News Reporter
కాగితం, కలం మా ఆయుధం. అక్షరం మా ఆస్తి. ప్రతి నిముషం వార్తా సేకరణ మా వృత్తి. నా పేరేదైనా,నన్ను మాత్రం" విలేకరి" అనీ అంటారు. అలా పిలిస్తేనే నాకెంతో సంతోషంగా ఉంటుంది. వాస్తవాలతో కూడిన వార్తలను నిరంతరం ప్రజలకు చేరవేస్తుంటే,మాటల్లో చెప్పలేనంత ఆనందమేస్తుంది.నిజం నిర్భయంగా తెలపటమే మా లక్ష్యం. ఏ నిమిషాన ఏం జరుగుతుందో,ఎక్కడికి వెళ్లాల్సివస్తుందో, అనీ అప్రమత్తంగా ఉండాల్సివస్తుంది. మర్దర్లు,మానభంగాలు,దొంగతనాలు, దోపిడీలు, కొట్లాటలు,ఆత్మహత్యలు, ప్రక్రుతి విపత్తులు,రాజకీయాలు,సినీరంగం....ఒకటేమిటి!..ప్రతీ ఒక్క వార్తా మా కంటిలో పడకుండా తప్పించుకోలేవంటే నమ్ముతారా!. వార్త తెలిసిందంటే టక్కున వాలేది ముందు మా విలేకరి. రాత్రయినా, పగలైనా, రాళ్ళల్లో రప్పల్లో రాసుకుంటూ యాతన పడుతూనే ఉంటాము. చిన్న పొరపాటు దొర్లినా, ఎంత వేగం దూసేద్దామా అన్నట్లు ఎదురుచూపులు చూసేవారెందరో. మా కుటుంబసమస్యలు,మా ఆర్ధిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, సరదాలు, సంతోషాలు, విందులు, వినోదాలు అన్ని మరచి,ప్రజాశ్రేయస్సుకై పాటుపడుతుంటాము. కొన్ని వార్తలవల్ల విపరీతమైన పరిణామాలెదుర్కోవలసివస్తుంది. ఐనా తలొగ్గక అత్యంత దైర్యంగా ముందుకి సాగాల్సివస్తుంది. సామాజిక సేవలో భాగంగా, చేస్తున్న వృత్తిలో,ఏమాత్రం ప్రచురణలోగాని,ప్రసారాల్లోగాని,ఏమాత్రం తప్పు దొర్లినా,అనేక పరిణామాలకి దారితీస్తుంది. అనేక విమర్శలు చవి చూడాల్సివస్తుంది. ఒక్కోసారి మాపై దాడులు కూడా జరుగుతుంటాయి. ఎంతైనా ఏటికెదురీదుతూనే ఉంటాం.ఎందుకంటే! మీరు మీ యింట్లో కూర్చొని, హాయిగా ఉదయాన్నే కాఫి కప్పు చేతిలో పెట్టుకొని,మా పేపర్ చదువుతున్నారంటే! అంతకంటే ఆనందం ఇంకేముంటుంది!...దానికి కారకులం మేమేకదా! కాదంటారా!. లేకపోతె! అంత ఉదయాన్నే కాకిలా వాలేది నేనేకదండి!...అదేనండి పేపరు.ప్రతి నిమిషం మీకోసం,వార్తలు సేకరించే పనిలో ఉంటే,మమ్మల్నిమేము మరచిపోతాము. ఎన్ని ఒత్తిళ్లున్నా తలొగ్గము. ఆస్తులు, అంతస్తులకోసం పాకులాడే నైజం లేని వాళ్ళం.ఉన్నదానితో తృప్తి పడే అల్పసంతోషులం.భేషజాల జోలికి పోనివాళ్ళము. ఎందరో రాజకీయనాయకులు,ప్రముఖ వ్యాపారవేత్తలు,సినీరంగానికి చెందిన ప్రముఖులు,క్రీడారంగానికి చెందినవారు,ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఎందరినో కలుస్తుంటాము!వారితో పరిచయాలేర్పడుతుంటాయి!కానీ!మా హద్దులో మేముంటు, వినయ విధేయతలతో మసలుతుంటాము. అందుకే మమ్మల్ని ఎంత ప్రముఖులైన గౌరవ మర్యాదలిస్తూ, ఎంతో అభిమానిస్తూవుంటారు. అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది! ఐనా మా వృత్తినే దైవంగా భవిస్తూ,నిష్కల్మషంగా కడదాకా పాడుబడేవారెవరంటే! అది!మేమె! మీ ప్రశంసలే మాకు కొండంత అండ దండలు. సామాజిక సేవే మా ద్యేయం.మీ ఆదరాభిమానాలు, మాకు పద్మశ్రీ,పద్మభూషణు అవార్డులు. మీ ఆనందమే మా ఆనందం.ఎప్పటికి మీ గుండెల్లో దాగి వుండే మీ" విలేకరి". వుంటాను. ధన్యవాదాలు. ఇట్లు, సదా మీ సేవలో, మీ రిపోర్టర్........జయప్రభాశర్మ.
Comments
Post a Comment