MY NAME IS FAN 

హలో! నా పేరు ఫేనండి!. ఫేనంటే! గాలికోసం వేసుకున్న ఫ్యాను కాదండి బాబు! ఇదికూడా ఇంచుమించు అలాంటిదే అయినా, అది మాత్రం కాదండి.వివిధరంగాలలోపేరుగాంచిన ప్రముఖులంటే పడి చచ్చే వెర్రిప్రేమ యోధులం.తెల్లారి లేచిన మొదలు వీరికి ప్రేమ పంచుటయే మా వృత్తి. వారంటే మా ప్రాణం.వారంటే మా ఆశ.వారిపైనే ఎల్లప్పుడూ మా ద్యాస.చివరికి వారే మా శ్వాస.ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడం.ఎలాంటి శ్రమనైనా ఓర్చుకుంటాం.మా యింటివాళ్లను సైతం పట్టించుకోకుండా వీరే లోకంగా భావిస్తాం.పగలు రాత్రి తెలియదు.అలుపు సొలుపు అసలుండదు.వారికోసం, వారిక్షేమం కోసం ఎంతో తాపత్రయపడుతుంట్టాము. వారిని ఎవరైనా ఒక్క మాటన్నా ఒప్పుకోము.ఎంతో ఎత్తులో వారుండాలని,ప్రచారాలు,జనసమీకరణలు, సభలు ఏర్పాటు చెయ్యటం ఇదే మా పనిగా పెట్టుకుంటాం. ఎంత సేపు వారు మాకు బాగా తెల్సు అని చెప్పుకుంటూ పొంగిపోవటమే తెల్సు.ఎక్కడో ఓ మూల ఫొటోలో కనిపించిన చాలని అనుకొనే నైజం.అతి అభిమానం కనబరుస్తూ,పరుగులు పెడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు వారికొస్తుంటే మావిగా తలుస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడుతుంటాం.ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయం.కుటుంబసభ్యుల మాటల్ని కూడా ఖాతరు చేయని సందర్భాలెన్నో.అందుకే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది.ఇన్ని చేసిన మాకోసం ఒక్క క్షణం ఆలోచించి, వారికుండే పరిధిమేరకు ఏదేని ఉపకారం చేస్తే ఎంత బాగుండో అని!.కానీ అవసరానికి మాత్రమే మేము గుర్తుండేది. అలాంటప్పుడే మమ్మల్ని పలకరించేది.మేమెప్పుడూ! పూలదండలు ఎక్కడ దొరుకుతాయి,వేదికని ఎలా అలంకరిస్తే బాగుంటుంది,ఏ వేదికైతే సరిపోతుంది,సభకి ఎంతమంది హాజరవుతారు,జనాల్ని ఎలా సమీకరించాలి,పెద్దలెవరిని ఆహ్వానించాలి,ఎలాంటి జ్ఞాపికలిస్తే బాగుంటుంది,ప్రసారమాధ్యమాలు వస్తాయా,తోపులాటలు అవి లేకుండా చూసుకోవాలి, ఎలా,కటవుట్లు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చెయ్యాలి ...ఇవే ఆలోచనలు.ఇన్ని చేసినా మాకు ఒరిగేది ఏమి ఉండదు.మారాలనుకున్నా మారలేకపోతున్న మా అతి ప్రేమ, అభిమానం మమ్మల్ని వెనక్కి లాగుతుంటాయి. ఇంటి వాళ్ళకోసం ఒక్క రోజైన కేటాయించాలంటే ఎంతో ఇబ్బందిగా భావిస్తూ, ఎంత వేగం పరుగులెత్తి వెళ్లిపోదామా అని చూస్తాం.నిస్వార్ధంగా అన్నింటికీ ముందుండి నడిపిస్తూ ఉంటాం.మరి అలాంటి మమ్మల్ని ఆదరించి,అభిమానించి చిరకాలం, చేసిన సేవని గుర్తుపెట్టుకోవాలని అభ్యర్థిస్తూ.....మీ కోసం,మీ క్షేమం.కోసం పడి చచ్చే అభిమాని...నమస్కారం...వుంటాను...ఇట్లు,మీ ఫేన్.....జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles