డ్యూయెట్ లిరిసిస్ట్,జె.పీ.ఎస్. అతడు; ఏదోలా వుందే ఏదెదోలావుందే నిను చూసినవేళా నాలో ఇంకేదో అవుతోందే ఆమె; ఏంటో అనుకుందే యింకేంటో అనుకుందే చిరునవ్వులకర్ధం నీలో అది ఏంటో తెలిసిందే చరణం; అతడు; నా తలపుల వలపుల గమకం తియ తియ్యని తేనెల మధురం ఆమె; నా మనసున నిలిచిన ప్రణయం చల చల్లగ తాకిన పవనం అతడు; అనుకోని ఆరాటం అందిస్తా ఆహ్వానం ఆమె; ఇక లేదే ఆషాడం మరి రేపే తాంబూలం '' ఏదోలా' చరణం ఆమె; నా కనులకు కలలకు సాక్ష్యం ప్రేమాంకిత మృధు భావం అతడు; నా తనువుకు తపనకు మూలం నును సిగ్గుల నీ వదనం ఆమె; మది చేసే విన్యాసం మురిపించే రస నాదం అతడు; అరుదెంచే కార్తీకం ఆనందం మన సొంతం 'ఏదోలా'
Posts
Showing posts from 2017
- Get link
- X
- Other Apps
"VAMMO NORU" ఏదైనా చెయ్యగల సమర్ధత,ఎంతకైనా తెగించే దుడుకు స్వభావం, కత్తికైనా లేని పదును, మాటల తూటాని,మరో ఆయుధాన్ని. దేనికైనా తాళాలు వున్నాయి గాని...మనకి!!అబ్బే!! ఎవ్వరి తరం కాదు!!. నీ వాగుడు వరద ఆపవే బాబు!!నువ్వెవరో చెప్పి ఏడు!!....అదే మరి!!చెబుతున్నా!!వినండి!!మీ నోరుని!!అడ్డు అదుపు లేనిదాన్ని!!.నెలల పిల్ల నుంచి బెంగ పడిపోతూంట్టారు.ఎక్కడ మాటలు రావో అని.వస పోసేసేవాళ్ళు కొందరైతే,వైద్యుల దగ్గరకు మోసుకెలిపేవాళ్లు కొందరు.అమ్మ!!అని పిలుపు వింటే చాలు.ఉత్సాహంతో ఉరుకులు, పరుగులు, అడిగిన వాళ్లకి, అడగనివాళ్ళకి చెప్పుకొని...ఓ..ఎంత మురిసిపోతారో. ఇంక అక్కడ్నుంచి ఉంటాయి రకరకాల జిమ్మిక్కులు.ఇహ వున్నత స్థానానికి తీసుకెళ్లాలన్న, పతనం చేయాలన్న, మనదే ఆపరేషన్ అంతా.మాట అన్నది మణి మాణిక్యాలకన్నా విలువైనది.మాయల ఫకీరు చిలక ప్రాణంలా మనమే మూల కారణం.పాతాళానికి తోయవేయబడ్డారంటే మనదే ఆ ఘన కార్యం. అందుకే అంటారు నోరా!!తేమాకే వీపుకి!! అని. అయినా విని ఏడిస్తేగా!!. బాధ పడితే గాని బోధపడదని!!.పదిమందిలో మాట్లాడాలంటే మామూలు విషయమా?.....చక్కని పలుకు పలికి,తీయటి మాట్లాడొద్దని అన్నానా?. అయ్యో!!అయ్యో!!ఎంత మాటనేస్
- Get link
- X
- Other Apps
మెట్టు భూమి, రచన జె.పీ.ఎస్. వానతల్లి నీకు దండమే కరుణించి చల్లగ కురియవే జోరువాన నీకోసమే పడిగాపులూ పడుతున్నమే పరుగులెత్తి మాకోసమే కురిసి పచ్చని పంటలనివ్వవే భూమి తల్లినీ నమ్మినం చెమట ధారపోసి బతికినం కన్నీళ్ల కష్టాన్ని చూసినం కడుపుకింత తిండి మరిచినం బీటలోరి భూమి బద్దలై బాధఒడిసిపట్టి మరి ఏడ్సినం ఉన్నఊరినీ వదిలినం తప్పదంటు పట్నమెల్లినం మెట్టభూమికి దండమెట్టినం మెతుకుకోసమై వెతికినం మల్లి రావాలంటు మొక్కినం ఇహ కాని వూరు బండి ఎక్కినం
- Get link
- X
- Other Apps
నాగులచవితి,రచన,జె.పీ.ఎస్. కార్తీక మాసం వచ్చింది కన్నుల్లో వెలుగు తెచ్చింది నాగన్న పండగ వచ్చింది నాగులచవితి రోజు ఇది తొలి ఝామునే నిద్ర లేచాము తలార స్నానం చేసాము ముంగిట కళ్ళాపి చల్లాము ముత్యాల ముగ్గులు పెట్టాము పూలు ఫలములు పూజాద్రవ్యాలు ఏరికూర్చి మేముంచాము చిమ్మిలి దంచి ఉంచాము చలిమిడి ఉండలు చేసాము నాగులగావంచ తెచ్చాము నాగేంద్ర నీకు మొక్కాము వడపప్పుపానకం నారీకేళము పుట్టనుంచి నిను కొలిచాము నాగేశ్వర నిన్ను తలచాము మా మనమ్మునా నిలిపాము చిన్న పెద్ద తరలొచ్చాము శివాభరణ పూజించాము అగరుబత్తులు సీమటపాసులు కాల్చి మురిసి తరియించాము
- Get link
- X
- Other Apps
ప్రక్రుతి విలయతాండవం,హుదూద్, జె.పీ.ఎస్. సరిగ్గా మూడేళ్ళక్రితం ముచ్చెమటలు పట్టే రోజు గుండె దడ పుట్టే రోజు విశాఖ విల విల లాడే రోజు అర చేతిలో ప్రాణం పెట్టుకున్న రోజు భయాందోళనకు గురి కాబడిన రోజు ప్రక్రుతి తల్లి ఆగ్రహానికి బలి ఐన రోజు అస్తవ్యస్తంగా ఉన్నవిశాఖని చూసి ఏడ్చిన రోజు మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన రోజు ఎప్పుడు విశాఖని ప్రేమగా లాలించే ప్రకృతితల్లి ఎందుకు కోపగించిందో తెలియని పరీస్థితి వాతావరణ శాఖవారి హెచ్చరిక మామూలే అనుకున్నాం ఇస్రో చెప్పినా ఖాతరు చేయకుండా చూసాం కానీ అనుకున్నంతా ఐంది భవంతులు సైతం ఉయ్యాల లూగాయి వందల చరిత్ర మానులు కూకటి వేళ్ళతో నేలకొరిగాయి నిద్రలేదు హారం లేదు పాలులేవు నీళ్లు లేవు విద్యుత్తు సౌకర్యం లేదు సమాచార వ్యవస్థ కనుమరుగు ఏ దిష్టి తగిలిందో అని ఒకటికి పదిసార్లు అనుకున్న రోజు ఆసియాలోనే అభివృద్ధిపథంలో ప్రధమ స్థానం విశాఖ అందం ఆనందం ఆహ్లాదానికి పెట్టింది పేరు విశాఖ సాగర తీరం చల్లనిగాలితో పర్యాటకులను సమ్మోహనపరిచే విశాఖ కానీ! గతం కంటే అందం రెట్టింపని జనం మెచ్చే రోజు! ఈ రోజు మా విశాఖ ఎప్పటికీ ఇలానే వుండాలని కోరుకుంటున్నాము పచ్చని గిరుల మధ్య పదిలంగా
- Get link
- X
- Other Apps
జానపద యుగళ గీతం ,రచన జె.పీ.ఎస్. 4 Years back c.d kosamai raasindi తూటూ పూల రంగు కోకా...... తెచ్చానే నీకు కట్టుకోగా ఉమ్మెత్తా పూల రంగు సొక్కా...... ఏసావంటే పూలరంగా నీ సెవికి కమ్మలు ఎడతా నువ్వు సెప్పినట్టు నేనింటా నా పేనమంటె నువ్వంటా నీ మాట జవదాటనంటా నా నవ్వుల సింగారి ముద్దుల బంగారి నువ్వేను నా జాపత్రి నీ ఏలి పట్టి నే నడుత్తా నీతోనే నాకు లోకమంతా నీ గుండెలోన నిదురపోతా నీ యెంట తోడు నేనంటా ఆ పూలన్ని ఏరీ నీ పాదాల ఏసీ చేస్తాను పూజను ఏటీ
- Get link
- X
- Other Apps
అలంపురం జోగులాంబ, భక్తి గీతం,లిరిక్, జె.పీ.ఎస్. సి.డి.కోసం రాసినది. రససిద్ధుడు కట్టించిన దేవాలయం అలరారుతున్న మన అలంపురం తపసు చేయ సిద్ధుడొచ్చె ఈ క్షేత్రం కాశీ విశ్వేశ్వరుని ప్రేరణం బ్రహ్మెశ్వర శిరసు నుండి జోగులాంబ నోటినుండి గణపతయ్య బొడ్డునుండి ఇచ్చినారు ఒక రసము పరసవేదిని చేసి ఆలయాలు కట్టించి పరమపావనంగ చరితలోన నిలిచీ దండెత్తగా వచ్చాడు విలసద్రాజు పరసవేదినీ కోసం ఆ మహారాజు అసంపూర్తి నిర్మాణం ఆలయంలో ప్రవేశం సిద్ధుడు అయినాడు బ్రహ్మస్వరునిలో లీనం కలతచెంది సిద్ధుడు పెట్టినాడు శాపం రాజ్యం పోగొట్టుకొని కష్టాలను అనుభవించి పొందినాడు జింకచేత ఉపదేశం చివరికి చేరాడు రాజు శివసాన్నిధ్యం
- Get link
- X
- Other Apps
రిం జిమ్ రిం జిమ్ హైదరాబాద్ ,పేరడీ సాంగ్ లిరిక్,జె.పీ.ఎస్. ఎప్పసుగొచ్చిందీ సైకిల్ ఎక్సుప్రెసు అనుకున్నా బైస్కిల్ ఈల వేసి నే తీసే టైముకి టపాసుల పేలె సూపర్ ఒక చక్రం పక్కింటోడిది మలి చక్రం ఎదిరింటోడిది బెల్లేమో మీదింటోడిది బ్రేకేమో బెస్ట్ ఫ్రెండుది పార్టులు అన్నీ........ పార్టులు అన్నీ ఏకం చేస్తే షేపుకి వచ్చిన సైకిల్ ఒక టైరుకి ట్యూబే పోయే ఒక టైరుకి గాలే వొదిలే బెల్లేమో మోగదు ఆయే బ్రేకేమో ఆగదు ఆయే బటానోడికీ............... బటానోడికీ యిచ్చే పార్టులు తెచ్చినందుకే తిప్పల్
