"PRASNA?????"

అవునూ!.....రోజు తెల్లవారి లేవడం!.....తిండం, తిరగడం, పడుక్కోవడం!....వుంది, లేదు!......యింకా సంపాదించేద్దామా!.....పక్కోడికంటే ఇంకా గొప్పగుండాలి!.....బైకుంటే కారు!....కారుంటే చాలదు!.....మనకో  సొంత ఫ్లైట్!.....టాటా,బిర్లా, అంబానీ!.....ఆ జాబితా ప్రముఖ పారిశ్రామికవేత్తల్లా ఉంటే!.....అస్సిరిబజ్జ!...ఇంకా బాగుంటుందని!....యింకా దున్నేయ్యొచ్చని!ఇదే యావ!......ఇవే ఆలోచనలు!....ఆశకి అంతు లేదు!.....ఉన్నకొద్దీ ఇంకా కావాలనే ద్యాస!.....ఆశ ఉండచ్చు!....కానీ! ఎప్పుడూ అత్యాశ పనికి రాదు!.....ఆ ఆలోచనే ప్రమాదకరమైనది!.....ఎవరు నువ్వు?......ఇందాకనుంచి చూస్తున్నాం.!.....తెగ క్లాసు పీకుతున్నావ్?.  అవును కదూ!....నా పేరు చెప్పడం మర్చిపోయాను!.....నాలిక కర్చుకోవాల్సిందే!.....నా పేరు..."జవాబు దొరకని ప్రశ్న".....ఏవిటీ!....ఈ పేరెప్పుడూ వినలేదమ్మా!.....విడ్డూరంగా వుంది!.....అవునా!.....సరే.!.....దగ్గరకొచ్చేరు!......అదే నాక్కావలసింది!.    ఏవిటో!....అది!... చెప్పేడు!.....ఆ!...ఏం లేదు!....గ్రాహంబెల్ అంటారు!.....రైట్ సోదరులంటారు!........మేడం క్యూరీ అంటారు!......వాస్కోడిగామా అంటారు!.....ఇలా ఎంతో మంది శాస్త్రవేత్తలు గుర్తుకొస్తూనే వుంటారు!....మరి!.....మీరు  తింటున్న తిండి గురించి!.....ఒక్క నిమిషమైన ఆలోచించారా? అబ్బే!....ఎందుకూ!....పని లేకపోతె సరి!.....టైం వేస్ట్!......ఆ!....ఏవుంది!.....తెచ్చిపెడితే!....వండి వడ్డిస్తున్నారు!.....దీనికోసం బుర్ర బద్దలు కొట్టుకోవడం అవసరమా?.....అవునండి!....అవసరమే!...ఆలోచించాలి!.....మనకెందుకులే!....అనుకోకూడదు!....మీ
 జీవితంలో ప్రతి సెకెను!....భాగస్వాములు!....వారి దయా బిక్ష!....విద్య లేని శాస్త్రవేత్తలు!....వారిని ఎంతైనా స్మరించుకొనుట!....మన ధర్మం!...మన బాధ్యత!...చిన్న మాట!...వినండి విసుక్కోకుండా!.....కోతి నుంచి పుట్టాడు మానవుడు!.....అనీ అంటారు!.....అంటే వారి సంతతే మీరంతా!...కదా!....ఇందులో కులం, మతం, జాతి భేదాలు లేవు!.....మీరు సృష్టించుకున్నది ఇదంతా!...మీరంతా బంధుత్వంతో కూడుకున్నవారే!....అలాగే!....ధాన్యం పంట మన తిండికి పనికొస్తుంది!.....పప్పుధాన్యాలు పండించి యిలా తినాలి!......దీనిలోంచి నూనోస్తుంది!.....ఇది వంటకానికి  పనికొస్తుంది!....ఇది తింటే విషం!.....ఈ మొక్క ఔషధగుణాలు కలిగినది!.....ఫలానా పండు తింటే!.....మధురాతిమధురం!....ఈ పువ్వు పూజకి!...యి పువ్వు సిగలో ముడుచుకోవచ్చు!......కూరగాయలు ఇవి!...ఈ విధంగా కూర చెయ్యాలి!...మసాలా దినుసులు ఇవి!.......పశువుల నుంచి పాలు!....అదీ!...ఆవు,గేదె మాత్రమే!.....ఆ పాల నుంచి పెరుగు, వెన్న నెయ్యి తయారవుతాయి!........పిండి వంటలు!.....ఇసుక ఇలా ఉపయోగపడుతుంది!....నీళ్లు ఇలా తాగాలి!.....భగవంతుడు మనకి ప్రసాదించిన!.....సృష్టిలో ఏ ఒక్కటి వొదలకుండా!.......అన్నింటిని అణువణువు!
......పరిశీలించి,పరిశోధించిన!......మానవుని ఎప్పుడైనా కనీసం తలచుకుంటున్నారా?......వారికి జ్ఞానం తప్పా!.....విద్య ఎక్కడుందని?.....వున్నత విద్య నభ్యసించినవారు,
 ఔషదపరిశ్రమల వారు!......మందు కనిపెడితే!.....ఎన్నో పరిశోధనలు చేసి.....ప్రయోగశాలలకి పంపించి!.....ఆ తరువాత!....మన కందుబాటులోకి తీసుకురాగలుగుతున్నారు!...అలాంటిది!.....క్రీస్తు పూర్వం!......కొన్ని వేల సంత్సరాల క్రితం!...ఇవన్నీ కనిపెట్టిన!.......మానవుని గొప్పతనం!......పొగిడి తీరాల్సిందే!


..... ఇలా చెప్పుకుంటూ పొతే!....వారం కూడా చాలదు!....మీరు తినే ఆహారం!......వాడుకొనే వస్తువు!.....అన్ని కనిపెడితే కదా!......మీరున్నారు!.....ఏమైనా సాధించగలుగుతున్నారు!.....దేవుని స్మరియించుకున్నట్లే!.....ఆనాటి మానవుని కూడా స్మరియించుకోవాల్సిందే!.....అంత గొప్పవాడు మీ మానవుడు!.....జీవితానికి అర్ధం, పరమార్ధం తెలిపిన!.....వారికి శతకోటి వందనాలు!....జై మానవా!....జై జై మానవా!.......హమ్మయ్య!....ఉక్రోషం వెళ్ళేగ్రక్కేసాను!....వీళ్ళ ఫోజు పొలాలు దున్నా!.....వినలేక చస్తున్నాను!....హమ్మా!......ఏవనుకుంటున్నారో!......మరి వెళ్ళొస్తాను!....టీకే!....బై.....ఇట్లు, జవాబు దొరకని ప్రశ్న......జయప్రభాశర్మ.



Comments

Popular posts from this blog

Articles