ULLIPAI

ఏవండోయ్!....ఇలా రండి!....ఓ మాట చెప్పాలి!...."తెల్లనీ పూలు పూస్తున్న ఉల్లి సిరిమల్లె అవుతుందా"....అనీ....ఓ కవిగారు ఓ సినిమాలో!.....సెలవిచ్చారట!....సినిమా కోసం ఆయన రాశారు!.....బానే వుంది!....మరి నా మనసు?.....ఎంత నొచ్చుకుందో!....నోట్లో ఏదైనా రుచిగా పడితే కదా!.....మనం బాగుండేది!.....తింటే కదా!....ఆరోగ్యం!.....ఆరోగ్యం ఉంటే!.....ముస్తాబు అయ్యేది!....జడలో తురుముకొనేది!....అదే లేకపోతె! .....ఊహు!.....ఎన్నున్నా శుద్ధ దండగ!.....నీరసం తోడేస్తుంటే ఏం షోకులు!.....అంచేత!....ఎవరి గొప్ప వారిది!.....మంచి సువాసన భరితం సిరిమల్లె ఐతే!.....చెప్పలేని రుచినిచ్చేది నేను!.....ఏవిటా పాటలు!...మాటాలూను!......నేను లేక పొతే రోజు గడుస్తుందా!.....పెసరట్టు!...ఉప్మా!...ఉల్లి రవ్వ!....ఉల్లి దోస!...ఊతప్పం....మసాలా కూర!....బిరియాని!....సాంబార్!....ఒకటేమిటి!....ఇందు కలదు అందులేదని సందేహము వలదు! .....ఉల్లి ముందుండున్ సుమ్మీ!...అలాంటి నన్ను ఆడిపోసుకుంటారా!.....పక్కింటివాళ్ళకి కూడా!.....నా వాసన తగిలేసరికి!...నోరూరిపోతుంది!...నేను భూమిలోపల  ఉంటుండగానే!.....నా పైకి ఎగపడతారు!.....ఉల్లికాడలని!.....నా పువ్వుని కూడా వదలరు!....పోపు వేసుకుంటే!....సూపర్ ఫ్లేవరంటూ!....ఆఖరికి చొప్పండి బాబూ!.....అదైనా వదుల్తారా అంటే!....అబ్బే!....మహా మోజు!....ఏవండీ!...మండు వేసవిలో!.....నన్ను చద్దెన్నంతో తింటే!....తస్సాదియ్యా!.....వుంటుందీ!....వడదెబ్బ తగిలితే!....నా మీదొట్టు!.....నమ్ముతారా!....పల్లెల్లో!.....రైతన్నలు!.....నన్నే నమ్ముకుంటారు!.....నా సేవకు మెచ్చుకుంటారు!.  యింకో మాట!....చెబితే!....హబ్బా!....అసహ్యించుకుంటారేమో!.....నన్ను బాగా పేస్ట్ చేసి తలకు మెత్తుకుంటే!......తలలో పేలు మాటు మాయం!....ఇంకొందరుంటారే!.....టక్కు టమారి!...గజకర్ణ గోకర్ణలు!...టోపీరాయళ్ళు!.....అవసరార్ధం!.....భలే వాడతారు నన్ను!......ఎందుకో చెప్పనా!.....చంకలో పెడితే!.......జ్వరం వస్తుందని!....ఇలాంటివి కూడా సినిమాలో చూపిస్తున్నారు కదా!....చూసే వుంటారు....నే చెప్పడానికేముంది!.  ఇహ మీరున్నారే!.....పచ్చి ఉల్లిపాయ!....అసలొదిలేదిలేదు!.....ఎక్కడికెళ్లినా వాచిపోయినట్టే!....నన్ను చూడగానే!...లాగించేయడమే!.....దాబా కెళ్తే పళ్లెంలో నేనే!.....ఫైవ్ స్టార్ హోటల్ కెళ్ళినా!....మన స్వాగతమే పళ్లెంలో!...ఓ....ఛెక్రాలు కోసేసి!...నిమ్మరసం పిండేసి!....ఉప్పు జల్లేసి!.....కోరుకుడే కొరుకుడు!....మరి అంత ఇష్టమైన దాన్ని!....ఏమైనా అనొచ్చా!.....ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు!....అంచేత!....హాయిగా తినండి!...తిండిని ఆస్వాదించండి!...నోటికొచ్చినట్టు అనకండి!...వుంటాను!....ఇట్లు,మీ వంటింటి తల్లి, ఈ ఉల్లి......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles