ACCIDENT
గిల గిలా కొట్టుకుంటుంటే.....అలా చూస్తున్నారా...ఏం చెయ్యలేరా?........మాట్లాడాలంటే......కోన ఊపిరితో వున్నాను.....ఎలా?......ఆమ్మో....భరించలేని బాధ!.....అయినా తప్పదుగా......చెప్పాలి....నా పేరు "ప్రాణమండి".....నేను పని మీద రోడ్డెక్కేసరికీ!.....వెనకనుంచి గుర్తు తెలియని వాహనం.....గుద్దేసి వెళ్లిపోయిందండీ!.......తెల్లారి లేచి ఎవరి మొహం చూశానో ఏమో!.....అయినా ఒకర్ని ఎందుకు నిందించాలి!.......ఎవరి ఖర్మకు ఎవరు కర్తలు!.....వస్తానని ఎంత ఎదురు చూస్తున్నారో ఏమో!....మా కుటుంబసభ్యులు!. నేను పడగానే!.....ఎక్కడ వాహనాలక్కడే నిలిపివేసి!.....పరుగు పరుగునొచ్చి!.....నా జేబులో పర్సు తీసి! ......చిరునామా కోసం వెదకి!.....ఇంకా దొరకకపోతే!.....నా ఫోన్ తీసుకొని!.....మా వాళ్లకి తెలియజేసే ప్రయత్నం చేసి!......ఆంబులెన్సుని రప్పించి!.....ఎంతో తపన పడుతున్నారు.......నా ప్రాణం నిలపడానికి!......బానే వుంది. అదే మీరు నన్ను సెకన్లలో .....వెనకా, ముందు ఆలోచించకుండా!.....వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి!....జాయిన్ చేసి!......అవసరమైన రక్తం.....మీలో ఎవరిది సరిపడుతుందో......వైద్యుల సలహా మేరకు యిస్తే!......ఎంత బాగుండేది!.....కాలం ఎంత విలువైనది. కానీ!....మీలో భయం!...ఏదో చేద్దామని వున్నా......పోలీసు వారు వస్తే! .......ఏం ప్రశ్నిస్తారో!....అనీ...ఒకటే సందేహం!......ఏం కాదండీ!.....వారు కూడా.....మీరు చేసే మంచి పనికి అభినందించి.......అవార్డులిచ్చి, సత్కరించి, ప్రశంసిస్తారు తెలుసా!......ప్రాణం ఎంతో విలువైనది!......పొతే తిరిగిరానిది!......కొందామన్నా దొరకనిది!.....వెల లేనిది!....మీరుకూడా యింటి కెళ్ళినా!..... ఎంతో బాధపడుతుంటారు!.....ఏమైందో!.....ఎలావున్నారో అని!.....ఆకలి ఉండదు!......నిద్రపట్టదు!.......ఎక్కడో పుట్టీ!.....ఎక్కడో పెరిగీ!......ముక్కు మొహం తెలియకపోయినా......మీ బాధ వర్ణనాతీతం!....అందుకే ప్రతీ రోజు......"లోకా సమస్తా సుఖినో భవంతు".....అంటాము.....ఎందుకంటే!......మానవులం గనక!....మానవత్వం వుంది గనక......ఇటుపైన....ఆలోచించి.....మీ సాయశక్తులా ......సహాయసహకారాలందింస్తూ.....సేవ చేస్తారని ఆశిస్తూ....సెలవ్ తీసుకుంటున్నా.....ఇట్లు.....మీ ప్రాణం......జయప్రభాశర్మ.
Comments
Post a Comment