TAMALAPAAKU
శుభాలకి పెట్టింది పేరు!.....ప్రశంసలజోరు!......జయాల హోరు!.... నా అందం తీరు!.....నా స్థాయే వేరు!......నీ అంత్య ప్రాస ఆపవమ్మా!......ఎవరు నువ్వు?. తూటుబడ్డాకు,దూలగుండాకు కాదు!......ఇంకా మీకు కావాలంటే క్లూ యిస్తాను......ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి చిత్రం.....ఒక సన్నివేశంలో......నా పేరు హల్ చల్ చేసింది.....ఆ ఆ.....గుర్తుకొచ్చింది!.... వెరీ గుడ్......వేగం వేలిగిందే!........అవును మరి!......ఎంత పెద్ద హిట్టూ!.....నవ్వాగితేకదా!...సరే.....విషయానికొద్దాం.....నా పేరు....."తమలపాకు".....అలాగా!....క్షమించమ్మా..... ఎవరో అనుకున్నాం....".తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ".......".దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత"...డైరెక్టర్ శ్రీ.కె. విశ్వనాధ్ గారి.....".రుద్రవీణ" సినిమాలో పాట అందుకోండర్రా! ....అద్దీ.....చూసారా.....నువ్వని తెలియగానే......మావాళ్లు ఎంత హడావిడి చేస్తున్నారో!.....నువ్వంటే......మా ప్రాణం,మా ధ్యానం!......పూజలంటే నువ్వే!......పెళ్లంటే నువ్వే!.....పేరంటానికైతే నువ్వే.!.....అసలు నువ్వంటూ లేకపోతె ఎలా!......నువ్వుంటేనే మేము!.....తాంబూలాలు మార్చికోవడం దగ్గరనుంచి.......పెళ్లి తంతు ముగిసి.....సత్యనారాయణవ్రతం అయ్యేంతవరకు.......తమరు తప్పకుండాల్సిందే!. అంతే కాకుండా...మీవల్ల ఎన్ని ఉపయోగాలు.....కిళ్ళీలు వేసుకున్నారంటే!.....ఒకవిధంగా చెప్పాలంటే!.....రంగు కోసం కాదు.....భోజనం తరువాత వేసుకుంటే!.....జీర్ణం బాగా అవుతుందని. ఎర్రగా పండితే నాలుక!.....భార్య మీద ఎంత ప్రేమో అనీ భర్తనీ.....భార్యకి పండితే భర్తపై ఎంత ప్రేమో అనీ......ఆట పట్టిస్తూ వుంటారు....అది కూడా ఎంత ముచ్చటగా ఉంటుందో చూడ్డానికి......అలాగే....రోజుల పిల్లలకి.....జలుబు చేస్తే....తమలపాకుపై నులి వెచ్చని నూనె రాసి......తలపైన పెడితే......జలుబు తగ్గుతుందని పెద్దలు చెప్పేవారు......పూర్వం ఐతే తోటల్లో మాత్రమే వుండే దానివి......యిప్పుడు ఇళ్లల్లో కూడా పెంచుతున్నారు.....గోలెల్లో వేసి మరీను!.....శుభాలు జరుగుతాయని!......పొద్దున్నే లేచి నిన్ను చూస్తే మంచిదని!.....అంతా బానే వుంది!....చిన్న సందేహం!.....ఏమనుకోనంటే అడుగుతా!....అః...ఏం లేదూ!...."తాంబూలాలిచ్చుకున్నారు తన్నుకు చావండి"....అనీ...ఎందుకనేవారు.....ఏవుందీ!.....మాటకి నిలబడకుండా....తాంబూలాలిచ్చేసుకున్నాం అన్న ధీమాతో......వీళ్ళతో మాకేం పని.....అనీ.....కాలరెగరేసేవారు!....ఆడపెళ్ళివారు!....ఏమవుతుంది మరి!......అంతే సంగతులు......అదీ మేటరు. ఓహో!....నిజమే కదా!........వాళ్ళు అలా చేయటం.....నీకు నిందలేయ్యటమూన!......ఏవైనా బాగుందా!.......అదే మానవ లక్షణం....దానికి నువ్వేం చేస్తావ్!.....నీ ముందు మేమెంత!......నీ గొప్పతనం!.....మాటల్లో వర్ణించలేనంత!........తూర్పు గోదావరి జిల్లా......తుని దగ్గర తోటలకి రావాల్సిందే!....నిన్ను చూడాల్సిందే!...తమలపాకు కట్టలు తెచ్చుకోవల్సిందే!....అప్పుడే అసలైన ఆనందం....ఉంటాము.....నమస్కారం......జయప్రభాశర్మ.
Comments
Post a Comment