నేనొచ్చి ఎన్నిరోజులైందో!
నా వాళ్ళని పలకరించాలని ఎంత ఆత్రుత పడ్డానో!
పుడమితల్లిని తాకిన వేళ ఎంత సంబరమేసిందో!
నన్ను చూసిన వాళ్ళు ఎంత గంతులేసారో!
హాయి గొలిపే గాలినాస్వాదిస్తు ఎంత మైమరచిపోయారో!
నాపై అలిగినవాళ్లంతా ఎంత పండగ చేసుకున్నారో!
నవ్వుతూ నన్ను ఎంత బాగా చూసారో!
చెప్పలేనంతఆప్యాయత కురిపించి స్వాగతం పలికారో!
వారి అభిమానం చూసి నన్ను నేనే తిట్టుకున్నా!
ఏవైపోయాను ఇన్నాళ్లు అనీ!
కానీ!ఇప్పటికైనా వచ్చినందుకు ఆనందపడుతున్నా!
మీ చినుకు చిత్తడినై పుత్తడి చెయ్యాలని ఆశ పడుతున్నా!
Comments
Post a Comment