- Get link
- X
- Other Apps
లలితగీతం,రచన,జె.పీ.ఎస్. ఎందుకమ్మ కోయిలమ్మ అంత స్వరం నీకు ఎంత విన్నాగాన తనివి తీరదు నాకు భగవంతుడు నీకిచ్చిన మా గొప్ప వరమమ్మా బాధ్యతగా శిరసావహించావు నీవమ్మా అలసటంటు మరిచావు ఆనందం పంచావు ఆమని కోయిల అంటు బిరుదును పొందావు చిగురు తొడిగిన కొమ్మల తీయని రాగాలు తీయ కమ్మగ ఆస్వాదించి అభివాదము చేయా అభినందన వెల్లువా విన సొంపుగ గీతికా ఆభేరి రాగాన అందుకొ ప్రియ మాలికా
- Get link
- X
- Other Apps
Videsi Vyamoham కళ్ళల్లో వెలుగు ! విప్పారిన ముఖబింబం ! మాటల్లో చెప్పలేనంతగా ఆనందం !. గెంతులు ! చిందులు ! పిల్లలకే కాదు ! తల్లితండ్రులు కూడా !. ఎందుకు ఇదంతా అంటే ! వీసా వచ్చేసింది !. అవధిలేని సంతోషం ! ఇహ పార్టీలు , బంధుదర్శనాలు , షాపింగులు ! ఓ ..! హడావిడి అంతా ఇంతానా ! విదేశీ ప్రయాణం ! విదేశాల మోజు !. తమ స్వప్నం నెరవేరిన వేళ !. సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాం ! ఇంక ఎదురులేని జీవితం !. ఇంతకంటే ఏం కావాలి ! ఇదే ఆలోచన !. కడుపు కట్టుకొని ఏడు ఇరుకుల్లో దాచిపెట్టిన సొమ్ములు తీసే తండ్రి ! కడుపు చూసి అన్నం పెట్టి , పువ్వుల్లో పెట్టి చూసుకున్న తల్లి ! ఎంతో వ్యయప్రయాసలకోర్చి , పిల్లలే సర్వస్వము అనుకోని , పెంచుకున్న తల్లి తండ్రులను వదలి , వెళ్ళిపోయి ! అక్కడే సెటిల్ ఐపోతామని ఇంకో ఆలోచన ! ఏవండీ ! మన దేశం చదువుకోండమ్మా అంటూ , ప్రాధమిక విద్య మొదలు ఉన్నతస్థాయి విద్య వరకు .... పాఠశాలలు ఏర్పాటు చేయటమే కాకుండా ... బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి .... బాగా చదువుకున్న వాళ్లకి , నగదు బహుమతులిచ్చి ప్రోత్సహించి ... ఆర్ధికంగా వెనకబడినవ
- Get link
- X
- Other Apps
జానపద గీతం,రచన: జయప్రభాశర్మ. గాజులోడప్పో మా యింటికొచ్చినాడప్పో గాజులోడప్పో మా యింటికొచ్చినాడప్పో రబ్బరు గాజులన్నడు రంగు రంగుల గాజులన్నడు ఓరకంట సూసిండు ఒయ్యారి ఏస్కొ అన్నడు మలరము తీసినాడు మంచిరకములన్నాడు మా గాజులేస్తే నీకు మంచ్చి జరుగునన్నాడు మాట మాట కలిపినాడు మా వూరు ఎల్దుమన్నడు ఎర్రగాజులేతీసి ఏటేటోఅన్నాడు పసుపుగాజులే చూసి పడి పడి పడి నవ్వినాడు ఆకుపచ్చ గాజులేస్తే అదిరేనని అన్నాడు తెల్లగాజులే తీసి నీకు నప్పవన్నాడు నల్లగాజులేసి నీకు దిష్టి తగలదన్నాడు
- Get link
- X
- Other Apps
నేనొచ్చి ఎన్నిరోజులైందో! నా వాళ్ళని పలకరించాలని ఎంత ఆత్రుత పడ్డానో! పుడమితల్లిని తాకిన వేళ ఎంత సంబరమేసిందో! నన్ను చూసిన వాళ్ళు ఎంత గంతులేసారో! హాయి గొలిపే గాలినాస్వాదిస్తు ఎంత మైమరచిపోయారో! నాపై అలిగినవాళ్లంతా ఎంత పండగ చేసుకున్నారో! నవ్వుతూ నన్ను ఎంత బాగా చూసారో! చెప్పలేనంతఆప్యాయత కురిపించి స్వాగతం పలికారో! వారి అభిమానం చూసి నన్ను నేనే తిట్టుకున్నా! ఏవైపోయాను ఇన్నాళ్లు అనీ! కానీ!ఇప్పటికైనా వచ్చినందుకు ఆనందపడుతున్నా! మీ చినుకు చిత్తడినై పుత్తడి చెయ్యాలని ఆశ పడుతున్నా!
