KONGA

పొడవుగా ఉంటే! ......నాతొ పోలుస్తారు.....కొంగలా ఉంటారని!....చాల్లే కొంగ జపం అనీ.... అంటుంటారు....జేష్ఠ కొంగని.......కొందరు తిడుతుంటారు .......ఈపాటికితెలిసిపోయుంటుంది.......నేనెవరో చెప్పడానికేముంది......ఆ....కొంగ.....మాకెందుకుతెలీదు......అనుకుంటున్నారు......మీ బుద్ధి నేనేరుగనా?.....నాకు తెలుసండి బాబూ.....ఏదో మీ స్వదేశానికి చుట్టరికంగా వచ్చి.....మిమ్మల్ని కూడా పలకరిద్దామని వచ్చా!.......అబ్బా.....విదేశాలనేసరికి యెంత మోజో!......టక్కున ఆగిపోయారు చూసారా!......ఆ క్రేజలాంటిది మరి.......వీసాలు,విమానాలు......లక్షల ఖర్చులు లేకుండా......నే తీసుకెళ్ళిపోతానంటే రెడీగా ఉన్నట్టున్నారు!.......ఏమి ఆత్రుత......గుడ్లప్పగించి ఎలా చూస్తున్నారో!.......డాలర్ల కట్ట ముక్కుతో.......నే విదేశాలనుంచి వచ్చినప్పుడు......తెచ్చేస్తే తీసుకోడానికి కూడా వెనకాడరేమో!......వామ్మో!.....విదేశీ వ్యామోహం మరి.......పాపం మీ స్వదేశీ కొంగలంటే అంత అలుసా!.....తెల్ల కొంగలు......సరస్సులను వెతుక్కుంటూ వచ్చినపుడు.....యెంత బాగుంటుందో......అలాగే పల్లెల్లో.......వరి నాటినప్పుడు.....ఎంతో సందడి చేస్తూ.....చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంటుంది.......మీ చిన్నతనంలో ఐతే.......సాయం సంధ్య వేళ.....ఆకాశంలో కొంగలు ఎగురుతూ......వరుసక్రమంలో గూటికి చేరుతుంటే.......చూసి......పాతగోల్లిస్తాను కొత్త గోళ్లివ్వవా!....అనీ.....ఆ గోళ్లవంక చూసి......ఆ.. కొత్త గొల్లోచ్చేసాయ్ అనీ....గుంతులేస్తూ.....ఎంత పొంగిపోయేవారో......తప్పండి.....స్వదేశం తరువాతే విదేశమన్నది.....గుర్తుపెట్టుకోండేం.....ఇహ మా సంగతంటారా!.....వలస వస్తుంటాము.....పోతుంటాము.....నెల్లూరు దగ్గర పులికాట్ సరస్సు..... ఏలూరు దగ్గర కొల్లేరు సరస్సు..... విశాఖపట్నానికి దగ్గరలో కొండకర్లావ.......మీ పక్కనే వున్నా.....ఒరిస్సా దగ్గర చిల్కా సరస్సు.....మాకు ఎంతో ప్రీతికరమైనవండీ........ఎక్కువగా అక్కడికే వస్తుంటాము....మమ్మల్ని చూడ్డానికి......తెగ ఎగబడి వస్తుంటారు.......పర్యాటకులు......విదేశీ పక్షులు వలస వచ్చాయంటే,   వలస వచ్చాయని....ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు......పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దుతున్నారు తెలుసా.......మాకెంత గర్వమనిపిస్తుందో అది చూస్తే.......ఇంతకీ నేను....విదేశీకొంగను కానండీ బాబూ......మీ రియాక్షన్ ఎలా ఉంటుందో.....విదేశమంటే....అనీ......చెవిలో పువ్వులు పెట్టా....నేను కాబట్టి సరిపోయింది......ఇలా చెప్పిన వారిని.....నమ్మకండేం.....మా స్నేహితులు.....అదేనండీ.....మీ కొంగల్ని కూడా........ఆదరించండీ......మరి ఎగిరిపోతున్నా.....టాటా వీడుకోలు......గుడ్ బై.....ఇంక సెలవు........ఇట్లు, మీ తెల్ల కొంగ.......జయప్రభాశర్మ.

Comments

Popular posts from this blog

Articles