"Malle Puvvu" బొండుమల్లి,దొంతిమల్లి, సిరిమల్లి,మరుమల్లి, కొండమల్లి, అడివిమల్లి, పందిరిమల్లి,జాజిమల్లి కాడమల్లి. మధుమాస వేళ!మరుమల్లి రాక!........ఆహ! ఓహో!. వసంతం వహ్వా! వాసనల హేల!......ఆబ్బబ్బబ్బా! ఆపవమ్మా గోల!. ఏవిటీ! గోలా! నా పేర్లు ఎన్నున్నాయో చెబుతుంటేను!విసుగా!. ఫిబ్రవరి వచ్చిన దగ్గరనుంచి నాకోసం యెంత పరితపించిపోయి, ఎదురుచూస్తుంటారో! పల్లీసుపెట్టుకొని! మరెందుకమ్మా!. పోదురూ, మీరు మీ బడాయీను!. అంత పరిమళం వెదజల్లే కుసుమాన్ని నేనే గనక!. వేసవి చెమటకి తడిసి ముద్దయిపోతున్నా నన్ను మాత్రం వదిలితే ఒట్టు. సాయంకాలం ఎప్పుడవుతుందా, పూలు అమ్మకానికి వస్తాయా, ఎంచక్కా అలా షికారు చేసి వద్దామా, అనీ ఇవే ఆలోచనలు. యిహ! పరిమళ ద్రవ్యాల వాళ్ళైతే మరి చెప్పటానికి లేదు.విపరీతంగా తీసుకెళ్లి వాడుతుంటారు.అగరుబత్తి తయారీదారులు అసలు వదిలేది లేదు. అంత మోజన్నమాట. సబ్బులు,క్రీములు,పౌడర్లు యిలా ఎన్ని వ్యాపారాలు నావల్ల జరిగి లబ్ది పొందుతున్నారో. అసలు నేనంటే ఇష్టపడని వారు ఎవరు చెప్పండి! మన లెక్కే వేరు.పెళ్లిళ్ల సీజను వస్తే, మనదే హడావిడి, ఎక్కడ చూసినా. పెళ్ళికొడుకు,పెళ్లికూతురు మెడలో దండలు, పెళ్లి పూ
Comments
Post a Comment