Dussaluva

నన్ను చూస్తే తెగ పొంగిపోతారు!.....పెద్దలు,పిల్లలు!....అందరూను!.....అంత ఆనందం!.....ఏం మురిసిపోతారో!......మాటల్లో చెప్పలేం!....ఇంతకీ!....నేనెవరనుకున్నారు!....మీ శాలువానండీ!....మీ మెడలొ వెయ్యగానే!.......మీ కంటే సంబరపడేది నేనే!.....మీరు ఎంత కోటీశ్వరులైన!....పొందలేని ఆనందం మీ సొంతం!.....నే వచ్చానంటే!.    జీవితాంతం చెప్పుకుంటూనే వుంటారు!....నా గురించి!.....వచ్చిన వాళ్లందరికీ చూపిస్తూ!.....ఎన్ని ఏళ్ళు గడచినా కొత్తగానే కనిపిస్తుంటాను!......మీ కళ్ళకి!.    మిమ్మల్ని గుర్తించినందుకు!....ఆజన్మాంతం రుణపడి ఉంటామని!.....ఎప్పటికి మరువలేమని!.....ఎంతో విశ్వాసం కనబరుస్తూ వుంటారు!....ఏదో గుడ్డ చాల్లే!....అనీ!....ఏ ఒక్కరు విసురు చూపించరు!.....అంత గొప్పతనం నాది!.....కొందరికైతే  మెడలొ వెయ్యగానే నన్ను!.....ఆనందబాష్పాలు!....ఆగవు గాక ఆగవు!.....పూర్వం కాశ్మీర్ శాలువాలు!....అందుబాటులో పెద్దగా ఉండేవి కావు!....కానీ!....ఇప్పుడు భలేగా దొరుకుతున్నాయని!.....ప్రశంసలే ప్రశంసలు!....పట్టు శాలువలైతే కళ్ళు చెదిరేలా వున్నాయి!...నిర్వాహకులు కూడా!......ఎంత మనసు పెట్టి చేస్తున్నారో!.....మంచి మంచి కార్యక్రమాలు!....కళాకారులను గుర్తించడం కూడా!.....ఎంతో హర్షించ దగ్గ విష్యం!....ఆనాటి నుంచి ఈ నాటివరకు!....వేదిక అనగానే నునుండాల్సిందే!....నాకు అంత బ్రహ్మరధం పడుతున్నారంటే!.....ఎంత గర్వన్గా ఉంటుందో!....ఎందరో మహానుభావులు!....మేధావులు!.....అపర సరస్వతి పుత్రులు!....అలాంటి వారి సన్మానానికి!....నేనర్హురాలిని ఆంటే!......అంత కంటే ఇంకేం కావాలి!......నా జన్మ ధన్యం కదా!.....మన దేశమే కాదు!.....ఇతర దేశాల్లో కూడా!....సన్మానగ్రహితులకు!....సేవ చేసే భాగ్యం....వారి మెడలొ వుండే అదృష్టం!....నాకే దక్కిందనుటలో!......అతిశయోక్తి లేదు!.....ఇలాగే!....ఎప్పటికీ!.....మీ గుర్తింపుకి!....నేను కూడా భాగస్వామిగా వుండాలని!....కోరుకుంటూ!....కళాకారులందరికి  శతకోటివందనాలు!.....వుంటాను!...నమస్కారం.....ఇట్లు, మీ మెడ సత్కారలంకారం, మీ శాలువా......జయప్రభాశర్మ.




Comments

Popular posts from this blog

Articles