- Get link
- X
- Other Apps
నీలిరంగు చీర కట్టి ఎంత అందంగా ఉన్నావో తెలుసా! నల్లని కాటుక పెట్టుకున్నప్పుడు ఇంకా అందంగా ఉంటావు కానీ! అంతలోనే తుడిచేస్తావు ఎందుకని! నీ రాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము స్వాగతం పలకాలని సన్నాహాలు చేస్తుంటే రావెందుకని! మా ఆనందం నీ ఆనందం కాదా! ఇంతగా ఏడిపించటం భావ్యమా! రా!దిగిరా! చల్లని చినుకై కురిసేవానజల్లై!...........jayaprabhasharma.
- Get link
- X
- Other Apps
జానపద గీతం,రచన: జయప్రభాశర్మ. టెర్లీను కోకా కట్టీ ముఖమల్లు రయికా తొడిగీ ఒయ్యారి నడిచొస్తుంటే మనసంతా పరుగులు తీసే సిలుకూ పంచెనూ కట్టీ కద్దారు సొక్కా తొడిగీ మీసం మెలిపెడుతొస్తుంటే మదిలోన అలజడి రేగే గున్నమావి తోటావుంది గుబురు కంది సేనూఉంది నీలాటి రేవూవుంది నిమ్మసెట్టు నీడా వుంది అందాలా మరదలు పిల్లా పోదాం పద మరి అటు అల్లా నువ్వే నా పనసాపండు నీపై నా మోజే మెండు నువ్వే నా మల్లెచెండు నేనే నీ అత్తరు సెంటూ సొగసైన పాలా ఎండి పూసేస్తా గూడూబండి
- Get link
- X
- Other Apps
జానపద యుగళ గీతం. రచన:జయప్రభాశర్మ. పల్లవి: అతడు: రాయే సిన్నమ్మి నా యెంట రాయె అమ్మీ న యెంట రాయె అమ్మీ నిన్నేలుకుంట సుమ్మీ ఆమె: పోరా సిన్నోడా యెంట రాదు అమ్మీ ని యెంట రాదు అమ్మీ నువ్వంటే మంట సుమ్మీ చరణం: అతడు: ఆదోరం జాతరలో రబ్బరుగాజులే కొంటా బుదోరం సంతలోన రంగులరాట్నమెక్కిస్తా ఆమె: ని మాటలే బొంకు ఎయ్యమాకులే టముకు నే రానులే జంకూ నాకేమోలే బెరుకూ అతడు: ఉమ్మెత్త పువు తెస్తా మెట్టపైన ముడిచెడతా ఆమె: ఆ మాటలాపమంటా తేమాకులే తంటా "రాయె: చరణం: అతడు: మద్దేరు దాటిస్తా పూలకొక కొని యెడతా మా వూరు సూపిస్తా ఇంటికాడ ఒండెడతా ఆమె: నన్నేలు వాడంట మానసిస్తే సాలంటా నాతోనె నీవంటా నీతోనే నేనంటా అతడు: నీ జడగంటలంటా న ఊసులేనంటా ఆమె: నేను నీ జంటవుతా నువ్వు నా ఎంటంటా "రాయె" అతడు: రాయె సిన్నమ్మి యెంట రాయె అమ్మీ యెంట రాయె అమ్మీ న జంట నీవే సుమ్మీ ఆమె: పదరా సిన్నోడా యెంట వుంటదమ్మీ యెంట ఉంటదమ్మీ నీ జంట నేనె సుమ్మీ రచన: జయప్రభాశర్మ.
