"KANJEERA"
" ఏవే జయప్రభా"....నీకెంత ధైర్యమే!.....ఆ డప్పు గురించి.....చాటింపేశావే!.......మరి నా గురించి చెప్పలేదేమీ !....నీ కంటికి నే కనిపించలేదా?.....గుర్తుకు రాలేదా?......నీ పొగరలావుందన్న మాట!....అయ్యో ఎంత మాట "కంజీరస్వామి".....చెబుదామని అనుకున్నంతలో.....మీరొచ్చారు.....సరే!...కానీ!. చిత్తం, చిత్తం, మహాప్రభో!...ఆగ్రహించవలదు!....మొదలు పెట్టేస్తున్నా స్వామి!....ముఖ పుస్తక స్నేహితులారా!.....మా కంజీర వాయిద్యంవారు....ఎంత గొప్పవారనగా!....వారి గురించి ఎంత చెప్పినా.....తక్కువే అవుతుంది. ఒక చిన్న సంచీలో....ఎంచక్కా మనవెంట.....తీసుకెళ్లే వాద్య పరికరం ఏదనగా!.....కంజీర మాత్రమే!.....మనం చేతితో వాయిస్తూ......హాయిగా యింకో చేత్తో తాళం కూడా వేసుకొనే......సదుపాయం గల వాద్య పరికరం.....పాట పాడుతూ....ఎంతసేపైనా....మైమరచిపోతాం వీరు గనక ఉంటే.....వీరిని తీసుకెళ్ళీ.....భజనలు, గజళ్ళు, సామాజిక చైతన్యగీతాలు, జానపదగీతాలు.....ఎన్ని పాడుతుంటారో......చూస్తే ముచ్చటేస్తుంది.
మన "గజల్ శ్రీనివాసుగారు".....అదేనండీ!....ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గజల్ గాయకులు!....వారి వెంట వీరు ఉండాల్సిందే.....వీరికి అంత బ్రహ్మరధం పడుతుంటారు వారు.....మరి వీరిద్దరి స్నేహ బంధం అలాంటిది....మహానుభావులు, సినీ రచయిత, సాహిత్యవేత్త......ఇటీవలే మనల్ని విడిచివెళ్లిన.....సినీ వినీలాకాశ ధృవతార......జ్ఞానపీట్ అవార్డు గ్రహీత....డాక్టర్.సి.నారాయణరెడ్డిగారి మానసపుత్రుడైతే.....కంజీరాగారి మనసు దోచిన పుత్రులు కూడా"గజల్ శ్రీనివాస్" గారు......అలాంటి చరిత్ర మా కంజీరావారిది!.....అందరికీ అందుబాటు ధరలో వుంటారు......ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారు....విద్యుత్తు ఉండాలనే నిబంధన లేదు.....ఉంటే ఆనందం.....లేకపోయినా మహా ఆనందం.....ఎప్పుడు అందర్నీ ఉత్సాహపరస్తూ, ఉప్పొంగి పోవుటయే వీరి నైజం.....కంజీరావారితో భజనలు చేస్తుంటే!......మనల్ని మనం మైమరచిపోతాం.....సామాజిక చైతన్య గీతాలాలపిస్తే......సమాజంలో మార్పు రావాల్సిందే.....అభ్యుదయ భావాల వారైతే.....వారనుకున్నది సాధించితీరాల్సిందే.......అంత గొప్పవారు మా కంజీరావారు......కంజీరావారు వేంచేసారంటే!.....అంతా జయమే!......ప్రశంసల పరంపరే!....అందరితో వీరికి భేటీ!......వారికి వారే సాటి!......వీరికి లేరు పోటీ.!......ఇంతటితో ముగిస్తున్న ఏంటీ!. ఇంక చాలు!.....ఆపివేయుము జయప్రభా! ఆపివేయుము. ఇహ నా మనసు స్థిమితపడినది....నన్ను ఇంత గారవించిన నీకు.....ఏమి కావలెనో కోరుకొనుము.....ఏమీ వద్దు స్వామి! వద్దు!.....తమరి గురించి వ్యాసం రాసే భాగ్యం కలిగినందుకు.....ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను స్వామి!......అటులనా! కానిమ్ము!......దీర్ఘసుమంగళీభవ.......ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తూ......స్వామి!....ఏమీ!.....ఆ ఐశ్వర్యం తప్పా.....మిగిలనవి తీసుకుంటా స్వామి! కాదనవలదు!......డబ్బు పాపిష్టిది.....మిమ్మల్ని కూడా మరచిపోతాను......ఇలానే ఉండాలి జయప్రభ స్వామి!......మార్పు రాకుండా ఎంచక్కా!....మీకు పాదాభివందనం చేస్తూ....సెలవు తీసుకుంటా కంజీర స్వామి!....సరే వెడలుము......మళ్ళీ అవసరమైనచో పిలిచెదను.....రమ్ము!.....అయ్యో అపరాధం! అపరాధం స్వామి!....మీరు రమ్ము అనగా.....అర్ధము మారి,రగడ చేయుదురు.....వచ్చి వెడలుము అనాలి స్వామి!......హతవిధీ! ఏమిటీ పరీక్ష!.....మానవులు మహా మేధావులుకదా......నోటితో ఎంతైనా జయింతురు......స్వామి! వెడలుతున్నాను......మా వాళ్లంతా ఎదురుచూచుచుంటిరి....నమోనమః. ఇట్లు, జయప్రభాశర్మ.
Comments
Post a Comment