"GURRAPU DEKKA"
ఏవండోయ్ గుర్రం......గుర్రపు డెక్క అనీ వినేవుంటారు.....కానీ నేను జంతువుని కాదండోయ్......నా పేరు మాత్రం గుర్రపు డెక్క.....నేను శుద్ధ వేస్టు ఫెలోని.....ఎందుకు పనికిరాను......చెడకొట్టడానికి పుట్టాను....తెగ విస్తరించేసి.....ఇబ్బంది పెట్టడంలో నెంబర్ వన్.......ఎస్ నేనే నెంబర్ వన్......వానాకాలం వస్తే చాలు.....మహా ఆనందం......ఎక్కడో అడవుల్లో వర్షాలు పడి.....నదులు.....వరదలై ప్రవహిస్తుంటే....ఆ నీటితో పోటీపడుతూ....వస్తుంటే చూడాలీ.......నా సోకు.....ఓయబ్బో.....ఎవరికైన ఆపతరమా.....అదుపుచేయవసమా.....అలా ఉంటుంది ఊపు.......ఆ వరదలో నన్ను చూస్తుంటే......చూడాలనే ఉంటుంది.....నాకు నేనే దిష్టి తీసుకుంటాను......చిన్న,పెద్దా......అది చూసి...మైమరచిపోయి......వదల బుద్ధి కాదంటారు......కానీ రైతన్నల గుండఁడెల్లో దడ పుట్టిస్తాను....ఎందుకంటే......నేను అడ్డొచ్చానంటే......పంట కాల్వలకు ఇబ్బంది ఎదురవుతుంది కదా.....అందుకనీ......ఆ మధ్య గుంటూరు దగ్గర కాల్వకు......నా వల్ల ఎంత కష్ట పడ్డారో......పాపం ప్రభుత్వంవారు.......బాగా ఖర్చు పెట్టి......నన్ను అడ్డు తొలగించేసరికి........తల ప్రాణం తోక్కొచ్చిందండీ బాబూ.......నాకెంతో బాధనిపించింది.......మీవాళ్లంతా నీటిలో దిగి పని చేస్తుంటే......ఛీ.....న బతుకు చెడా....అనీ.....నన్ను నేనే తిట్టుకున్నాను......ఐనా నా పుట్టుకే ఇంత....మీరు విసిరేసి, పీకేసి పారేసినా.....నేనేమి అనుకోను....ఏదైనా ఉపయోగం ఉందా....నా వల్ల....నో......ప్రయోజనం లేనిదాన్ని.....నేను ఉంటే ఎంత.....పొతే ఎంత.....పనికిరాని అందం నేనూను.......భగవంతుడు....నన్నొక్కదాన్నే సృష్టించాడు......ఇలా!....ఏ జన్మ పాపమో.....అనుకుంటే ఏం లాభం.....సద్దుకుపోవడమే....ఈ జన్మకు. మళ్ళీ జన్మలో....ఉపయోగాలున్న మొక్కనై పుట్టాలి.....మీ అందరి ప్రశంసలు అందుకోవాలి.....నేనే ఒప్పుకున్నాను నేనేంటో.......కాబట్టి యిహ తిట్టకండి రైతన్నలూ.......మీరు పంటలు బాగా పండించుకోండీ.....మీ పిల్లా పాపలతో హాయిగా జీవించండి.....మీ సంతోషమే.....నా సంతోషం.....బుర్ర తిన్నాను ఇంతసేపు.......క్షమించండీ.....వుంటాను.....మరెప్పుడు రాను......కనుమరుగైపోవాలని కోరుకుంటూ. ఇట్లు,గుండె గుబులు, గుర్రపు డెక్క........జయప్రభాశర్మ.
(Telangana state)(Ranga Reddy gilla)(maheshwaram mandal)(Raviriyal village)
ReplyDelete(Same situation)HOW TO CLEAN THIS (GuRRAPU DEEKA)