- Get link
- X
- Other Apps
NIREEKSHANA నిశీధిని తిట్టుకుంటు నీకోసం నిరీక్షిస్తూ నీకై ఎదురు చూస్తూ నీ రూపం తలచుకుంటూ నీ మాటలు పలవరిస్తూ నీ జ్ఞాపకాలు వెంటాడుతూ నీ ధ్యానమై జీవిస్తూ వలపుల తలపుల చంద్రమా! ఒకపరి నను చూడుమా! నీ ప్రేమకై పరితపిస్తున్నా! దరహాస చంద్రికవై దరి చేరుమా! దయార్ద్రహృదయినివై కరుణించుమా! మూటలడిగితినా! ముద్దులడిగితినా! మురిపాల ముఖము చూడనైతీనా! ముగ్ధ నినుగాంచ నోచుకోనైతీనా!
- Get link
- X
- Other Apps
"PREMIKA" నా పాటకు పల్లవిగా నా పదాల అల్లికగా నా కవితకు కల్పనగా నా సాహిత్య ప్రేరణగా నడిపించే నాయికా! వెలుగిచ్చే దీపికా! నిను పొగిడే పొగడ దండనై నిను గిచ్చే మెడ హారాన్నై చిరుగజ్జెల సవ్వడినై నీ గాజుల గల గలనై నిన్నంటుకోవాలని గుండెల్లో దాగిపోవాలని నీలో కలిసిపోవాలని నీతో ఉండిపోవాలని ఆశ పడుతున్నా!కలలు కంటున్నా! నీ ప్రేమకు దాసుడనై నీ ఊహల వేణువునై స్వరం పలికేనా!సర్వం అనుకున్నా! నీ తలపుల జలపాతంలో తడిసిముద్దవ్వాలని నీ వలపుల రుచి మంత్రంతో నను నేనే మరవాలని మనసునిస్తున్నా! మురిసిపోతున్నా! పంచభూతాల సాక్షిగా! ప్రమాణం చేస్తున్నా! నా జీవన రాగిణి నీవని నా మోహన హాసిని ఓ చెలి
- Get link
- X
- Other Apps
Veedi Kukka చిత్తకుక్కలా తిరుగుతాడు!...పిచ్చికుక్కలా అరుస్తున్నాడు!....పోరా కుక్క!...కుక్కలా పడుండు!....ఏంటా మాటలు!. అంత చులకనైపోయానా!. మరీ ఇంత అన్యాయమా!.అసలు నాకున్న విశ్వాసం ఏ ప్రాణికయినా వుందా!.మీరు విసిరి పారేసిన నాలుగు ఎంగిలి మెతుకులు తిన్నా చాలు,మీ యింటి చుట్టూ తిరుగుతూనేవుంటాను. ఎంత విసుక్కోని వెంట తగిలి కొట్టినా వదలను. ఎప్పుడూ మీరు బాగుండాలనే కోరుకుంటాను.అదే పిల్లైతే యింట్లో ఎవ్వరు ఉండకుండా పొతే,ఎంచక్కా పాలు అన్నీ తాగెయ్యొచ్చు అనుకుంటుంది. నేనలాకాదు అందరు కిల కిలలాడుతూ ఇంటి నిండుగా ఉంటే నాకు ఏవైనా పెడతారు కదా అనుకుంటాను. నాకు, ఆ పిల్లికి అదే తేడా. వీధి కుక్కలంటే ఎంత అలుసో! అర్ధరాత్రి ఏమాత్రం అలికిడైన,మేల్కొని అదే పనిగా అరుస్తూనేవుంటాయి.మీరు విసుక్కుంటారు గాని.మమ్మల్ని అసహ్యించుకొని మున్సిపాలిటివారికి పిర్యాదు చేసి పట్టించాలనుకుంటారు.వాళ్ళు బండి వేసుకొచ్చి అమానుషంగా మమ్మల్ని చంపడం ..చూసి భరించలేక, యువ సామ్రాట్,నాగార్జునగారి సతీమణి,శ్రీమతి అమలగారు, సంజయ్ గాంధీగారి సతీమణి, శ్రీమతి మేనకాగాంధీగారు, మూగప్రాణులను హింసించుట అన్యాయమని ఆపి పుణ్యం కట్టుకున్నారు.కోటీశ్వరుల ఇంటి కాపల
- Get link
- X
- Other Apps
