Sahanaseeli Server
మీకు కావాల్సినవన్నీ తెస్తాము !.....వినయ విధేయతలతో వుంటాము !.....మీరు విసుక్కున్నా!....ఏమి అనుకోము !....బుర్రతినకా!......పేరు చెప్పూ!.....నా అసలు పేరంటూ వున్నా!....తల్లిదండ్రులు నాకు పెట్టింది!..... మర్చిపోతున్నానండీ!.....ఎందుకంటే!.....నన్నందరూ!....."సర్వర్", సర్వరనే పిలుస్తుంటారు కాబట్టి!.....మరి కష్టపడి బతకాలంటే!......ఏదో ఒకపని చెయ్యాలి కదండీ!.....కడుపు నిండాలి కదా!.....అందువల్ల!.....ఉరుకులు,పరుగులు పెట్టుకుంటూ!.....జీవిత పోరాటం కొనసాగించాల్సిందే!.....తెల్లారి లేచి ఆఘ మేఘాల మీద!.......దేవునికి దండం పెట్టి ......బయలుదేరి!.....ఎవ్వరు ఏమి అనకూడదు!...అనీ కోరుకుంటూ!....రోజులాగే పని మొదలెడతాం!.....వచ్చిన ప్రతీవారిని!......చిరు నవ్వుతో పలకరిస్తూ!.....దగ్గరుండి!.....విసుగు అన్నది కనపడనీయకుండా!....విరామం లేకుండా!....అతి ఆత్మీయంగా!.....వడ్డిస్తాం!.....అడిగిన వెంటనే తేలేకపోయినా!....బాగా సర్వ్ చెయ్యకపోయినా!......ఎంతో విసుక్కోని!.....చిట చిటలాడి!....మా మీద కంప్లైంటు కూడా చెయ్యడానికి వెనుకాడరు!.....కొందరైతే తిట్ల పురాణాలందుకుంటారు!...మనసు ఎంతో గాయపడుతుంది!.......అయినా సమర్ధించుకొని!....మా పని మేము చేసుకుపోతాం!....మా తోటి వారు చాలా మంది!.....విద్యాధికులై ఈ పని చేస్తుంటే!....అయ్యో అనిపించి! ......చాల బాధ పడుతుంటాము!.....భోజనం అనంతరం!....వాళ్ళిచ్చే టిప్పుకై!.....ఎంతో ఆశగా చూస్తాము!.....ఎంతిచ్చినా మహా భాగ్యంగా భావిస్తాం!...కష్టమర్లలో కూడా చాల మంచి వారుంటారు!....కుశల ప్రశ్నలేస్తూ!....చిన్న, చిన్న లోపాలున్నా!......సద్దుకుపోతూ!......వెళ్ళిపోతూ విజిటింగ్ కార్డు ఇచ్చి!.....ఎప్పుడే అవసరమైన కలవమని!.....మనసున్న మారాజులు కూడా లేకపోలేదు!.....అలా అర్ధం చేసుకొని!.....గుర్తు పెట్టుకొని!....పలకరించేవారుంటే!....మాకెంత ఆనందాన్నిస్తుందో!.....అంతేగాని!....చిందులేస్తూ కొట్టినంత పని చేస్తే!......మేమేం చెయ్యగలం బాధపడటం తప్పా!....పేదవాని కోపం పెదవికి చేటు కదా!.....ఎంతో సహనంగా!.....ఎంతో ఓర్మిగా!.....మీ ఆకలి తీరుస్తామే గాని!.....మా ఆకలి పట్టించుకోము!....అనారోగ్యాన్ని అస్సలు ఖాతరు చెయ్యం!....వొదిగి వొదిగి దండాలెడుతూ!....ఒకింత సంతోషపడతాము!....ఎందుకంటె!.....ఎంత కోటీశ్వరులకైనా దక్కని అదృష్టం మాదని!.....వచ్చిన ప్రతీ ఒక్కరికి స్వాగతం పలుకుతూ!.....వీడ్కోలు చెబుతూ!.....మర్యాదపూర్వకంగా భోజనం అందించే ఘనత మాదే గనక!....మరి!....మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పటికి వుండాలని కోరుకుంటూ!.....వుంటాను!....ఇట్లు, సహనశీలి సర్వర్.......జయప్రభాశర్మ.
Comments
Post a Comment