DHARUVULA DAPPU


జెజ్జెనకరి జనారే జనకుజనా జనారే.....ఓయ్ ....ఓయ్....చిందులు.....అది.....మనమంటే.....నేనేం చెప్పక్కర్లేదు.....తెలిసిపోయింది.......కదా!......అవునండీ.....డప్పునీ!....నా సందడి అంతా, ఇంతానా.....మోగానంటే.....న సామి రంగా.....వూరు ఊరంతా.....తరలి రావాల్సిందే......పల్లెల్లో ఐతే నన్నొదుల్తారా!......అబ్బో.....చుట్టుముట్టేయ్యరూ!.......డప్పుల మోత.....అనీ.....పెట్టింది పేరు కదా.....నా వైభవం.....అప్పుడు,యిప్పుడు, ఎప్పుడూ......ఒక్కలాగే వుంది......డబ్బా కొడుతోంది అనుకుంటున్నారేమో......నిజం.....సంబరమైనా, చావైనా, చాటింపైనా, పోరాటమైనా.......ఖచ్చితంగా మనముండాల్సిందే......ఏంటనుకుంటున్నారు?.......అంత గొప్పదాన్నండీ.....అప్పట్లో మునసబు గిరి వున్నప్పుడు......శిస్తు కట్టకపోతే.....యిందు మూలముగా తెలియజేయునది ఏమనగా......అంటూ చాటింపు వేయిస్తే......నూటొకటి కొట్టేది.....ఆస్తులు ఎక్కడ జప్తు చేసేస్తారొ అనీ.....యిహ జానపద కళాకారులకైతే.....నా చప్పుడుంటే చాలు......ఊపందుకుంటుంది పాట....అమ్మవారి జాతరలైతే చాలు......అందరికంటే ముందు నేనే.....అమ్మవారికి ప్రీతిపాత్రురాలిని మరీ.....ఆనందపారవశ్యానా అమ్మవారు పూనీ.....ఊగుతుంటే....చూడాలి.....నా ఉత్సాహం......మాటలుండవ్......సినిమా వాళ్ళు కూడా నన్ను వాయిస్తుంటే.....ఎంత గర్వన్గా ఉంటుందో......ప్రజానాట్య మండలి వారికైతే.....నేనంటే ప్రాణం...నా హడావిడే  అటువంటిది....నే రంగ ప్రవేశం చేసానంటే.....బ్రహ్మాండమైన ఊపు వస్తుంది.....నన్ను మోగించిన కొంత సేపటికి......కర్రలవి పేర్చి....మంట పెట్టీ......వేడి చేస్తుంటారు.....యింకొక విష్యం.....పల్లెల్లో ఐతే....శవ అంతిమ యాత్రకి కూడా.....నన్ను పిలిచి తీసుకెళ్తుంట్టారు......ఇప్పటికీ కూడా....చాలా చోట్ల.  యీమధ్య ఆడియో ఫంక్షన్లకి.....నన్ను పెట్టి చిందులేయిస్తుంటే......తస్సాదియ్యా....ఆ చిందులే వేరప్పా.....భలే మజాగా వుంది.....చూస్తుంటే.....నీ గొప్పలాపవమ్మా!.....వినలేక చస్తున్నామని.....తిట్టుకుంటున్నారా.....నో ప్రాబ్లెమ్.....నే చెప్పాల్సింది చెప్పేసాను....ఐయాం వెరీ హ్యాపీ.....ఓకే....లేకపోతె.....డప్పా? అంటారా......యిప్పుడు చెప్పండి......ఒప్పుకోండి...యింకా ముందు, ముందు......నా వెంట పడకపోతే మీరందరు......నా పేరు డప్పే కాదు.....కాస్కోండి....డాబులు చెప్పే డబ్బారాయుడు అనకండి.....ఉంటా.....ఇట్లు,ఊపుల నిచ్చు, దరువుల డప్పు......జయప్రభాశర్మ.




Comments

Popular posts from this blog

Articles