Maidanam నన్ను చూస్తే ఎక్కడ్లేని ఉత్సాహం!ఎంత వేగం నా దగ్గర కొచ్చేద్దామా అని ఆనందంతో గెంతులు!సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు!ఆదివారమైతే చాలుఒకటే పరుగులు!. అరె! ఎవరండీ! ఈ గోల గోవిందం! అనుకుంటున్నారు కదూ! నిజమే నా బాధ మీకేం తెలుసు!గోల లాగే ఉంటుంది మరి!.బోరు కొడుతూ నేను బోడిగుండులా మిగిలిపోయిన మైదానాన్నండి!. ఒకప్పుడు మీరు నాకోసమొస్తే,నేనిప్పుడు రివర్సులో మీకోసం తెగ చూస్తూ, ఆరాటపడుతున్న పిచ్చిదాన్ని.కొంతకాలానికి నేనన్నదాన్ని కరువైపోతానేమో అనిపిస్తోంది.యిప్పటికే పూర్వ వైభవం తగ్గి కళావిహీనంగా తయారయ్యాను. లేకపోతె ఏంటండీ! వీడియోగేమ్స్, మొబైల్ గేమ్స్, ప్లే స్టేషన్లు ......ఓయబ్బో...ఎన్ని విడ్డూరాలు! హాయిగా యింట్లో కూచొని,హ్యాపీగా ఆడుకోక....నేనవసరమా అన్నట్టుంది యవ్వారం. నిజమే కావచ్చు!కానీ!గతాన్ని ఎప్పుడు మరచిపోకూడదు కదా!. స్కూల్లో సాయంత్రమయ్యేసరికి....ఏం సందడి చేసేవారో!చీకటి పడిపోతున్నా పట్టించుకొనేవారుకాదు. ఒకటా, రెండా ఆటలు.పరుగు పందేలు,కో కో, కబాడీ, వాలీబాల్,త్రోబాల్,ఫుట్బాల్, క్రికెట్టు,షటిలు, బాల్బాడ్మింటన్, రింగు టెన్నిస్.....ఎన్ని ఆటలో....నన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పేదికాదు.న
- Get link
- X
- Other Apps
VAMMO BANK కారు లోను కావాలా?ఇంటి లోను కావాలా?స్థలానికి లోను కావాలా?చదువుకు లోను కావాలా? ఏది కావాలంటే అది,మరెందుకాలస్యం!రండి తీసుకెళ్లండి!. మీకోసమే మా బ్యాంకులు! మీ అవసరాల కోసమే మా సేవలు!కాకపొతే కొన్ని కండిషన్స్.....మీకొచ్చే జీతం యెంత,గవెర్నమెంటా?ప్రయివేటా?.....మీ చేతికి కట్టింగ్లు పోను యెంత వస్తుంది?....మీ వెనకాల పాపం అమాయక పక్షి..అదేనండి! గవర్నమెంట్ ఉద్యోగి సంతకం గోకడానికి సిద్ధంగా వున్నారా?వారి వసూళ్లకు అంతరాయం ఏర్పడకుండా!ముందు జాగ్రత్త చర్య న్నమాట. ఇంతకీ ఏవిటమ్మ నీ గోల?ఎవరునువ్వు?... ఎల్లప్పుడూ మీ వెంట వుండే నీడనండి బాబు!....ఎవరు నువ్వంటారేంటండి భలేవారే!. సరే!అసలు విషయానికొద్దాం!మీరేమో...ఓ...తెగ మురిసిపోయి,లోను ఇవ్వడమే మహా భాగ్యన్గా భావించి ఒకటే పరుగు.తీసుకున్నప్పుడు బానే ఉంటుంది. తరవాతుంటుంది అసలు కథ. ఒకనెల జాప్యం జరిగిందో....వడ్డీ,చక్రవడ్డీ....అదేపనిగా ఫోన్లు....చచ్చింది గొర్రె.ఎలాగైనా వసూలు చేయుట ఖాయం. వదిలేది లేదు. కట్టక తప్పదు.కాకపొతే నిద్ర,హారాలకు భంగం వాటిల్లుతుంది. పెళ్లానికైనా జీతం తెలుసో, లేదో గాని వీళ్ళు మాత్రం,అన్ని వివరాలు సేకరించి,ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువ
- Get link
- X
- Other Apps
DO SUY బ్రిటిషువాళ్ళు మన భారతదేశానికి వచ్చి తిష్టవేసి, మనవాళ్లతో అడ్డమైన చాకిరీ చేయించుకొని, హింసలు పెట్టి మహదానందపడేవారు.ఇది అందరికి తెలిసిన విషయమే. అలాగే వంటలు కూడా వండించుకొని తినేవారట.ఏది చేసిన లొట్టలేసుకుని లాగించేవారట.కొన్ని సందర్భాల్లో,దీని పేరేమిటి అని అడిగేవారట.వీళ్ళకేమో ఇంగ్లీషు రాదు....వాళ్ళకేమో తెలుగు అర్ధం కాదు.ఎలాగోలా మేనేజ్ చేసేవారట మనవాళ్ళు భయంతో. దిన దిన గండం దీర్గాయుష్షులా గడిపేవారట కాలం.ఏది చేసిన,ఎలా చేసిన,దేనికైనా హింసించేవారేమో కానీ,వంట దగ్గిర మాత్రం తెగ మెచ్చుకొనేవారట.ఇది ఎలా చేశారు?అది ఎలా చేశారు?అని.