EGIRE GAALIPATAM

సంక్రాంతి వస్తే!.....మహా సందడి చేస్తాను....ఇలా ఆలా కాదు!......నన్ను చూస్తే చాలు!.....మహా సంబర పడిపోతారు!......చిన్నా పెద్దా అని లేకుండా!.....అందరికి  ఇష్టమైన దాన్ని!......గాలిలో ఎగురుతుంట్టాను!.....ఓహో.....గాలిపటమా?.....ఓహో!....గాలిపటమా కాదు!.....గాల్లో తేలే పటాన్ని!....మామూలుగా కాదు!........హద్దంటూ లేనిదాన్ని!.....యెంత ఎత్తైన ఎగిరే సమర్ధత ఉన్నదాన్ని!......నాలా ఎగిరేవారున్నారా?.....రంగు,రంగులు తయారు చేసి అమ్ముతుంటే!.....నేను కావాలంటూ పిల్లలు ఎంత అల్లరి చేస్తారో!......కానీ!.....నాకెంత భయమేస్తుందో!.....వాళ్ళ చేతిలో నేనుంటే!.....పాపం నే వొచ్చానని సంతోషంలో!.....నావైపే చూస్తూ!.....ఎక్కడ అపాయం కొని తెచ్చుకుంటారో అని!......అన్నెం పున్నెం ఎరుగని పిల్లల్ని!.....పొట్టన పెట్టేసుకుంటానో అని!.....చెబుదామన్నా!.....ఎలా!.......యెంత బాధనిపిస్తుందో!......జరగరానిది ఏది జరగకూడదని కోరుకుంటూవుంటాను!.....కొన్ని చోట్లయితే నా పండగని!....ఎంత  వేడుకగా చేసుకుంటారో!.....దారపు ఉండను పట్టుకొని!......వదులుతుంట్టే!.....నా ఆనందానికి అవధులుండవ్!.......అలా యెంత ఎతైన  ఎగరాలని అనుకుంటుటాను!........ఆకాశాన్ని అందుకోవాలనుకుంటాను!........మాటల్లో చెప్పలేనంత సంబర
పడిపోతాను!.....నన్ను తయారు చేయడానికి!......ఇంట్లో తల్లి తండ్రులు కూడా!.....ఎన్ని పాట్లు పడుతుంటారో!.....పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలని!......వారు నాతొ ఆడుకుంటుంటే!....ఎంత మురిసిపోతారో!......మన నందమూరి తారక రామారావు గారి సినిమాలో కూడా!.......నా పేరు మీద పాటుంది!.....అందుకోండి మరి!.......నన్ను కాదండీ బాబూ!....రాగం అందుకోండి అనీ!.....చెప్పలేరా!....ఐతే!......నేనే చెప్పేస్తున్నా!..."ఎగిరే గాలి పటానికి దారం ఆధారం".....యెంత చక్కని పాటో!....అంటే దీన్ని బట్టి మీకేమి అర్ధమైంది!......అంత గొప్పదాన్ననేగా!....అద్ది సంగతి!.....పోవే బోడి!.......నువ్వు నీ కాగితాలు, ఆ దారాలు!.....చాల్లే!....అంత చాటింపు అవసరం లేదు!....వినలేక చస్తున్నాం అనీ విసుక్కోకండి!.....తక్కువ ఖర్చు!.....ఎక్కువ ఆనందం పంచే!.....ఈ బుల్లి గాలిపటం!.....ఆహ్లాద పరచటం కోసం!....మహా తాపత్రయపడుతుంటుంది!....చివరిగా చిన్న అభ్యర్ధన!......మేడలపైన పిల్లల్ని!......నన్ను పెట్టి ఆడనివ్వకండి!......సాగర తీరాలకి తీసుకెళ్లి!......నన్ను ఎగరెయ్యకండి!.......నేనేమైన పర్వాలేదు!.....మీ క్షేమమే!.....నా క్షేమం!.....గుర్తుపెట్టుకోండి!.....వెళ్లిపోతున్నా!.. మీ పిల్లలు జాగ్రత్త!...బై.....ఇట్లు,మీ గాలి పటం.....జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles