Nene Addani

నాయన మానవా!.....మానను!.    నీకు పుణ్యం వుంటుందిరా తండ్రి!......నాకు పుణ్యం వద్దు!...పురుషార్థం వద్దు!....నాకు మణులు, మాణిక్యాలు కావాలి!.....అలానా!.....ఇంకేం  వద్దా!....ఆలోచించి చెప్తా!....ఓహో!...నీ మొహానికి ఆలోచనొకటి!......నోర్ముయ్!.....వాగావంటే ఏం చేస్తానో నాకే తెలీదు!.....తినేస్తున్నార్రా!....నన్ను పట్టుకొని!....ఇలాగేనా నన్ను బతకనివ్వరా!....అవున్లే!......నాకు గతి లేదు!....మీకు మతి లేదు!.....గతిలేనమ్మకు మతిలేని మొగుడని!.....ఇలాంటివి చూసే పెద్దలన్నారు!....ఈ సోది మాటకేం గానీ!.....నేనెవరో చెప్పలేదు కదూ!....బాబూ!...మహాప్రభో!.....అద్దానిరా!....మీ అందాన్ని మీరే తిలకించే అదృష్టాన్ని!....చస్తున్నాను!.....భరించలేక!....మీరు, మీ సౌందర్యమూనూ!....నన్ను చూసి ఏం రెచ్చిపోతున్నారో!!....ఎప్పుడు నాపైనే ద్యాస!....నా బాధ వర్ణనాతీతం!...తప్పిరి ముక్కులు,బండ ముక్కులు, ఉండ ముక్కులు!......తొర్రి పళ్ళు, పాచిపళ్ళు,పుచ్చిపళ్ళు,బొక్కిపళ్ళు,పారపాళ్లు!....చీపికళ్లు, మెచ్చుడుకళ్లు!.....చేటచెవులు,గూడచెవులు, డొప్పచెవులు!.....తుట్ట పెదవులు, బండపెదవులు!.....తొర్రిమూతి,సొట్టమూతి!.....దెప్పినుదురు, పిల్లినుదురు!......పట్టబుర్ర!వామ్మో!......చూడలేక!.....రక రకాల మొహాలు చస్తున్నాను!.......నావల్ల కాదమ్మో!.....రెండు ముక్కలైపోవాలనిపిస్తోంది!....అయినా ఊరుకుంటారా!.....నిమిషాల్లో మళ్ళీ కొని పడెయ్యరూ!....వీళ్ళ అందం గోల, ఆవుల తోలా!....అప్పుడు, ఇప్పుడు అంటూ లేదు!.....ఎప్పుడు పడితే అప్పుడే!....ఇదే పని!.. చూసుకోవడమే!.....ముసలోళ్ళు,పిల్లలు!....అందరికి నేనంటే అలుసే!.....పగిలిన అద్దం చూసుకోకూడదట!.....అద్దం మీద చుక్కలు వుండకూడదట!.....అలాగ్గాని ఉంటే నన్ను అవతల విసిరేయ్యాలట!.....ఎన్ని శాస్త్రాలు మళ్ళీ!.....చాల్లే!...మీ మొహానికి ఇదొక్కటే తక్కువ!...అనీ!.... అనుకుంటాను!.         గుడిలో దేవుడిదగ్గర మాత్రం వున్నప్పుడు!....గొప్ప సంతోషంగా ఉంటుంది!......అదెంత భాగ్యం!.....పెళ్లిళ్లలో సారె అనగానే నేనే ముందుంటాను!.....ఎంత శుభప్రదం!.....అంతే గానీ!.....వీళ్ళ సేవ నాకేం వస్తుంది!.....పెద్ద పనున్నట్టు!......చేతి అద్దం పెట్టుకొని!....వెనక్కి తిరిగి!.... వెనక అందం కూడా చూసేసుకోవాలి!.....నిలువుటద్దంలో!....అంత అవసరమా!....నా ప్రాణం విసిగెత్తిపోతోంది!.....నాకు విశ్రాన్తి ఉండాలికదా!....అర్ధం చేసుకోండి!.....ఆవేశ పడకండి!....ఏదో ఓ మాట అన్నానే గాని!....మీరంటే వల్లమాలిన ప్రేమ!....మీ అందాన్ని చూసుకోడానికి కదా!...నేనున్నది!....మళ్ళీ మీరు రాకపోతే!....ఎంత బాధ పడిపోతానో!....కాబట్టి!....మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి!....రండి!.....మరెందుకాలస్యం!....ఆలస్యం అమృతం విషం!......మరీ!....విసిగిస్తే తిట్లు తధ్యం!...అదీ విష్యం!....తిట్టుకోకండేం!.....వుంటాను!....ఇట్లు,చిర్రుబుర్రు చేతద్దం.......జయప్రభాశర్మ.





Comments

Popular posts from this blog

Articles