ACID DADI

బంగారు భవితను పాడుచేశానంటారు!.....నేనంటే అసహ్యించుకుంటారు!......నా పేరు వినడానికే భయపడుతుంటారు!......ఆమ్మో చెప్పాలంటే భయమేస్తోంది.!....అయినా చెప్పాలి కదా!...నేనెవరో!...ఏంటో!...నేను అతి ప్రమాదకరమైన రసాయనాన్నండి!.......అదే "యాసిడ్ని".......ప్రేమంటూ బతుకు బుగ్గిపాలు చేసుకుంటున్నారే!......నన్ను తీసుకెళ్లి! .....నా పరువు తీసి మంట కలుపుతున్నారే!.....ఏంటండీ యిది?.....నన్ను ఒక మంచి పని కోసం పుట్టిస్తే......యి చెత్తపనులేంటి?...నేనే దొరికానా?......నేనేదో పిల్లల భవితకోసం పాటుపడుతూ ......ప్రయోగశాలలలో ఉంటూ,మీ యింటి నాచులు, ఇతర అపరిశుబ్రాలకు.....ఉపయోగపడుతూ.......నామానాన నేనుంటే!.......మీకిదేం పని?.......అసలు నాకు చిన్న సందేహం!........యి యాసిడ్ ఎలా వస్తోంది......ఎక్కడనుంచి  తెస్తున్నారు?.....మంచి నీళ్ల సీసాల్లా పట్టుకెళ్తుంటే....ఎవరికి అనుమానం కలగడం లేదా?.....ఆపటానికి ప్రయత్నం చేయలేకపోతున్నారా?.....ప్రేమ పేరుతొ జీవితం నాశనం చేసుకుంటారా?......ప్రేమ విఫలమైతే.....ఇంక బతుకు లేదా?......నిరాశా నిస్పృహలకు లోనుకావడమేనా?.....ఆలోచించండి!......క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.....భవిష్యత్తుని అంధకార బంధురం చేస్తుంది.....అష్ట కష్టాలు పడి!......ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న.....మీ తల్లితండ్రుల కలలన్ని కల్లలుచేయటం.......ఎంతవరకు సమంజసం!.......ఉదయం బయటకు వెళ్లిన పిల్లలు.....ఎప్పుడొస్తారా అని చూస్తుంటే......పిడుగులాంటి వార్తా!......గుండెలు బద్దలు అయ్యేలా.....యెంత ఏడుస్తారో!......మీకేం తెలుసు!.....పదిమందిలో తిరగలేకా, తల ఎత్తుకోలేకా.....జీవచ్ఛవాల్లా.....బతుకు వెళ్లదీస్తుంటే!......అంతకంటే అవమానం  ఇంకేముంది!    ఎదుటివారి ఉసురు తీసి ఏం బావుకుంటారు!........నాకెంత ఏడుపొస్తుందో తెలుసా!......నా మంటకి విల విల కొట్టుకుపోతుంటే బాధతో.......ఏం చెయ్యలేక.....అసహాయురాలినై......చూస్తూవుంటాను.   ఒక మంచి మాట గుర్తుపెట్టుకోండి!.....ఏదైనా మన మంచికే అనుకోండి......కసి పెంచుకొనీ......బాగా చదివి వృద్ధిలోకి రావటానికి ప్రయత్నించండి!.......నవ్విన ఊళ్లే పట్నాలవుతాయనుకోండి!.....ఎంతో సాధించాల్సిన.......మీ
భవితకు బంగారు బాట వేయండి!......మీ కన్నవారి ఆశల్ని అడియాసలు చేయకండి.....ఎదుట వారి ఊపిరి తీయకండి......మీరు వుచ్చుల్లో చిక్కుకోకండి!.....ప్రాణాలతో చలగాటమాడితే......వచ్చేది చివరకు......చేతులకు బేడీలు......జైలు కూడు.......సమాజంలో ఛీత్కారాలు,చీదరింపులు!......కాబట్టి.....నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టించకండి!.......నన్నొక మూల ఉంచండి! ......మీరు ముక్కు మూసుకోండి!......నన్ను చూసి తెగ రెచ్చిపోకండి!.....యాసిడ్ దాడులు ఆపండి!...రంకెలేసి  రగడ చేయకండి!.....నా మాట వింటారని ఆసిస్తూ!......వుంటాను......ఇట్లు, మీ యాసిడ్......జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles