TOPI

టోపీ ఎట్టెడా!....ఆడెట్రా టోపీ ఎట్టేయగలడు చూస్కో!....మకు తెల్సు టోపెడతాడని!.......బోడి పేరు చెప్పక్కర్లేదులెండి!......అంటాననుకున్నారా!.....ప్రశ్న లేదు!.....నా మర్యాదే వేరు......వాళ్ళతో నాకేంటి!..ఆ "టోపీ" నేనే......కానీ....నాది రాచ మర్యాద.....ఎవరు యి పోలిక కనిపెట్టారో గాని!.....కనిపిస్తే వుంది!.....నేనేంటి నా లెక్కేంటి!.....నాలికుంది కదా అని వాగడమే!......నీ పట్టబుర్ర కవరేజికి నేనే!.....అయ్యవారు పాపం వానోస్తే తడవకుండా చూసేది నేనే!......ఎండకి ఎండకుండా భద్రంగా కాపాడేది నేనే!.....అప్పుడప్పుడు.....నీ సోకుకి నేనే!....నన్ను ఖాతరు చేయకుండా వుండండి చూస్తాను!.....అసలు ఏమనుకుంటున్నారు! నా గురించి.!....సరిహద్దుల్లో.....మంచుగడ్డల్లో.....మనకోసం రాత్రి పగలు.....ఇంటిని మరచి.....కుటుంబ సభ్యులని విడచి.....కాపలా కాస్తున్న.....మన దేశ సైనికుల తలపై ఉన్న స్థాయి నాది!.....పోలీస్ వారు నన్ను యెంత గౌరవిస్తారు!.....వైమానిక దళం వారు నేనుంటే గాని రారు!......నావికా దళం వారికి మంచి స్నేహితురాలిని!.....ఆఖరికి!......అగ్ని మాపక దళం వారు కూడా యెంత ఆదరిస్తారో!.......అలాంటి పదవి నాది!......తెలియకపోతే మూసుకోండి!....ఎవరో ఏదో చేసారని నన్ను అంటారా?.....అది మీ తప్పు!.....ఎవరేది చెప్పినా నమ్మటమేనా?....మీరే తెలివి తేటలు ప్రదర్శిస్తే!......అవతలివారి బుట్టలో ఎందుకు పడతారు......వాళ్ళేదో ఊడబడుస్తారేమో అనీ...ఆశ.....అవతలివారిది మరీ అత్యాశ.....అది చూసి వాళ్ళు రెచ్చిపోతే......నన్ను నిందించడమా!.....బాగుందమ్మా!బాగుంది.....ఏం!.....మంచి గుర్తు రాదేం!.....సినిమా హీరోలు......మోడలింగ్ చేసేవాళ్ళు.....ఎన్ని సార్లు నన్ను పెట్టి వ్యాపారం చెయ్యలేదు!.......అవన్నీ పూడిదలో పోసిన పన్నీరులా వుంది.....నేను గొప్పతనం చెప్పుకోవడం ఏంటీ!.....దౌర్బాగ్యం కాకపొతే!.....మీలాంటి వారికి చెప్పినా....చెప్పకపోయినా ఒకటే!.....నేతాజీ సుభాష్ చంద్ర బోస్, జవహర్లాల్ నెహ్రు......అలాంటి మహానుభావుల తలపై టోపీని!......ఎందరో స్వాతంత్ర్య సమర యోదుల వెంట అంటి పెట్టుకు తిరిగేదాన్ని!......వీరాధి వీరుల,సూరాధిసూరుల అభిమానాన్ని పొందిన దాన్ని!........మామూలు దాన్ని కాదండోయ్.....ప్లీజ్......ఇంకెప్పుడు.......ఇలాంటి మాటలాడకండి.....వుంటాను.....థాంక్యూ......ఇట్లు,జయప్రభాశర్మ.







Comments

Popular posts from this blog

Articles