"Kokoroko"
పూర్వమైతే నన్ను బాగా గుర్తించేవారు......నన్నే పెద్ద అలారంగా భావించేవారు.....నేను లేచిన తరువాతే......అందరు మేల్కొనేవారు....".కొక్కొరొకో" అని కూత వినబడితే చాలు.......వెలిగేవుంటుంది.....నేనెవరో. ఆ......కోడిని......మీ పకోడీని....అబ్బో ఆనందం.....నా పేరు చెప్పగానే నోటిలో లాలాజలం.....ఆపండి నాయన!....మీ తిండి గోల....మీరు నన్ను చూసి....ఆప్యాయంగా పిలిచినా.....బెదిరి చస్తున్నాను.....ఎక్కడ కత్తికో ఖండ చేసెస్తారో అని.....నాలో దైవం దాగున్నాడు తెలుసా.....అదేనండీ......"కుక్కుటేశ్వరుణ్ణి"......అబద్ధమనుకుంటున్నారేమో......కావాలంటే .....".తూర్పుగోదావరి జిల్లా"కెళ్ళి ......అడగండి చెబుతారు.....చాల్లే ఆపు.....నీ సోది.....వినలేక చస్తున్నాం....మా కూర కోసం పుట్టినదానివి.....మేము ఎప్పుడంటే అప్పుడు....తెచ్చుకొని...హ్యాపీగా రకరకాలు చేసుకొని.....తినడానికి వున్నదానివి.....సుత్తి కొట్టకు....మా జిహ్వ చాపల్యాన్ని చంపకు.....అని తిడతారని నాకు తెల్సు. కాస్త నన్ను చెప్పనిస్తారా!.....ముయ్యండి కాసేపైనా నోరు.....ఎలావుండేదాన్నో మీకేం తెల్సు....పూర్వకాలం తపస్సు చేసే మునులు కూడా.....నా కూతకే.....తొలికోడి కూసిందంటూ....మేల్కొనేవారు....గడియారాలు, సెల్ఫోన్ అలారాలు యిప్పుడు వచ్చాయి గానీ....లేకపోతె నేనే కింగుని....ఇప్పటికీ చాలా గ్రామాల్లో మన మేలుకొలుపే....అందర్నీ లేపి నా పీక కోయించుకుంటాను....అదే నా ప్రత్యేకత.....నాకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరేమో......సంక్రాతి వచ్చిందంటే....అందరికి పండగే....నాకు తప్పా......పందేల పేరుతొ.....నోరులేని నన్ను హింస పెట్టేసి.....కత్తులు కట్టేసి,పోలీసుల కళ్ళు కప్పేసి.......లక్షలకి లక్షలు ఖర్చు పెట్టేసి....ఏవైనా బావుందా....నా ప్రాణాలతో చెలగాటమా.....ఓడిపోతే కక్షలు,కార్పణ్యాలా.....నన్ను అడ్డం పెట్టుకొని ఆట్లాడతారా. ఆ తిండికూడా కాస్త తగ్గించండి.....నన్ను విపరీతంగా తింటే.....కొవ్వు పెరుగుతుందని....వైద్యులు చెబుతున్నా వినరా!....ఎప్పుడు చూసిన.....చికెన్లు, మఁటన్లు, బిరియానీల గోలేనా!.....జీవహింస చేయరాదన్న మాటను విస్మరిస్తున్నారు......మీ రుచుల మాట దేవుడెరుగు.....నా ప్రాణం గిల గిల కొట్టుకుపోతుంటే.....అయ్యో అనిపించడంలే......ఏం చేస్తాం.... నా ఖర్మ.....ఇలా కాలింది....తినండి...కాదనను.....మీ కోసమే పుట్టాను కదా.....నాటుకోడా, యీకోడా, ఆకోడా....అనకండి....మీకు పుణ్యం ఉంటుంది....ఏ కోడైన ప్రాణం ఒకటే కదా....అంచేత యిటుపైన.....నన్ను కూరలా కాకుండా....ప్రాణిలా చూడాలని ......అవసరార్ధం అదిరే కూరగా వాడుకోవాలని.....నా మనవి....కోడి కునుకు తీసేవా....అని అంటారు చాలామంది.....అవునండీ అందర్నీ లేపాలి....నేను చావాలి.....యెర్రిదాన్ని కాపోతే.....ఎందుకు లేపాలి చెప్పండి.....అందుకే నిద్ర తక్కువ.....అలాంటి నన్ను.... బాగా చూడాలి మరి.....కోడీ నీ రెట్ట మందంటే కొర్రెక్కి కూచుంది.....అనీ కూడా తిట్టకండేం.....ప్లీజ్.....వుంటాను....ఇట్లు, కసి కోడి.....జయప్రభాశర్మ.
Comments
Post a Comment