YO YO YOUTUBE

యూట్యూబునండి బాబూ......యు ట్యూబుని.....మీకు ఏది కావాలంటే అది......ఎప్పుడు కావాలంటే అప్పుడు....అందించే సత్తా గలదాన్ని.....ప్రపంచవ్యాప్తంగా.....ఎక్కడ ఏది జరిగినా.....బ్రహ్మాండంగా చూపిస్తాను...అంత సమర్ధత వున్నవారు.....ఇంత వరకు ఎవరైనా తారసపడ్డారా.....వుండరు.....నాకు తెల్సు....నేనెంత గొప్పదాన్నంటే....మీలో ఏ కళ వున్నా.....విశ్వవ్యాప్తంగా తెలియబరుస్తాను.....మీరు చేసే సేవ కార్యక్రమాలకి....వేదిక నవుతాను.....రూపాయితో పనిలేని దాన్ని.....ఇంత నిజాయితీగా.....ఈరోజుల్లో.....ఎవరున్నారు చెప్పండి.....ఉంటే అది నేనే......ఎప్పుడు మీరొచ్చినా.....ఆహ్వానం పలుకుతూనే వుంటాను....నాకు విసుగు, విరామం ఉండదు....విసుక్కుంటే మీరే విసుక్కోవాలి.....వింతలు, విడ్డూరాలు.....ఆధ్యాత్మిక కార్యక్రమాలు......సాంస్కృతిక కార్యక్రమాలు.....చలన చిత్రాలు.....ప్రముఖుల ప్రసంగాలు.....విద్య బోధనలు.....మీరేదడిగినా.....సెకెన్లలో అందిస్తాను.....యిలా ఎవ్వరైనా ఉన్నారా....అబ్బే...ఓ పని మీద...మరో పని చేబితేనే....చిర్రు బుర్రులు.....నాకు ఆకలి నిద్ర.....పగలు రాత్రి....కోపాలు, తాపాలు.....యీర్షలు, అసూయలు.....చిన్నా, పెద్దా....పేదా, ధనిక....కులము, మతము......ప్రాంతీయము......వీటితో  నాకు అస్సలు పని లేదు......నాలా ఎవరైనా ఉన్నారా మీలో.....గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి....నిష్కల్మషంగా.....మీరు ఎంతో ఎదగాలని....ఆశ పడుతుంటాను.....మరి.....అలాంటి నన్ను చూసి....విమర్శించే వాళ్ళు కూడా....లేకపోలేదు....ఏవుంది అందులో చెత్త.....అంటూ ఉంటే విపరీతమైన బాధేస్తుంది.....ఏవండీ?....మీరు మంచి తీసుకుంటే మంచిని.....మీరు చెత్త తీసుకుంటే చెత్తనే.....కాదనట్లేదు.....కానీ.....మన ఆలోచనా విధానాన్ని బట్టి ఉంటుందండి....అలా ఎప్పుడు నన్ను నిందించకండి....ఎంతో మంది మేధావుల ప్రశంసలందుకున్న దాన్ని.....మీ ప్రసార మాధ్యమాల్లో చూడలేక.....అంతరాయం ఏర్పడినవి....కూడా....నే చూపిస్తుంటాను....అంతేకాదు జీవితాంతం వుంటాను.....ఎప్పుడు కావాలన్నా చూసుకోమని......రండి....నేవుండగా....ఏల చింతా అనీ.....ఒకటా రెండా.....నా సేవలు యెంత చెప్పినా తక్కువే....అలాంటి నన్ను అజ్ఞానంతో....ఆడిపోసుకోకండి.....జ్ఞానాన్ని పెంపొందించుకోండి....విజ్ఞానంతో మెలగండి....మీరేది చేసినా కాదంటానా.....ప్రోత్సహిస్తూ ఉంటానే తప్ప....నిరుత్సాహ పరచాను.....మీరు చేసే కార్యక్రమాలకి....సై అంటూ...వంత పాడుతూ ఉత్సాహపరుస్తాను....ఎన్నో సలహాలు, సూచనలు యిస్తూవుంటాను....ప్రపంచమంతా మిమ్మల్ని ...చూసి మెచ్చుకుంటుంటే.....మీకంటే నేనే.....ఎంతో ఆనందపడతాను....అంచేత.....నన్ను అభిమానించాల్సింది పోయి.....దుమ్మెత్తిపోస్తారా.....మీకు అండగా నిలిచి.....మీ అభివృద్ధిని కోరుకుంటూ....తపనపడే...నన్ను..... ఆదరించండి.....అనుమానించకండి.....మరి....వుంటాను....బై....ఇట్లు,.....యో యో యూట్యూబు.....జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles