తామా!....సరే!...కానీయండి!....మీ సంతోషమే! .....నా సంతోషం!.....చేసుకోండి సంబరం!....చూసుకోండి ఆరోగ్యం!.....టీకే!....బై...ఇట్లు, రోజు కాలుతున్న రొట్టె......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles