చిత్రం: స్టూడెంట్ నెంబర్,వన్. పడ్డానండి ప్రేమలో మరి. పేరడీ సాంగ్.
ఆ: అమ్మమ్మో ఓలమ్మో అయ్యో ఏం సేతు ఈ మొగుడమ్మో
నన్ను నట్టేట ముంచారు నా ఓళ్ళంతా
నన్ను యిడి సేతిలో పెట్టి జారుకున్నారంతా
ఆళ్ళకేమొచ్చిందో
ఆళ్లకేమయ్యిందో
బతుకు బుగ్గిపాలు సేసి ఆడుకున్నారంతా
మయరోగం రావాలంటా
మాడి మాడి సావాలంటా
నిజంగా నిజంగా.
యిలా శాపాలు ఎట్టేస్తున్నా.

చరణం: ఆ: మంచి కాంత దొరికె వద్దు నువ్వు ఏనాటికి
ఈ మాట నికరమమ్మా నీకు ముమ్మాటికీ "ఓహ్హోహ్హో ఒహోహోహో"
ఆ: బండరాయి తెచ్చి పచడి చేస్త నీ బుర్రనీ
బంతి ఓలే ఆడుకుంట సూడు నా సుర్రూనీ "ఒహ్హోహ్హో ఒహోహోహో"
ఆ: అమ్మమ్మో గయ్యాళి గంప
ఆ: అరిచేవో తీస్తా దుంప
ఆ: చెప్పిన మాట వింటాలే ఒలవకమ్మ తాట.
చరణం:ఆ: సచినట్టు మాట వింటే నీకు తోడైవుంటా
నా మాట వినకపోతే నీకు చావేనంటా "ఓహ్హోహ్హో ఒహోహోహో"
ఆ: నీ కాళ్ళు మొక్కుత సచ్చినట్టు పడిఉంటానే
నీ నోటికింక తాళమేస్తె బతికిపోతానే "ఓహ్హోహ్హో ఒహోహోహో"
ఆ: సంకటమే కట్టింది
ఆ: బతికుంటే బలుసాకు
ఆ: కాళ్ళకాడ పడివుండు కానిదానవనకు

Comments

Popular posts from this blog

Articles