"Nakkalollu" అయ్యా నమస్కారం!.బాగున్నారా!. మరేంలేదు! నాగురించి చెప్పుకుందామని వచ్చానయ్యా!. కాస్త ఓపిగ్గా వినాలిమరి.మేము నక్కల కులస్తులం.నక్కలోళ్లు అంటారు మమ్మల్ని. మావృత్తి వేటాడ్డం. మేముకూడా సంచారజాతి కులస్తులమే. ఒకేదగ్గర నివాసముండకుండా ఊర్లు మారుతుంటాము.తెల్లారి లేచిన మొదలు మళ్ళీ చీకటి పడేవరకు చెట్లనక,పుట్లనక తిరిగి అలసి వస్తుంటాము. ఒంటిమీద చిన్న గోచీగుడ్డతప్ప,ఇంకేమి ధరించము. చేతిలో గునపము,బొరిగి మా ఆయుధాలు.మేము ఆడ,మగా అనీ లేకుండా ఇంటిల్లిపాది వేటకి వెళ్లి వస్తుంటాము. మా వేటలో ఎక్కువగా పాముల్ని వేటాడి పట్టుకుంటుంట్టాము. అందులో ప్రత్యేకంగా నాగుపాములు,జెర్రిపోతుల జాతికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తాము. అవి దొరికిన రోజు మా ఆనందానికి హద్దే ఉండదు. అంత సంబరపడిపోతాము.అవి ఎక్కడున్నా ఒడిసి పట్టుకోవడంలో సిద్ధహస్తులం మేమె. మేము కచ్చితంగా ఎక్కడఉన్నాయి కూడా చెప్పగలం.మానుంచి తప్పించ్చుకోవడం వాటి తరం కాదంటే నమ్ముతారా!. అందుకే పాము ఎవరింటికి వచ్చిన పల్లెల్లో మమ్మల్ని పిలిచి తీసుకెళ్లేవారు. మరి మాకు ఇలాంటి పాములు దొరికితే యెగిరి గంతులేస్తాము. వీటి చర్మాన్ని ఒలిచి ఊరబెట్టి ఉప్పుల...