అంత బాగా పొగిడేలా వంటలు చేసేవారట మనవాళ్ళు. మన" దోస " అంటే పడి చచ్చేవారట. ఎన్ని రకాల దోశలు చెయ్యాలో అన్ని రకాలు చేసి మనవాళ్ళు పెట్టేవారట.ఆ దోస తినేసరికి వాళ్ళ కోపం పటాపంచలైపోయేదట.ఒకసారి బ్రిటిషువాళ్ళతో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు,మనవాళ్ళు దోశలు తినడానికి మూటకట్టి తీసుకెళ్ళారట.మూట విప్పి పాపం మనవాళ్ళు అందరికి వడ్డించేసరికి,అందులో ఇక్కడున్న బ్రిటిషోళ్ళని చూడ్డానికి కొత్తగా వచ్చిన మరో బ్రిటీషోడికి,ఇదేదో అర్ధం కాక,అడిగాడట. చాల బాగుంది ఇదేంటని?.బుర్ర గోక
- Get link
- X
- Other Apps
MY NAME IS FAN హలో! నా పేరు ఫేనండి!. ఫేనంటే! గాలికోసం వేసుకున్న ఫ్యాను కాదండి బాబు! ఇదికూడా ఇంచుమించు అలాంటిదే అయినా, అది మాత్రం కాదండి.వివిధరంగాలలోపేరుగాంచిన ప్రముఖులంటే పడి చచ్చే వెర్రిప్రేమ యోధులం.తెల్లారి లేచిన మొదలు వీరికి ప్రేమ పంచుటయే మా వృత్తి. వారంటే మా ప్రాణం.వారంటే మా ఆశ.వారిపైనే ఎల్లప్పుడూ మా ద్యాస.చివరికి వారే మా శ్వాస.ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడం.ఎలాంటి శ్రమనైనా ఓర్చుకుంటాం.మా యింటివాళ్లను సైతం పట్టించుకోకుండా వీరే లోకంగా భావిస్తాం.పగలు రాత్రి తెలియదు.అలుపు సొలుపు అసలుండదు.వారికోసం, వారిక్షేమం కోసం ఎంతో తాపత్రయపడుతుంట్టాము. వారిని ఎవరైనా ఒక్క మాటన్నా ఒప్పుకోము.ఎంతో ఎత్తులో వారుండాలని,ప్రచారాలు,జనసమీకరణలు, సభలు ఏర్పాటు చెయ్యటం ఇదే మా పనిగా పెట్టుకుంటాం. ఎంత సేపు వారు మాకు బాగా తెల్సు అని చెప్పుకుంటూ పొంగిపోవటమే తెల్సు.ఎక్కడో ఓ మూల ఫొటోలో కనిపించిన చాలని అనుకొనే నైజం.అతి అభిమానం కనబరుస్తూ,పరుగులు పెడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు వారికొస్తుంటే మావిగా తలుస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడుతుంటాం.ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయం.కుటుంబసభ్యుల మాటల్ని కూడా ఖా
- Get link
- X
- Other Apps
CHIRU VYAPAARI రోజంతా కష్టపడతాను.అత్యాశకు పోను.పదో పరకో మిగిలితే చాలు, అదే పది వేలనుకుంటాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదుకదూ!. ఏదో వున్నదాన్లో ఉన్నంత, కుటుంబసభ్యులను బాగా చూసుకోవాలి అని తాపత్రయ పడుతున్న చిరు వ్యాపారిని. ఎలాగోలా నానా తంటాలు పడి, డబ్బులు పోగు చేసుకొని వ్యాపారం మొదలెడితే నా పాట్లు ఇన్నీ అన్నీనా.అయ్యో! ఇలాంటి వాళ్ళదగ్గరే కొనాలని గాని, వీళ్ళనికూడా ప్రోత్సహించాలనిగాని....అబ్బే! అనిపిస్తేనా! ఊహు!. అవును! మాదగ్గర ఏముంటాయని. ఖరీదైన షాపు, ఏ.సి, పనివాళ్ళు ఇతర ఆర్భాటాలు ఉంటేగా. కనీసం ఆ మాటాడే మాటేనా చేతకాదు. అదే వాళ్ళైతేనా, ఇంగ్లీషులో స్వాగతము చెబుతారు, వచ్చేస్తుంటే వీడ్కోలు పలుకుతారు, ఫ్రిజ్లో వున్న నీళ్లు తీసుకొచ్చి పెడతారు, చక్కటి కుర్చీలేర్పాటుచేస్తారు. అడుగుపెడితే రావాలినిపించదు. అదే మేమయితేనా!చెమటతో తడిసి ముద్దైన బట్టలు, మోటు మాటలు,కొనండి, కొనండి అంటూ కాళ్ళా వేళ్ళ పడటం కాస్తంత చికాకు కలిగించినా, బాగానే వస్తారు. కాకపొతే వచ్చిన చిక్కంతా బేరాలదగ్గరే. ఏవండీ! తెలీక అడుగుతాను! ఇది ఏమైనా బాగుందా! మేము కూడాఎంతో కష్టపడి కొనుగోలు చేసి తెచ్చినవే కదా! ఎండనక, వాననకా,వొంట్లో బాగాలేకపోయిన,
