PASI PANI PILLA 

అమ్మగారు!.....నన్ను చాలా మంది చులకనగా చూస్తుంటారు.....నన్ను పేరు పెట్టి పిలవటానికి కూడా ఇష్టపడరు......ఎందుకమ్మగారు!.....నేనేం చేసానని!.....యెంత పని చేసుకొని బతికితే మాత్రం.....నేను కూడా మీలాంటి మనిషినేగా!......నేను అందరిలాగే పుట్టనుగా!.....కడుపుకి జరగక....పట్టెడన్నం కోసం.......నిజాయితీగా......కష్టపడుతున్నాను......తెల్లారిన మొదలు.....ఇల్లిల్లు తిరుగుతూ......మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ.....సెలవులు పెడితే.....ఎక్కడ విసుక్కుంటారో, ఎక్కడ తిడతారో అనీ........భయపడుతూ....ఒంట్లో నలతగా వున్నా......పరుగులెడుతూ వస్తుంటాను......ఐన ఏనాడు నా గురించి ఆలోచించేవారు వుండరు.....కొందరైతే నిందలు కూడా వేస్తారు.....నిజంగా చేస్తే ఏమనిపించదు!....కానీ చేయని నేరానికి.....నిందలేస్తే......మనసు యెంత గాయమవుతుందో.....మా అమ్మ నాన్నలకు భారమై కాదు......పేదరికం అడ్డొచ్చి......కష్ట పడి పని చేస్తే......కడుపుకి ఇంత అన్నం దొరుకుతుందని....నమ్మి.....పంపిస్తారు......కానీ యిక్కడ......మీరు తిన్న ఎంగిలి కంచాలు కడిగినా.....మీ పాచి గుమ్మాలు తుడిచినా.....కడుపు నిండా పట్టెడన్నం పెట్టాలంటే......మనసుండదు......యెంత అనారోగ్యం పాలైన ఖాతరుండదు....ఎప్పుడు చింపిరి జుట్టు.....చినిగిన బట్టలతో ఉంటేనే......ఇష్టపడతారు.....అమ్మ నాన్నలని చూడాలి అన్నా.....వినిపించుకోరు......అక్కడికెళ్తే ఏం చెబుతానో అని....పంపించడానికి  ఇష్టపడరు......వాళ్ళ పిల్లల్లాగే చదువుకోవాలనుంటుంది......వాళ్లలాగే వుండాలనిపిస్తుంది.....కానీ .....ఎలా.....ఎప్పుడైనా సరదా పడి......కలిసి ఆడినా....కసురుకుంటారు....కొందరమ్మగార్లని చూస్తే యెంత ముచ్చటేస్తుందో......వాళ్ళ పిల్లలతో సమానంగా చూస్తారు......పని పిల్ల అనకూడదంటారు.....వాళ్ళ పిల్లలకి అక్కా ......అని పిలవమంటారు.....యెంత అదృష్టమో!.....దానికి కూడా.....పెట్టి పుట్టాలి.....అదేదో చట్టం వచ్చింది....బాలలతో పని చేయించకూడదని......ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారని.....అన్నారు అమ్మగారు!......ఐన మామూలే......మాకు మంచి రోజులెప్పడొస్తాయో మరి!.....అప్పుడు....తెల్లారేసరికి టీ తాగి,  ఎంచక్కా అమ్మ చేతి వంట తిని.......గంతులేస్తూ......బడికెళ్ళాలి......అనీ ఆశ......ఆ ఆస అడియాసవుతుందని నాకు తెల్సు.......అయినా....మనిషి ఆశ జీవి కదా.....ఏమో.....ఆ రోజు కోసం ఎదురు చూస్తూ........వుంటాను......ఇట్లు, మీ పనిపిల్ల......జయప్రభాశర్మ.



Comments

Popular posts from this blog

Articles