"MIC"ASURUDU

నేను కనిపిస్తే చాలు!.....పాలు, పరమాన్నమే!....జీవితంలో ఎన్నడూ పొందని ఆనందం!.....కనిపించని బిల్డప్పు!.  ఓహో!....ఎందుకు!......ఎందుకేవిటి!....మైకాసురులన్నమాట!......ఏం చెప్తాను!.....ఎన్నని చెబుతాను!.    అవునట్టు మరిచిపోయాను!.....నా పేరు చెప్పడం!.....నా పేరేనండి బాబూ!.....ఆ "మైకు"!......చంపేస్తున్నారు పట్టుకొని!.....ఆ సుత్తులు వినలేక ఏం ఏడుస్తున్నానో!......పరమాత్ముడికెరుక!.......ఏం  బాదుతున్నారమ్మ!.....ఏ తండ్రి కనిపెట్టేడో గాని!.....నాకే చేతులుంటేనా!.....అంతే సంగతులు!....వేదిక చూస్తే చాలు!.....రెచ్చిపోతున్నారు!.....ఇంతకు ముందు ఇలా ఎరుగుదురా!......వేదిక అంటే ఎప్పుడో గాని కనిపించిదేకాదు!......మైకులంటే!....ఎవరి చేతికి పడితే వారికి ఇచ్చేవారుకాదు!.....ఇప్పుడా!.....వాళ్ళు లేదు!.....వీళ్ళు లేదు!.....అందరు కింగులే!.....పోనీ!.....ఖర్మ కాలి పిలిస్తే!.....గంటలు గంటలు!......ఉపన్యాసాలు!.....పాటలు!......పద్యాలూ!.......వామ్మో!.....పాపం!....సభకి వచ్చేవాళ్ళని చూస్తే యెంత జాలేస్తుందో!.....వెళ్లలేక!.....ఉండలేక!......పడుతున్న అవస్థ చూస్తుంటే!.....ఇళ్ళకి వెళ్లిపోండి!....అనీ చెప్పాలనిపించినా!......చెప్పలేను కదా!....నరకం అనుభవిస్తున్నాను!.....వీళ్ళ అఘాయిత్యం కూల!......బాదుడే బాదుడు!.......పోనీ ఆ చెప్పేది యెంత సేపైనా వినాలనిపిస్తుందా!....ఏమైనానా!......ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు!.....వాళ్ళ గురించి డచ్చిలే!......అందుకే అన్నారు!.....ఇలాంటి వాళ్ళని చూసే పెద్దలు!......డబ్బారేకుల సుబ్బారాయుడని!......నేనెక్కడ విరిగి ముక్కలు ఐపోతానో అనీ భయమేస్తోంది!.....నాకాయసం వచ్చేస్తుంది ముందు!.....వీళ్ళు మాత్రం చెక్కు చెదర్రు!.....ఏ జలుబో!....ఏ దగ్గో వస్తే బాగుండు అనిపిస్తుంది!.....అరె!.....ఆపితేగా!.....ళ కి ల!.... ష కి స!....ణ కి న!......భాషని బతికించమనీ!......యెంత ప్రాధేయపడినా!.....అః!....లక్ష్యం లేదు!......విసురు!.....అందులో వేదిక ఎక్కడమే తడవు!.......రేటింగ్ పెరిగిందన్నమాట!.....ఒకరి మాట వింటామా!......పూర్వం వక్తలు!.....మాటాడుతుంటే!.....ఎంతసేపైనా వినాలనిపించేది!.....కదలాలనిపించేదికాదు!....ఇప్పుడా!....పరపతుంటే చాలు!....ఏవిటమ్మా విడ్డూరం!....మాటాడుతుంటే మధ్యలో ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది!.....కానీ ఆగనివ్వరే!.....కరెంటు పోయినా!......ఇన్వెర్టర్లు,  జనరేటర్లు!.....హంగామా అంతా ఉండనే వుంటుందిగా!.....ఎంతైనా భరించాల్సిందే!.....సుతి మెత్తగా, సున్నితంగా!.....సందర్భానికి తగినట్టుగా!......పదిమందికి ఉపయోగ పడేట్టుగా!.....క్లుప్తంగా!....మాట్లాడితే యెంత సొంపుగా ఉంటుంది!.....మళ్ళీ అవకాశం రాదేమో అన్నట్టు భయం!....చిరాకేస్తోంది చూస్తుంటే!.....ఐనా!.... వాళ్ళు ఎలా చెబితే అలా!....వినాల్సిన దౌర్భాగ్యం!.....నా పుట్టుక మండా!......కానీ!....ఒక్కోసారి చెప్పలేని ఉత్సాహం!.....ఎందుకో తెల్సా!.....మహా జ్ఞానులు!.....శాస్త్రవేత్తలు!.....సాహిత్యవేత్తలు!....విద్యావేత్తలు....సంగీత జ్ఞానులు!.....ప్రసంగిస్తుంటే చూడాలి!....నా ఆనందం!.....మాటలుండవ్!......అంత సంబరపడిపోతాను!.....అప్పుడే అయిపోయిందా అనుకుంటాను!....నా ఆవేదన అర్ధం చేసుకుంటారనుకుంటాను!.....అంచేత!....నన్ను హింస పెట్టకండి!......మీరు హింస పడకండి!.......మంచి, మంచి వాళ్ళను తీసుకురండి!.....ఆనందపడండి!.....ఆనందో బ్రహ్మ!......వుంటాను!.....బై!....ఓకే.....ఇట్లు, .....జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles