AAVA GINJA
నేను చూట్టానికి.....అబ్బే....ఆనను గానీ.....మహాకానిదాన్ని.....చిట చిట లాడుకుంటూనూ!.......నేను లేని రోజంటూ ఉండదు......ఎవరే నువ్వూ!......విరగబడిపోతున్నావ్!......అనుకుంటున్నారా!......మీ వంటింట్లో.....పోపుల పెట్టిలో..... కచ్చితంగా ఉన్నదాన్ని!......ఆవగింజనండీ!......నేను గుర్తుండకపోతే ఎలా.....ఘమ ఘమ లాడుతూ .....మీకు వేడి వేడిగా పెట్టేస్తే......చాలా!......యింకేవి తెలుసుకొనే అవసరం లేదా!......అన్నీ తెలిసి తీరాలి!......ఓ....మాట్లాడితే చాలు......నాతొ పోలుస్తుంటారు!......ఎవరైనా బాగుపడితే......ఆవగింజంత అదృష్టం ఉంటే......ఇలాగే మరి అనీ!......అది వింటున్నప్పుడు చూడాలీ.....నా ఆనందం.....మాటల్లో చెప్పలేను.....ధనియాలు,జీలకర్ర......వెల్లుల్లి, సెనగపప్పు........ఇన్ని వున్నా.....అలాంటి అవార్డు ......నాకే సొంతం......ఆ మాట విన్న రోజు......వాటి మొహం చూడాలి!.......మాడిపోయిన అరిసే!......నేనేం చేస్తాను!......ఇది నా జెన్మ.....అది వాళ్ళ ఖర్మ......ఏవండీ!.....మనలో మన మాట!......ఆవకాయ అని అంటారు గాని......జీలకర్రకాయ్.....ధనియాలకాయ్ అంటారండీ........దీన్ని బట్టి మీకేమర్థమైంది......ఆవకాయ కి ప్రధాన పాత్రధారి......నేనే కదా!......ఒప్పుకోవాల్సిందే!......ఉప్మాకి నేనే......సాంబారుకి నేనే.....మీ రసానికి నేనే!.......నేనన్నదాన్ని ఎందులో లేనూ......అన్నిటా నేనే!.....ఆ....చెప్పడం మర్చిపోయాను!......బెంగాలీ వాళ్లకయితే......నేనంటే ఎంత మోజో!......ఆవనూనె అనీ!......తెగ ఎగబడతారు......ఎందులో చూసినా నేనే!........అబ్బా....అనకండి......జిహ్వకో రుచి......అంతే మరి.....ఇంకా వాగితే.......ఆపు నీ డచ్చీలు.....అంటారేమో....అందుకే మూస్తున్నా....ఓకే.....బై.....ఇట్లు, డైలీ ధమాకా,చిట చిట గింజ, మీ ఆవగింజ......జయప్రభాశర్మ.
Comments
Post a Comment