- Get link
- X
- Other Apps
COLLEGE DAYS హిందీ బడా బడా, నా గుండె దడా దడా అని చిన్నప్పుడు చాలా భయముండేది. కానీ రాను రాను దానిపై ఒకరకమైన ఇంటరెస్ట్ పెరిగి,హిందీ పరీక్షలు రాయాలనే తపనతో రాసి పరీక్షలు పాసవడం జరిగింది.అలాగే లెక్కలంటే పై ప్రాణాలు పైనే పోయేవి.ఎలా ఒడ్డెక్కుతానురా బాబు అని ఒకటే చింత.ఎలాగోలా ఒడ్డెక్కి,ఇంటర్లో జాయిన్ అవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం అయింది.అక్కడ బై.పీ,సి, ఊహు లాభం లేదు,ఏం.పీ.సి,అమ్మో లెక్కలు, హెచ్.ఈ.సి, ఆ హిస్టరీలు అవి అబ్బే, ఇహ కామర్సు ఒక్కటే మనకు దిక్కు, చూస్తే,ఓకే అనుకోని జాయిన్ ఐపోయాను.ఇంక చూస్కోండి, నా బాధ వర్ణనాతీతం.ఏంట్రా నాయనా, మళ్ళీ ఇక్కడ కూడా డెబిట్లు, క్రెడిట్లు, లెక్కల్లాగే ఉన్నాయని బెంబేలెత్తిపోయా. దానికి ఎనిమిది గంటలకు ట్యూషను.రోజు తెల్లవారకుండానే రెడీ అయిపోయి, మా ఊరినుంచి మొదటి బస్సులో బయలుదేరి ప్రయాణం చేసి,ఉదయం ఎనిమిది గంటలకి ప్రైవేట్ క్లాసులు, ఆ తరువాత టైపురైటింగ్ క్లాసులు,కాలేజీ క్లాసులు. ఆదివారం నాడు ఎన్.సి.సి క్లాసులు. అదిమాత్రం మనకిష్టమైనది.హుషారే హుషార్.భలేవుండేది.ఎంచక్కా క్లాసుకి వెళ్లేముందు ఏవైతే పెట్టారో, అవి లాగించేసి సంబరమే సంబరం. మా కాలేజీ కూడా చాల పెద్
- Get link
- X
- Other Apps
Jai Ganesha గణాలకు అధిపతి,అల్పసంతోషి, అడగగానే వరాలిచ్చేవాడు,ఆదిదేవుడు,ఏ శుభకార్యం చేసిన ముందు స్వామివారిని,విఘ్నేశ్వరుడా,వినాయకా, చల్లనివాఁడా, గణాధిపా అని స్మరియించి కొలిచే భక్తుల ఆరాధ్య దైవం,గౌరీపుత్రుని లోకమంతా పూజించే రోజు. అదే వినాయచవితి రోజు. పేదా, ధనికా, ప్రాంతీయం అని లేకుండా అత్యంత వైభవంగా పూజలు చేసి, ఆ లంబోదరుని సేవలో తరించి మురిసిపోయే రోజు రానే వచ్చిందని చెప్పలేని ఆనందం.మాటలు చాలని మహోత్సవం.కన్నుల వైభవం.పార్వతీదేవి అతి ప్రియంగా, స్వయంగా తయారుచేసుకుని, ప్రాణ ప్రతిష్ట చేసుకున్నగారాల బిడ్డ పండగ. మహేశ్వరుని ఆగ్రహానికి గురి ఐన తదుపరి, తన ప్రియసఖి పార్వతీదేవి శోకాన్ని చూసి తట్టుకోలేక, జరిగిన వృత్తాన్తమ్ తెలుసుకొని, మరల మహేశ్వరుని ప్రేమను పొంది,ప్రాణప్రతిష్టుడైన గజముఖవదనుని ఘనమైన కడు రమ్యమైన సుదినం. వజ్రవైదూర్య, మరకత మాణిక్యాలనేవి ఆశించనివాడు. అతి తెలివైన వాడు.అందుకే సోదరుడు సుబ్రహ్మణ్య స్వామితో,ప్రపంచం మొత్తం చుట్టి ఎవరు ముందొస్తారో చూద్దాం రమ్మని పందెం కట్టి గెలిచినవాడు. పాపం అమాయకంగా సుబ్రహ్మణ్యుడు ప్రపంచం అంతా చుట్టి వచ్చేసరికి, అక్కడే కొలువుతీరున్న స్వామిని చూసి, సుబ్రహ్మణ