NIGHA NETRAM

నా కన్ను కప్పి ఏ  పని చేయలేరు!....నేనుగాని ఉన్నానో!....చచ్చేరే!......తాట తీస్తా!.....నన్ను చూస్తే పరుగో, పరుగు!.....అబద్దాలాడేరో!.....ఇంక అంతే సంగతులు!.....అన్యాయాలు! అక్రమాలు!.....జరిగినచోట మూడో నేత్రాన్ని!....శివుని మూడో నేత్రం తెరిస్తే!.....భస్మం ఐపోతారని!.....పురాణాల్లో చెప్పగా విన్నాం!.....కానీ!.....కలియుగంలో నిజంగా శివుని నేత్రమల్లే.....భస్మం చేసే పని నాకే అప్పచెబుతున్నారు!.    అవునా!....అలాగా!......తమరి నామధేయం!.     నా నామధేయము!..."నిఘా నేత్రము"!......దొంగతనాలు,దోపిడీలు!.....రేగింగులు, గొలుసు దొంగతనాలు!...హత్యలు, మానభంగాలు, లంచగొండితనాలు! ఇలాంటి వాటికి కీలక పాత్ర వహిస్తుంటాను!.....నాదే ప్రధాన భూమిక!.....ముఖ్య పాత్రధారిని!.....అందుకే పోలీస్ డిపార్టుమెంటువారు!.....నన్నెంతో ఆదరిస్తూ వుంటారు!.....నా పైన ఎంతో ప్రేమ కురిపిస్తుంటారు!...నాకెంత గర్వాంగా ఉంటుందో!....చెప్పలేని ఆనందం వేస్తుంది!..నాన్నలా చూస్తుంటే!....లేకపోతె!....పాపం అందంగావున్న ఆడపిల్లని చూస్తే!....వెంటపడి వేధించి!....ప్రేమించలేదని వీరంగాలా?......ప్రాణాలతో చెలగాటాలా?......మీకు అక్కాచెల్లెళ్లు లేరా?......ఉంటే ఇలా చేస్తే ఊరుకుంటారా?.....ఇవన్నీ అడిగి దులిపెయ్యాలనిపిస్తుంది!......కడిగి ఆరెయ్యాలనిపిస్తుంది!....తెల్లారి ఇంటిముందు పూలు కోసుకుంటుంటే!.......మెడలొ గొలుసు తెంపేస్తారా!.....ఆ ఇల్లాలు ఎంత వుసూరని ఏడుస్తుంది!....హిందూ సాంప్రదాయంలో!......భారత స్త్రీ మంగళసూత్రాలు తెంచటం అంటే!....ఎంత తప్పు!.....ఎంత అపచారం!....వస్తువు  పోయిందానికంటే....దీనికోసమే బాధపడుతుంది.....ఎక్కడైనా ఎవరితోనైనా!.....చిన్న భేదాభిప్రాయాలున్న!......చిలికి చిలికి వాన చేసి రెచ్చిపోతావా?...క్షణికావేశంలో.....ప్రాణం తీసి పైశాచికానందం పొందుతావా?.    నీ వయసేంటో!......నువ్వెంటో చూసుకోకుండా!......వావి వరసలు కూడా మరచి!......అత్యాచారానికి ఒడికడతావా!......ఏవెరుగనట్టు తిరుగుతావా?......మర్దర్లు, మానభంగాలు!.....అంత సులభమైపోయాయా?......లంచగొండితనం మరి చెప్పకర్లే!......ఎక్కడ చూసినా!......అవినీతి, లంచగొండితనం!....అందుకే ఇవన్నీ చూసీ, చూసీ!......విసిగిపోయి!.....నన్ను కనిపెట్టిన మహానుభావుడు ఎవరో గానీ!....ఏదిచ్చిన  ఋణం తీరదు!......వీటన్నిటికీ!.....మందు నేనే!......ఆటకట్టిస్తున్నా!.....మాములుగా కాదు!......గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి ఒక్కొక్కరికి!.....ఇంకొక్క మాట!.....ఇలాంటి పనులు చేసేముందు!....నన్ను దృష్టిలో పెట్టుకొని!...నా నుంచి ఎలాగైనా తప్పించుకొనే మార్గం కోసం!.....తెగ ఆలోచిస్తారు!....ప్రణాళిక సిద్ధం చేస్తారు.....అయినా మనం తగ్గితేగా!.....తప్పుకుంటేగా!....మంచి పనుల కోసం ఉన్నదాన్ని!......అందరి క్షేమం కోరేదాన్ని!...మీతో బంధుత్వమున్నదాన్ని!.....మీ ఆత్మీయురాలిని!.....మీ స్నేహితురాలిని!......ఎప్పటికి మీతో వుండాలని కోరుకుంటూ!.....సెలవ్!....వుంటా.....ఇట్లు, నేరస్తులకు శిక్షవిధించే "మీ నిఘా నేత్రం"......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles