UDUKU UPMA
ఏవిటండి చూస్తున్నాను!.....అదే పనిగా యెగతాళి చేస్తున్నారు!.....మరీ ఇంత వెటకారం పనికి రాదు!...నిజంగా నా వంక మీరు చూడ్డం లేదా?.....నిలువు నిస్తారం అబద్దాలాడ్డం ఏమైనా బాగుందా?.....అమ్మో! అమ్మో!.....ఏవేక్షను!....ఘుమ, ఘుమ లాడిపోతుంటే!.....ఆగలేకా!....అదేదో సినిమాలో పాటలా!...."ఎగరేసుకుపోతా నిన్ను ఎగరేసుకుపోతా"...అన్నట్టు!.....తెగ ఎగబడి పోతారు!....అయ్యో! అయ్యో!...."నా గోల గొంగలెత్తుకెళ్లా"....అసలు విషయం మర్చిపోయాను!....నా కోపం నేనూను!....తమరి ఆత్మారాముడు ఘోషించకుండా ఉండాలంటే!.....రకరకాల టిఫిన్లు అఘోరించాలి కదా!...అదేనండి నేను!.....అలుసైన "ఉప్మాని".....ఇడ్లీలు,దోసెలు,పూరీలు.....అబ్బో సూపర్ అంటారా!....నన్ను యీసడిస్తారా!....పేస్ బుక్కుల్లో, వాట్సాప్లో.....ఎక్కడ పడితే అక్కడ గాలి తీస్తారా!....నేనంటే ఏవనుకుంటున్నారు!.....పూర్వం పెళ్లిళ్లలో నన్నే ముందు పెట్టేవారు.....వంటవాళ్లు చక్కగా తయారు చేసి!......అరిటాకులోవేసి పెడితే!.....ఎగరేసుకు తినీ!....యెంత ఆనంద పడేవారో పెళ్ళివారు!....అందుకే కొన్ని ఇళ్లలో!....యిప్పటికీ పెళ్లి ఉప్మా చేసేయ్!.....అనీ... పతిదేవుళ్లు సతులకు ఆర్దర్ యిస్తూ వుంటారు......పెసరట్టు అనగానే!....మనముండాల్సిందే!.....మా యిద్దరి జత.....అంత పేరెన్నికగన్నది. నెయ్యి,కరివేపాకు వాసన ఋప్పుతుంటే!....వదుల్తారా!.....నిమిషాల్లో శ్రమపెట్టకుండా....మీ ఆకలి మంటని తీర్చే....అతి సులభమైన అల్పాహారం ఎవరు అంటే!....ఛాలెంజ్ చేస్తున్నా!.....అది నేనే!.....టొమాటో బాత్ ఎవరమ్మా?......నేనే కదా!. అవును మరి!....ఉప్మా యెంత బాగా చేస్తే!.....అంత రుచి....ఏదో చేసి పారేస్తే!.....పుస్తకాలు అంటించే పేస్టులాగే వుంటాను....యిప్పటి వాళ్ళైతే కొందరు.....ఆలు,ఉల్లి,బీన్సు, కేరెట్, టమేటో....అన్ని విజిటబుల్స్ వేసుకొని.....ఎంచక్కా చేసుకొని.....ప్రశంసలు కురిపిస్తున్నారో.....ఆ విజిటబుల్స్ లో ఎన్ని పోషక విలువలుంటాయి!....ఆహా!....ఏమీ రుచి అనీ! ......మైమరచిపోరు!.....అలాంటి నన్ను ఆడిపోసుకుంటారా!....ఏవిటండీ ఇడ్లి గొప్పా!.....ఏవుంది ఉప్పు తప్పా!.....బోడి దోస!....అదీ అంతే!.....దోరగా కాలడం తప్పా!....పూరీ మెప్పా!....నూనె ముద్ద! .......అబ్బో!....నాకు తెలుసండి!.....ఎవరేవిటో!.......ఆపండి మీ గొప్పలు!.....తిన్నంత తినేసి!....ఏంటా ఫోజులు!.....చాలా హీట్ మీద వున్నాను!.....మరి మాటాడను!....వుంటాను.....బై.....ఇట్లు,ఉడుకుల ఉప్మా.....జయప్రభాశర్మ.
Comments
Post a Comment