జానపద యుగళ గీతం. రచన:జయప్రభాశర్మ.
పల్లవి: అతడు: రాయే సిన్నమ్మి
నా యెంట రాయె అమ్మీ
న యెంట రాయె అమ్మీ
నిన్నేలుకుంట సుమ్మీ
ఆమె: పోరా సిన్నోడా
యెంట రాదు అమ్మీ
ని యెంట రాదు అమ్మీ
నువ్వంటే మంట సుమ్మీ
చరణం: అతడు: ఆదోరం జాతరలో రబ్బరుగాజులే కొంటా
బుదోరం సంతలోన రంగులరాట్నమెక్కిస్తా
ఆమె: ని మాటలే బొంకు ఎయ్యమాకులే టముకు
నే రానులే జంకూ నాకేమోలే బెరుకూ
అతడు: ఉమ్మెత్త పువు తెస్తా మెట్టపైన ముడిచెడతా
ఆమె: ఆ మాటలాపమంటా తేమాకులే తంటా "రాయె:
చరణం: అతడు: మద్దేరు దాటిస్తా పూలకొక కొని యెడతా
మా వూరు సూపిస్తా ఇంటికాడ ఒండెడతా
ఆమె: నన్నేలు వాడంట మానసిస్తే సాలంటా
నాతోనె నీవంటా నీతోనే నేనంటా
అతడు: నీ జడగంటలంటా న ఊసులేనంటా
ఆమె: నేను నీ జంటవుతా నువ్వు నా ఎంటంటా "రాయె"
అతడు: రాయె సిన్నమ్మి
యెంట రాయె అమ్మీ
యెంట రాయె అమ్మీ
న జంట నీవే సుమ్మీ
ఆమె: పదరా సిన్నోడా
యెంట వుంటదమ్మీ
యెంట ఉంటదమ్మీ
నీ జంట నేనె సుమ్మీ రచన: జయప్రభాశర్మ.
Comments
Post a Comment