RICKSHAW WALA


అమ్మా నమస్కారం.....బాబూ నమస్కారం.....నన్ను మర్చిపోతున్నారా?......నేనెలా బతకాలి.....యెంత దూరమైనా.....మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి తీసుకెళ్లే ......బాధ్యత వహించినవాణ్ణి......మీరెప్పుడొస్తారా!.....అనీ....యెదురుచూసేవాణ్ణి.....మీ రిక్షవాలానయ్యా!....ఈ నిరుపేద బతుకు ఎలా గడుస్తుందో......అర్ధం కావట్లేదయ్యా.....ఆటోలు మాత్రమే మాకు పోటీగా ఉండేవి.....యిప్పుడు..వూబర్లు, వోలాలు....వచ్చిన తరువాత.....మా రిక్షా నామోషీగా ఉంటూ.....కూర్చోడానికి ఇబ్బందికరంగా అనిపిస్తూ.....ఎవ్వరు మా వంక చూడనైనా  చూడట్లేదు.....గతంలోనైతే.....ఏయ్ రిక్షా?...వస్తావా......అని అడగడమే తడవు.....కాలుస్తున్న బీడీ టక్కున పడేసి......గబాల్న తలకి గుడ్డ చుట్టేసుకొని.....యెంత ఉత్సాహంగా వచ్చి తొక్కుకుంటూ......వారితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ....బాధ అన్నది తెలియకుండా......సంతోషంగా రోజంతా గడిపేవారము......మాకు ప్రత్యేకంగా రిక్షా  స్టాండు ఉండేది.....మా కార్మికులకు యూనియన్ ఉండేది......తోటి రిక్షావాళ్ళతో.....కష్ట సుఖాలు పంచుకొని....ఎంతో కలసి కట్టుగా ఉండేవారం....సినిమాహాళ్ళ దగ్గర మేమే......బజార్ల దగ్గర మేమే.......రైల్వే స్టేషన్, బస్టాండ్....ఎక్కడ పడితే అక్కడ మేమే.....బెల్ మోగిస్తూ.....వస్తారా అనీ....హడావిడి చేస్తూ.....బేరాలాడుకుంటూ......బలే సందడిగా ఉండేది.....ఇప్పుడవన్నీ తలచుకుంట్టుంటే....మాటల్లో చెప్పలేనంత....బాధగా ఉంట్టుంది.......ఇప్పటికీ వృత్తినే నమ్ముకొని.....గడుపుతున్నామంటే నమ్ముతారా.....వానొచ్చినా,వరదొచ్చినా, అనారోగ్యం పాలైనా....బక్క చిక్కిన శరీరంతో.....ఆశ చావకా.....ఎవరైనా రాక పోతారా.....అనీ ఎదురు చూస్తుంటాము......మా రిక్షా రిపేరుకొచ్చినా.....ఖర్చు పెట్టలేని స్థితిలో వున్నాము.....రోజంతా ఎండలకు ఎండి, వానలకి తడుస్తూ......ఎప్పుడొస్తామా అనీ......ఎదురు చూస్తున్న......మా కుటుంబాల చేతిలో పెట్టేది ......పైసలు మాత్రమే.....మాలాగే మా పిల్లలు బతకకూడదని.....వారి బతుకు మాలా కాకూడదని......బాగా చదువుకోవాలని......చిగురంత ఆశ.....కానీ......రోజుకొక వాహనం......ప్రవేశం చూస్తుంటే......బతుకు అగమ్యగోచరంగా తోచుతోంది.....మేము, మా రిక్షా కనుమరుగైపోతామేమో.....అనీ....భయపడుతూ......కన్నీరాగడం లేదు.....ఈ రిక్షాబండి......బతుకు జట్కాబండిని.....ఎలా ఈడుస్తుందో.....అర్ధం కావడం లేదు.    చిన్న అభ్యర్ధన! ......అయ్యలూ! అమ్మలూ! మా వంక కూడా......దయతో తమరు చూడాలని.....దండం పెడుతున్నా....ఎక్కువ డబ్బులు అడగము, ఎత్తు పల్లాలొచ్చినా దిగమని చెప్పి యిబ్బంది పెట్టను......వానొచ్చినా.....నే తడుస్తాను గానీ......మిమ్మల్ని తడవనివ్వను......అలాంటి నన్ను......కనికరించి, చూడాలని కోరుకుంటు......ప్రభుత్వానికి కాస్తా ....మీరు కూడా చెప్పండయ్యా......ఏదైనా ఉపాధి చూపించమని.....చెబుతారు కదూ...సెలవు బాబయ్య.....ఇట్లు, కడు దీనావస్థలో ఉన్న మీ రిక్షావాలా.......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles