JANAPA CHENU
గోంగూరని పోలి వుంటాను!.....కానీ గోగూరని కాను!......ఆకులు,పువ్వులు,కాండం,పులుపు.....అచ్చం గోంగూరే!....నమ్ముతారా!.....పల్లెల్లో పరిచయస్తురాలినే!.....కానీ!......అందరికి తేలియాలిగా!.....ఇంతకీ!....నా పేరు చెప్పలేదు కదూ!......జనప. జనప చేను చూస్తే!.....గోంగూర చేనా! అన్నట్టు ఉంట్టుంది...చూడ ముచ్చటగా!......యిది చాలా లాభాలు తెచ్చి పెట్టే పంట...రైతన్నలు యిది పండించటానికి చాల ఆసక్తి కనబరచేవారు గతంలో....ఈ చేను బాగా ముదిరిన వెంటనే తీసి......ఊరి చివర ఉన్న, ఉపయోగంలో లేని, ఎవరు నీరు వాడని చెరువులో.......ఎందుకంటే మైలు దూరం లో వూరుతున్నప్పుడు.......భరించలేని దుర్వాసన కాబట్టి!...రోజుల కొద్దీ ఊరవేసి!....బాగా ఊరి చేతికి నార వస్తుంది అనిపించినప్పుడు.....వాటిని చెరువులోంచ్చి పైకి తీసి!.....కూలీలను పెట్టి నార ఒలిపించి!....మంచి ఎండలో అదే పనిగా......బాగా ఎండేంతవరకు......ఎండబెడతారు.....ఆ తరువాత కట్టలుగా కట్టి! ......తూనికలేసి అమ్ముతుంటారు.......వీటిని వ్యాపారాలు.....జ్యూట్ మిల్లులకు చేరవేస్తుంటారు......నా ఉపయోగాలేమిటో చెప్పగలరా?....ఊహు....తెలీదు కదూ!.....చెబుతాను వినండి.....బస్తాలు,సంచులు,బట్టలు,తాళ్లు......వీటి తయారీకి నేనే.....నన్ను చూస్తే తెగ ఎగబడి కొనుక్కునేవారు......వ్యాపారస్తులు యెంత వ్యాపారం చేసేవారో!.....ఉత్తరాంధ్ర వారైతే నారని చేకు అంటారు తెలుసా!......యింకో విష్యం కూడా!......గోంగూరని జనపకూర అని అంటారు.....రెంటికి దగ్గర పోలికనేమో!.....నార తీసిన తరువాత కర్రల్ని.....వంట చేరుకుగా వాడుతూంట్టారు.....సంవత్సరమంతా సరిపడేట్టుగా !.......బాగా ఎండబెట్టి !.....కట్టలుగా కట్టి!......చెట్ల పైన కూడా పెట్టుకుట్టుంటారు.....వీటిని కటిక కర్రలని పిలుస్తారు....ఈ కర్రలు మండేటంతగా! ......యింకే కర్రలు మండవు......అంత త్వరగా మండి......విపరీతమైన మంటనిస్తాయి.....ఆఖరికి జనప నారని చూస్తే!......చిన్నా, చితకా వ్యాపారులుకూడా వదిలేవారు కారు.......నారని ఎండబెడుతుంటే!..అక్కడికి కూడా వచ్చేసేవారు!.......కావిళ్ళతో
కర్రపెండలం తెచ్చి......చేకు కట్టని బట్టి......ఖరీదు కట్టి.....కర్ర పెండలం అమ్మేవారు......ప్రభుత్వం వారైతే....హెలికాఫ్టర్ని పుంపించి మందు జల్లించేవారు.......చేనుకు చీడ పట్టకుండా!......మరి అలాంటి నన్ను!......యీమధ్య కాలంలో!......రైతన్నలు విస్మరిస్తున్నారు......నన్నే గాని మళ్ళీ పండిస్తే!....చక్కటి సంచులు, గొనె బస్తాలు యివ్వనూ!.....ప్లాస్టిక్ వల్ల యెంత కాలుష్యం ఎదుర్కొంటున్నారు.....అనారోగ్య పాలవుతున్నారు.......వద్దర్రా అనీ మొత్తుకుంటున్నా!.....వింటున్నారా!.....అబ్బే ఖాతరు లేదు....యిప్పటికైనా మించిపోలే!......ప్రభుత్వానికి చెప్పండి!.......ప్రోత్సహించమనండి!.....రైతన్నలని ఉత్సాహపరచమనండి!....సరేనా!....ఓకే!....వుంటాను!...అతి త్వరలో మీ ముందుకు రావాలని కోరుకుంటూ!....ఇట్లు,మీ జనపనార......జయప్రభాశర్మ.
Comments
Post a Comment