Theylu
తేలుకుట్టిన దొంగ!....ఎర్రతేలులా మొహం ఇదీనూ!.....అవునూ! ఎప్పుడు ఏదో ఒకటి వాగడమేనా!...ఇంకేం పని ఉండదా!......మీకో నమస్కారంరా బాబూ!....మీ దగ్గర వున్నన్ని మాటలు!.....ప్రపంచం మొత్తం వెదకినా ఉండవేమో!......ఓమాటడుగుతాను!....సమాధానం చెప్పండి!...మీరే గొప్పనుకుంటున్నారా?.....తప్పు!......ఆ ఆలోచన మార్చుకోండి!....సృష్టిలో ప్రతీ ప్రాణి గొప్పదే!....ఇంత తెలివితేటలుండీ!.....గుర్తిచరేం!....ఏదో ఒకటి విమర్శిస్తూనే వుంటారు!....దానికి తోడు సామెతలొకటి!.....అవునండి!.....మాకు రూపు లేకపోవచ్చు!....మేము విష పూరితం కావచ్చు!....కానీ!....మేము కుట్టాలని ఎప్పుడూ అనుకోమండి!....ఏదో మా బతుకు మేం బతుకుతాం!.....మీరే చూసుకోకుండా!....మమ్మల్ని తొక్కడం అదీ చేస్తూవుంటారు!.....దాంతో ఆ గాబరాలొ!....అనుకోకుండా కుట్టాల్సి వస్తుంది!....మీరు మాత్రం!.....ఎవరైనా మీ జోలికి!....అనవసరంగా వస్తే! ఏం చేస్తారు!..ఊరుకుంటారా!.....తాట తియ్యరూ!.......అలాగే మేం కూడా!.....అంతేగానీ హానీ తలపెట్టాలని ఎప్పుడూ అనుకోము!.....అందుకే!.....తెల్లారి లేచి నరుడి కంట పడకూడదనే!.....దణ్ణం పెట్టుకుంటాం!.....కంట పడినా మీరు వొదలరు గనక!....మాకంటే అతి ప్రమాదకరమైన వారు మీరే!.....మాకైతే మందు ఉందేమో!...కానీ!...మనిషి కాటుకి మందు లేదంటారని మాకు తెల్సు బాబూ!.....మీకు నోరుంది!....పడిపోడానికి!.....మాకు నోర్లేదు!.....అంతే తేడా!.....మీకు మాకు!.....ఇంత తిడతారె?...మీ ఇంట చూలింత ఉంటే!....నేను కనిపించగానే!.....కర్ర తెచ్చి కొట్టేసి!.....చంపేసి!.....గొయ్యి తీసి పాతిపెట్టేస్తారా!....ఏవంటే!....మనవడో, మనవరాలో పుట్టినప్పుడు!...దిష్టి పూసలకింద పనికొస్తాననా!.....నాది ప్రాణం కాదు!....మీ అఘాయిత్యం కూలా!.....మేమేదో మా యాతన పడుతుంటే!....పొట్టన పెట్టుకుంటారా!.....సీత బాధలు సీతవి!.....పీత బాధలు పీతవీను!.....అల్ప ప్రాణిని నేనే దొరికానా!.......ఏమాత్రం శక్తి లేని దాన్ని కాబట్టే!.....భగవంతుడు విషపూరిత ప్రాణిగా సృష్టించాడు!.....ఆమ్మో!....లేకపోతె!.....మిమ్మల్ని తట్టుకోవడం!......మా తరమా!....నలిపి పారెయ్యరూ!....ఇటుపైన నే కనిపిస్తే!......దయచేసి వదిలేయండి!.....వచ్చే జన్మలో!...మీ పంచన పడి ఉండి!.....సేవ చేసుకుంటాను!....సరేనా!.....నే వెళ్ళొస్తాను!....మీ కంటబడకుండా బతుకుతాను!....ఇట్లు,దిన దిన గండం,దీర్ఘాయుష్షు, ఎర్ర తేలు.....జయప్రభాశర్మ.
Comments
Post a Comment