POTLAKAYA POURUSHAM

పొట్లకాయలా ఉంటాడు. పొట్లకాయలా పెరిగాడు. అబ్బా! పాముల్లా ఉంటాయి బాబూ! తినాలంటే! అనీ అసహ్యించుకుంటారా!. ఏం! నేను అన్ని కూరగాయల్లాంటిదాన్నే కదా!. ఏవిటో ఆ మాటలు, వాళ్ళూను.ఓ గింజ పడేస్తే చాలు. నీళ్లు పోసిన, పొయ్యకపోయినా,అలా అల్లుకుపోతాను, ఏ కంపకో, కర్రకో. ఏ రకమైన ఇబ్బంది పెట్టను గాక పెట్టను. వుడవమని చెప్పను. గొప్పు పెట్టమని అడగను. ఎరువు వెయ్యమని గొడవ చెయ్యను. ఎంత మంచిదాన్నో నాకు నేనే చెప్పుకోవలసి వస్తోంది. అసలు! నేనెంత రుచిగా ఉంటానో తెలుసా?. ఎంచక్కా,పప్పు కూర చేసుకోవచ్చు.వేపుడు వేయించుకోవచ్చు.  బియ్యం నాన పెట్టి  మెత్తగా రుబ్బుకొని, పాలు మస్తుగా పోసి, పంచదార వేసుకొని, పొట్లకాయ వేసుకొని చేస్తే వదుల్తారా! పొట్లకాయ పరమాన్నం అనీ, తింటే, మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపించేలా ఉంటుంది. కొబ్బరి వేసి చేసిన కూరైతే మాటలుండవ్. అల్లం కారం ఐతే జిహ్వ లేచొస్తుంది.  చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, కమ్మటి పెరుగు వేసుకొని పచ్చడి చేస్తే అద్భుతః.. ఏవనుకుంటున్నారో!ఆడిపోసుకోకండి! ఎలా పడితే అలా మాట్లాడుతూ. ఇంకోటి చెప్పనా! నేను రెండు రంగుల్లో దొరుకుతాను. ఆకుపచ్చగాను, తెలుపుగాను.చారల్లేకుండా, చారలున్నవి. కూరగాయల బజార్లో అమ్ముతుంటే!అర్రే! ఎవరు పట్టించుకోరే!. రుచి ఎరిగిన వారు మాత్రమే నన్ను తీసుకెళ్తుంటారు. మరిగితే వెంట పడరు! అంచేత తెలుసుకోవాలి. అంతేగాని పొట్లకాయ, కోడిగుడ్డు కలిపి వండితే చాల ప్రమాదమట!. విషాహారంఔతుందట. పోనీ! అలాంటి వాటి జోలికి వెళ్లొద్దు. వేరేగా రక రకాలు చేసుకోవచ్చు కదా!. నాలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మీకేం తెలుసు. నా మాట నమ్మండి.నన్ను బాగా చూసుకోండి. అన్ని కూరగాయల్లాగే అభిమానించండి. పొట్లకాయ తినండి! పొట్టేళ్లలా బలంగా వుండండి. ఏదోలే సోది! వినక ఛస్తామా! వినకపోతే ఛస్తాము!. వూ కొట్టేస్తే పోలా! పోతుంది....ఓహో! ఇంత సీనుందా మీకు! అర్ధమైంది! మీకోసం చెప్పి అఘోరిస్తే! నాకేదో ఉద్ధరించేవాళ్లలా! మీరు! మీ వేషాలూను! ఏదో పాపం, మా వాళ్లు కదా అనీ చెబుతుంటే! వింటే! ఆనందం! వినకపోతే మహదానందం!. సరే!నే నిష్క్రమిస్తున్నాను!. ఇష్టపడితే  సేవ చేస్తాను.  లేకపోతె! అంతరించిపోతాను.ఆ స్థితికి రాకుండా చూస్తారని ఆసిస్తూ.....ఇట్లు, పోషకాల పొట్లకాయ.....జయప్రభాశర్మ.


  

Comments

Popular posts from this blog

Articles