VAMMO BANK
కారు లోను కావాలా?ఇంటి లోను కావాలా?స్థలానికి లోను కావాలా?చదువుకు లోను కావాలా? ఏది కావాలంటే అది,మరెందుకాలస్యం!రండి తీసుకెళ్లండి!. మీకోసమే మా బ్యాంకులు! మీ అవసరాల కోసమే మా సేవలు!కాకపొతే కొన్ని కండిషన్స్.....మీకొచ్చే జీతం యెంత,గవెర్నమెంటా?ప్రయివేటా?.....మీ చేతికి కట్టింగ్లు పోను యెంత వస్తుంది?....మీ వెనకాల పాపం అమాయక పక్షి..అదేనండి! గవర్నమెంట్ ఉద్యోగి సంతకం గోకడానికి సిద్ధంగా వున్నారా?వారి వసూళ్లకు అంతరాయం ఏర్పడకుండా!ముందు జాగ్రత్త చర్య న్నమాట. ఇంతకీ ఏవిటమ్మ నీ గోల?ఎవరునువ్వు?... ఎల్లప్పుడూ మీ వెంట వుండే నీడనండి బాబు!....ఎవరు నువ్వంటారేంటండి భలేవారే!. సరే!అసలు విషయానికొద్దాం!మీరేమో...ఓ...తెగ మురిసిపోయి,లోను ఇవ్వడమే మహా భాగ్యన్గా భావించి ఒకటే పరుగు.తీసుకున్నప్పుడు బానే ఉంటుంది. తరవాతుంటుంది అసలు కథ. ఒకనెల జాప్యం జరిగిందో....వడ్డీ,చక్రవడ్డీ....అదేపనిగా ఫోన్లు....చచ్చింది గొర్రె.ఎలాగైనా వసూలు చేయుట ఖాయం. వదిలేది లేదు. కట్టక తప్పదు.కాకపొతే నిద్ర,హారాలకు భంగం వాటిల్లుతుంది. పెళ్లానికైనా జీతం తెలుసో, లేదో గాని వీళ్ళు మాత్రం,అన్ని వివరాలు సేకరించి,ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించి,వీళ్ళ ఆఫీసు చుట్టూ తెగ తిప్పుకొని, విసిగిపోయిన టైములో మెల్లిగా సేంక్షను అయిందని తెలిసేసరికి...మనోడి కళ్ళల్లో ఆనందమే ఆనందం.....తెగ పండగ చేసేసుకోవడమే.....వాళ్ళేదో ఊరికినే ఇచ్చినట్టు.వాళ్ళావిడ బంగారం నగలడగడమే ఆలస్యం....వెంటనే కొనెయ్యాలికదా!.ఇంటికి కావాల్సిన హోమ్ ధియేటర్,వాషింగ్మెషీను ఇతర వస్తువులు కూడా యిదే తంతు. అది తీరిపోతే అన్ని మరచిపోయి...మళ్ళీ మొదటికే యవ్వారం. కార్లు,బైకులు, యిల్లు, స్థలాలు ఒకటేమిటి. సరదా అలాంటిది మరి. కడదామనే తలంపు వున్నా,భారంగా భావిస్తూ భయపడుతున్నా....వింటేగా..వారి ధోరణే వారిది.ఎందుకు తీసుకున్నానురా బాబు అన్నట్టు అయిపోతుంది పరీస్థితి.వాళ్లకి మాత్రం ధీమానే....ప్రభుత్వద్యోగి పిలక చేతిలో వుంటుందిగా. టక్కున ఫస్ట్ సెలరీ పడగానే నొక్కీవచ్చు. వాళ్లిద్దరూ ఎలా తన్నుకుంటే మనకేం. క్రెడిట్ కార్డులు....అవి ఇస్తామంటే మనోడు యెగిరి గంతులే. చూస్తే జాలేస్తుంది. జేబులో ఉంటే అవసరార్ధం వాడుకోవచ్చు కదా అనే ఉద్దేశం. డబ్బు అంత గొప్పది. సామాన్యుని సరదాలకు ఇన్నిపాట్లు. యింకో మాట!మనం బంగారం దాచిపెట్టమన్నా డబ్బు కట్టాలి...బానే వుంది....ఆ బంగారం మాత్రం ఏమైనా వాళ్ళ పూచి కాదట.ఇన్ని తిప్పలు. బడాబాబులు కోట్లు సొమ్ములు ఎగవేసినా,ఏమి చేయలేని పరిస్థితి.అప్పు అని,బంధువులు, స్నేహితులు దగ్గర చెయ్యి చాచకుండా,గుట్టుగా ఆర్ధికంగా ఆదుకునే బ్యాంకులు....అండగా వుంటాయని.....ప్రతి అవసరానికి ముందుంటాయని ఆసిస్తూ.....సామాన్యునికి ఆసరాగా వుంటాయని కోరుకుంటూ.....సహృదయంతో అర్ధం చేసుకుంటారని మనవి చేస్తూ.....నమస్కారం......ఇట్లు,జయప్రభాశర్మ.
Comments
Post a Comment