POOLA DUKANAM
మొగలి పొట్ట రంగు....గులాబీరేకుల్లా పెదవులు......సంపంగి మొగ్గలా ముక్కు.......అన్నింటినీ మించి మల్లెలాంటి మనసు......అనీ వర్ణిస్తూ......మాతో పోలుస్తుంటారే.....ఆ పువ్వులం....గుబాళించే పువ్వులం....పండగలైనా....పెళ్ళిళ్ళైనా.....పూజలైనా....మీ నవ్వులతో పాటు......విరి నవ్వులు కూడా ఉండాల్సిందే......మీ సందడి వాతావరణం....సువాసన భరితమవ్వాల్సిందే......మాకు మీరిచ్చే ఆదరణ అలాంటిది.....పూల తోరణాలు...పూలదండలు.....పూల జడలు..వాహనాల అలంకరణలు.....తలంబ్రాల సన్నివేశంలో కూడా మేమే.....అలాంటి మమ్మల్ని...మా పూలబ్బి......హోల్సేలు మార్కెట్లో కొనుక్కు తెచ్చుకొని......పూల వ్యాపారం చేసుకొని......ఎంచక్కా కుటుంబాన్ని పోషిస్తుంటే......మాకెంత సంబరంగా ఉంటుందో!.....బస్ స్టాండు లోను, బజార్లలోనూ......పూలబ్బి సందడి చూడాలీ!......భలే ముచ్చటేస్తుంది......పిల్లల మొదలు.....పెద్దల వరకు.....వచ్చి పోతూ......బేరాలాడుతూ......నిత్యం వచ్చేవాళ్ళని పలకరిస్తూ.......దారపు రీలు తీసుకొని.....హడావిడి చేస్తూ......ఒకవైపు పొట్లాలు కడుతూ....మరో వైపు మాలలల్లుతూ.......యింకో వైపు ఆర్దర్లు అందుకుంటూ....నేనెక్కడ వాడిపోయి.....కంది పోతానో .....అనీ....భయపడుతూ......అదే పనిగా నీళ్లు జల్లుకుంటూ......ఏం గాబరా గోవిందుడైపోతాడో చెప్పలేం!.....ఎంత కష్టమైనా......తెలియనిది ఈ వ్యాపారం.......ఘుమ ఘుమా వాసనలు రుప్పేస్తుంటే......ఆరోగ్యమేగాని......అనారోగ్యం రానేరాదు......మనసు దోచిన......సుమ పరిమళ వీచికలం......పూర్వం మా కాలంలో మాత్రమే పూచేవాళ్ళం.......ఇప్పుడైతే సంవత్సరమంతా పూచి.....ఎంతో సేవ చేస్తున్నాము....ముఖ్యన్గా బంతి, చేమంతి, గులాబీ, కనకాంబరాలు, లిల్లీ......మా మొగలి, సంపంగి, మల్లి మాత్రం......పాపం కాలంలోనే విరబూస్తున్నాయి......మొత్తానికి ఖాళీ అన్నది లేకుండా.....మా పూలబ్బికి చేతినిండా పనే......కాకపోతే చిన్న చిక్కు ఏంటంటే.....పూల కొట్లో పూల మీద......నీళ్లు జల్లీ, జల్లీ......ఎవరి సిగలో పూలు చూసిన......నీళ్లు జల్లేస్తున్నాడు......అక్కడే వస్తోంది తంటా......విరుచుకు పడిపోకండేం.......పాపం చాలా మంచోడు.....రామ, రామ......మీతో వాగి, వాగి నోరు నొప్పెడుతోంది......ఉంటాము......ఇలాగే పూస్తుంటాము......ఇట్లు, ఎప్పటికీ సువాసనల భరితం.......వికసించే మీ పువ్వులం......జయప్రభాశర్మ.
Comments
Post a Comment