Ammo Selfie

నేనంటే!.....విపరీతమైన మోజు!.....తుమ్మినా!....దగ్గినా!....నవ్వినా!....ఏడ్చినా!....గెంతులేసినా!...రాత్రయినా!....పగలైనా!....ఎండైన!....వానైనా!....పడి చస్తారు!....తగ్గమన్నా!....తగ్గరు!.....మీ ఖర్మ!....అనీ!.....చూస్తూ ఊరుకోవలసి వస్తోంది!....నీకేంటి ఆ బాధ!.....అనీ!.....ప్రశ్నించవచ్చు!.....నాకు గాక!....మీకా బాధ!.....ఆ సెల్ఫీ భూతాన్ని!....నేనే గనక!....అదేనండీ!....నా పేరే సెల్ఫీ!....పట్టుకుంది నా పిచ్చి!.....తీసుకుంటున్నప్పుడు ఉంటే ఏమార్చి!....మరిచిపోవాలి నీ గురించి!....అంతే కదండీ మరి!....ఏదో సరదా ఉండచ్చు!...మరీ శ్రుతి  మించితే!.....ఏమవుతుంది!....దేనికైనా హద్దనేది ఉంటుంది!.....లేకపోతె ఏంటీ!...నీకు ఫోటో తీయడానికి!.....మనుషులు కరువైపోయారా?.....కరువైతే మానుకో!.....ఏదో!....చిన్ననాటి స్నేహితులు!....అనుకోకుండా కలిస్తే ముచ్చట!.....వృద్ధాప్యంతో వున్న!....తాతలు, నాన్నమ్మలు

ఉంటే!....అయ్యో!...ఏక్షణాన ఎలా వుంటారో!...ఏమో!....అని జ్ఞాపకంగా ఉంటుందని!....తీసుకో!.....బాగుంటుంది!...అపాయకరమైనవి కావు!....తీపి గుర్తులు!.....దానికి అర్ధం వుంది!.....అంతే గాని!.....సముద్రం మధ్యలో కెళ్ళి!......నాచు పట్టి!....జారేవిధంగా వున్న బండరాళ్ల పైకి ఎక్కి!.....సెల్ఫీ అంటావా!.....నడుస్తున్న రైలు ఎక్కితీసుకుంటావా!.....అక్కడనుంచి పడిపోయినా!.......కరెంటు తీగలు తగిలినా!.....ఆనవాళ్లు లేకుండా పోతావ్!......కొండలెక్కేసి!....ఆ చివారకెళ్ళి ఫోటోనా!....నీ సరదా సంతకెళ్లా!.....ఆ లోయలో పడితే!....అమ్మా!...అబ్బా!....అని అరిచినా వినిపిస్తుందా!.......జంతుప్రదర్శనశాలకెళ్లి!.......భయంకరమైన సింహాలు, పులులతో తందానాల!....నీకు వాటితో ఫొటోలా!...వాటి మానాన అవి బతుకుతుంటే!.....రెచ్చగొడతావా?......నీ దగ్గరకొచ్చాయా?.......నీవూసేత్తాయ?........జ్ఞానం లేదూ?... అవి ఆంటే మృగాలు!......నీకేమైంది మనిషివికదా!......చూసి రమ్మంటే కాల్చుకొస్తావ్!......ఏవిటి అదంతా గొప్పే!.....గొప్పకి డిప్ప కాల్చుకోకు!......ఊసుపోనమ్మ పిల్లి బుర్ర గొరిగిందట!.....అలాగే వుంది నీవాలకం!.....మీ వాళ్ళ ప్రాణాలు తోడేసి!......వాళ్లకి చుక్కలు మస్తుగా చూపించి!.....వేలకి వేలు పోసి ఫోను కొనిపించేసి!.....చేస్తున్న పని ఇదా!......యెంత కష్టమైనా!.....పిల్లల సరదా కన్ననా!.....పోనీలే!...అని సమర్ధించుకున్న!....తల్లి తండ్రులకు!.....ఇదా బహుమతి!.....ఎంత చదువుకుంటే మాత్రం!.....ఏం లాభం!...అందుకే అన్నాడు!...వెనకటికి!.....ఓ మహానుభావుడు!....."చదువెందుకు సంకనాకను.....పది ఆవులు కాచుకుంటే పాలున్ పెరుగున్"!......ఎంత విరక్తి పుట్టిందో ఏమో!.....ఏది ఏమైనా!....మీరు చేసేది బాలేదు!.....అంచేత!...అమ్మ, నాన్నలని ఏడిపించకండి!.....బుద్ధిగా చదివి వృద్ధిలోకి రండి!.....సెల్ఫీ పిచ్చి తగ్గించండి!.....తీసుకోండి ఎవర్నైనా పిలిచి!....కాదనను!.....ప్రమాదకరమైన  ప్రదేశాలలో మాత్రం!.....పూర్తి జాగ్రత్త వహించండి!.....నన్ను ఏడిపించకండి!......వుంటాను!....సెలవ్!....ఇట్లు,మీకేమైనా భరించలేని, మీ సెల్ఫీ.....జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles