Pani Puri
బండి,ముచ్చిసంచి, సిల్వర్ బిందె, ఓ ప్లాస్టిక్ బకెట్టు! కనిపిస్తే!టక్కున కాళ్ళు ఆగిపోవడమే.ఏవంటే!పానీపూరి సీను అదంతా. చంపేస్తున్నార్రా బాబు. భరించలేక చస్తున్నాను.ఇంట్లొ చేసుకు తగలడచ్చు కదా!.అబ్బే! వాళ్ళావిడ కందిపోదూ. ఇది బావుంది!. అనారోగ్యలొచ్చాయంటే రావా మరి!. ఎక్కడో నీళ్లు పట్టేసి,ఆ బిందైనా తోవకుండా,ఎప్పుడో చేసిన గుల్లలు, వాటిలో కుక్కేసి కూర, ప్లేటులో పెట్టేసి ఇస్తే,ఎగరేసుకు తినెయ్యడమే. ఆత్మారాముణ్ణి క్షోభ పెట్టవన్నమాట. ఆకలేస్తే ఏదో గడ్డి కడుపులో తోసెయ్యడమే. అదే! "మమతా మోహన్ దాసు" పాట, ఏంటది! ఆ! గుర్తొచ్చింది,"ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే" వద్దులెండి, బాగోదు! ఓయబ్బో! ఏం హుషారొచ్చేసిందో
గురుడుకి. తగ్గు!తగ్గు! చిందులేసేవో మీ ఆవిడ చేతిలో ఐపోతావు సుమీ!. అసలు విషయం మరచిపోయాము.ఆ చెయ్యి బిందెలో ముంచేసి యిస్తుంటే ఏవి అనిపించిందా. అందులో ఆషాడం, ఈగలు ముసురుతుంటే జబ్బులెందుకు రావు. మనం కోరి తెచ్చుకున్నవే అన్నీను. శుభ్రత, పరిశుభ్రత అని ఎందుకన్నారు. మాకు తెలుసులేవమ్మా! ఈ డైలాగు. "అసెంబ్లీ రౌడీలో" బ్రహ్మానందం గారు అన్నారు, పాకీజాతో.....అనీ అంటారని నాకు తెలుసు.నాకవన్నీ అనవసరం.నీకు ఇది ఏ సినిమాలోది అని అడగలె. సంభాషణ మరల్చకు. పూర్వం మనకివి ఉండేవా? అబ్బే!. ఆ ఉత్తరాదివాళ్ళు తీసుకొస్తే కాపీ కొడతావా!. పాపం వాళ్ళు మంచివాళ్ళే. లేకపోతె! కాపీరైట్స్ మావని అంటే ఏం చేసేవారు. రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నిరకాల పళ్ళు ఊరిస్తూ ఉంటాయి. అవి నచ్చవా?. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు అందుకే. వింటేగా!. ఈ మధ్య కాలంలో విందులు, వినోదాల్లో కూడా నేనే అఘోరిస్తున్నాను. ఆఖరికి పెళ్లిళ్లు ఐన నేనే పెద్ద గొప్పగా.ఆ! ఇక్కడ పానీ పూరి! రండంటే రండని, పోటీలు పడిపోయి ఏం తింటారో. అందించలేక వాడి తల ప్రాణం తోక్కొస్తుంది. అంత అవసరమా. ఎంత కాలమైందో తిండి తిని అన్నట్టు. అడ్డవైన గడ్డి తినటం, మంచాలెక్కడమూను. మీ ఒక్కరితో పోతుందా. ఈగదంతా ఇంటిల్లిపాదికి పాకింది అనీ. ఇంట్లొ వాళ్లందరికీ ఓ చుట్టూ చుడుతేగాని పోదు ఎవొచ్చినా. అంచేత జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యం పట్ల. ఎప్పుడో చిత్తుగా తినండి. అదే పనిగా మెక్కితే మాత్రం ప్రమాదం. అటుపైన మీ యిష్టం....వుంటా....బై....ఇట్లు, వద్దన్నా తింటున్న పానీపూరి......జయప్రభాశర్మ.
Comments
Post a Comment