"Sirastranam"
ఏం విసుకుంటున్నార్రా బాబూ!....మిమ్మల్ని అంటిపెట్టుకొని! .....అయ్యో!...పది కాలాల పాటు బాగుండాలని కోరుకుంటుంటే!....ఇదా నాకు మీరిచ్చే బహుమానం!.....అంతేలే!.....మంచికి రోజులెక్కడున్నాయ్!...ఇంతకీ నా పేరు చెప్పి మండాలి కదా!.....బోడి గిన్నెలా మొహం నేనూను!....ఇంకెవరు!.....హెల్మెట్ నాయన!....హెల్మెట్!.....అదే శిరస్త్రాణము!.......ఉంటే నిలుస్తుంది మీ ప్రాణము!....నన్నుఉద్ధరిస్తున్నట్లు!.....పెట్టుకోవాలంటే!.....ముక్కులు, మూల్గులూను!.......నేనే ఉండి చూసుకుంటే!.....ఎంత క్షేమంగా వుంటారో!.....పాపం పోలీసువారు!....పడిగాపులు పడి!..... కనిపెట్టి ప్రశ్నిస్తే కోపాలా?......మీకోసమే కదా చెబుతున్నారు!.....నాయన! మర్చిపోయావురా!....అని పరుగు పరుగునొచ్చి అమ్మ చేతికందిస్తే విసురులా? చాల్లే అని!. ఏవండీ? హెల్మెట్ అని చేస్తున్న పని ఆపేసి!....వచ్చి ఇచ్చిన భార్య వైపు కోరా కోరా చూపులా?.......చదువుకున్నా చదువు లేనివాళ్ళలా ఆలోచిస్తావా?......ఏది ఏమైనా బాగుందా?.......తెలివి తెల్లారినట్లే ఉంది!.....చెమట పట్టేస్తోంది!.....పట్ట వచ్చేస్తోంది!.....పారెయ్యండవతల అంటావా?......చెమట పడితే తుడుచుకో!........పట్ట బుర్ర ఐపోతే!.....హైర్ వీవింగ్ చేయించుకో!......అంతేగానీ!......నోరుంది కదా అనీ వాక్కు!.....నీ దుడుకు దూలాలెక్కా!......హెల్మెట్ పెట్టుకోకుండా!.....రయ్యిమని దూసుకెళ్లిపోతుంటే!.....నీ బండి గాల్లో కెగిరినా!.....ధామ్మని ఎవర్ని గుద్దినా!.....బతికి బట్టకడతావా?.......నీ వాళ్ళని మొర్రోమని ఏడిపించి!.....ఏం బావుకుంటావ్....అదే నేనుంటే!.....కంటికి రెప్పలా కాచుకుంటాను!......పోలీసు వారి కళ్ళు కప్పి తిరగుతావా?.....వాళ్ళ కంటపడితే!.....డబ్బు కట్టాల్సి వస్తుందని!......దొంగెత్తులా?......అంత బాధ అవసరమా?......నన్ను ధరించి మెల్లిగా నడిపిస్తూ వెళితే!......ఎవ్వరు నీ జోలికి రానే రారు!......దొంగపన్లు చేసేవాళ్ళు చూడు!.....ఎంచక్కా నన్ను పెట్టుకొని!....రాముడు మంచి బాలుడు! అన్నట్టుగా!....నటిస్తూ ఎలా వెళ్ళిపోతారో కళ్ళ ముందునుంచి!......పోలీసువారు కూడా పోల్చుకోలేనంతగా!....భళా! దొంగలు దొరల్లా తిరగాలంటే నేనుండాల్సిందే!......మరేం చేస్తాం!.....ప్రాణం విలువ గొప్పది కదా!...ప్రాణంఅందరికి సమానమే!....దొంగైనా!......దొర అయినా!...నా పని నే చేసుకుపోవడమే!....అది నా భాద్యత!...సుత్తి కొట్టకే తల్లీ!....శిరసు బద్దలవుతోంది!.....ఆపవే!.....నీకు దండం పెడతా!....అన్నా తిట్టుకోను!.....నా ప్రాణం మీరు!.....మీరుంటేనే నేను!......లేకపోతె నేను లేను!......దుకాణాల్లో మూల పడి వుండడానికా!....నో!....అదికాదు.....ఒక మంచి పనికి నేను!.....ఆగమన్నా ఆగను!....పోలీసు వారికి సహకరించకపోతే!....ఊరుకోమన్నా ఊరుకోను!....ఫుట్పాతుపై కూడా!....రంగు, రంగులతో!.....ఎదురుచూస్తుంటాను!...... సరేనా....వుంటాను....ఇట్లు,శిరస్సున శిరస్త్రాణం......జయప్రభాశర్మ.
Comments
Post a Comment