Videsi Vyamoham

కళ్ళల్లో వెలుగు!విప్పారిన ముఖబింబం!మాటల్లో చెప్పలేనంతగా ఆనందం!. గెంతులు!చిందులు! పిల్లలకే కాదు!తల్లితండ్రులు కూడా!. ఎందుకు ఇదంతా అంటే! వీసా వచ్చేసింది!.అవధిలేని సంతోషం!ఇహ పార్టీలు,బంధుదర్శనాలు,షాపింగులు!..! హడావిడి అంతా ఇంతానా!విదేశీ ప్రయాణం!విదేశాల మోజు!.తమ స్వప్నం నెరవేరిన వేళ!. సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాం! ఇంక ఎదురులేని  జీవితం!. ఇంతకంటే ఏం కావాలి!ఇదే ఆలోచన!.కడుపు కట్టుకొని ఏడు ఇరుకుల్లో దాచిపెట్టిన సొమ్ములు తీసే తండ్రి!కడుపు చూసి అన్నం పెట్టి, పువ్వుల్లో పెట్టి చూసుకున్న తల్లి!ఎంతో వ్యయప్రయాసలకోర్చి, పిల్లలే సర్వస్వము అనుకోని ,పెంచుకున్న తల్లి తండ్రులను వదలి, వెళ్ళిపోయి!అక్కడే సెటిల్ ఐపోతామని ఇంకో ఆలోచన! ఏవండీ! మన దేశం చదువుకోండమ్మా అంటూ, ప్రాధమిక విద్య మొదలు ఉన్నతస్థాయి విద్య వరకు....పాఠశాలలు ఏర్పాటు చేయటమే కాకుండా...బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి....బాగా చదువుకున్న వాళ్లకి,నగదు బహుమతులిచ్చి  ప్రోత్సహించి...ఆర్ధికంగా వెనకబడినవారిని సైతం వారికున్న పరిధి మేరకు ఆసరాగా నిలుస్తూ ఉత్సాహపరుస్తోంది!.ఇరవైఐదు సంవత్సరాల క్రితం,ఇంజనీరింగ్ అంటే ..ఎంతో గొప్పగా ఉండేది!అత్యద్భుత ప్రతిభ కలవారికి మాత్రమే సీటు వచ్చేది! ఇంజనీరింగ్ ఒక కలగా ఉండేది!సీట్లు తక్కువ!కాలేజీలు తక్కువ! కొంత కాలానికి, ప్రవేశ పరీక్షలో అత్యధిక శాతం మార్కులు వచ్చినవారికి మాత్రమే సీటు!కాల క్రమేణా అనేక మార్పులు! కనీస అర్హత లేకపోయినా పర్వాలేదు!సీటు ఖాయం!ప్రస్తుత పరిస్థితిలో, అనేక కాలేజీలు, మరెన్నో సీట్లు!ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోయినా, సీటు వచ్చే స్థితి!. మరి! ఇన్ని ఏర్పాట్లు చేసి,రండి ....మీ యిష్టం...చక్కగా చదువుకోండి....భావి భారత ఇంజినీర్లు కండి...అనీ ఆహ్వానం పలికింది ఎవరు? మన దేశం!మన ప్రభుత్వం!. మనదేశంలో చదువుకొని!చివరిగా వచ్చే సర్టిఫికేట్! అంటే ఒక కాగితం1 నీ జీవితాన్నే మార్చేటటువంటి దాన్ని!పట్టుకొని, దేశం కానీ దేశం వెళ్ళిపోదామని ఆలోచన!ఎంతవరకు సమంజసం!కాలేజీలు,సీట్లు,గురువులు,డబ్బులు...అంటే మన రూపాయిలు,కన్న తల్లితండ్రులు! ఆఖరికి నువ్వు ప్రయాణించే రోడ్లు,వాహనాలు,వీధి దీపాలు! ఒకటేమిటి!ఆలోచిస్తే ఎక్కువ ప్రభుత్వ సేవలే!కనబడనంతగా చేస్తోంది!    ఇదే విదేశీ వ్యామోహం, భారత శాస్త్రవేత్తమాజీ రాష్ట్రపతి,శ్రీ...పీ.జె.అబ్దుల్ కలాంగారు  పడివుంటే, ఎలా ఉండేవారేమో!ప్రపంచమంతా చేతులెత్తి, జై కొట్టి స్వాగతం పలికినా...సుతిమెత్తగా తిరస్కరించి...నా తల్లి,భరతమాత సేవలకే నా సేవలు అంకితమని చాటి చెప్పిన మహానుభావుని...వచనాలు ఎప్పటికి మరువలేని సుభాషితాలు! అలాంటివారిని ఆదర్శంగా తీసుకోవాలి!అనేక ఇబ్బందులు ఎదుర్కుంటూ,మనదేశానికి తిరిగి రాలేక,అష్ట కష్టాలు పడుతున్నవారెందరో!డాలర్ల మోజు!డబ్బు వ్యామోహం!.అక్కడ అది రూపాయి మాత్రమే!ఇక్కడ మారిస్తే బానే వస్తాయి! కానీ!బతుకు జట్కా బండిని లాగాలంటే!ఎలా?.పది శాతం వారి ఆహ్వానం మేరకు వెళ్లిన వారైతే!ఇరవై శాతం మనదేశంవారు, పై దేశాలకు వారి ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా పంపించటం జరుగుతోంది!.మిగిలినవారంతా స్వశక్తితో వెళ్లి అవస్థలు పడాల్సి వస్తోంది!ఎందుకంటే! వారి వారి ఉద్యోగ ప్రామాణిక విలువల సమర్ధతను బట్టి! విదేశాల్లో ఉద్యోగమొచ్చినా యిష్టన్గా చేసే మనవాళ్ళు! అదే ఇష్టంతో మన దేశానికి సేవ చేస్తే ఎంత బాగుంటుందో కదా!.సంస్కారానికి,సాంప్రదాయానికి పెట్టింది పేరు భారతదేశం!.సుసంపన్నమైనది మన దేశం!అలాంటి మన భారతావనిని విడిచి, కన్నతల్లితండ్రులను వదలి!వెళ్లి ఏం సాధిస్తారని!డాలర్ అపోహ తోలగాలని,,మన భరతమాతసేవకు అంకితం కావాలని కోరుకుంటూ.....వుంటాను....మళ్ళీ రేపు కలుద్దాం...ఇట్లు, జయప్రభాశర్మ.


Comments

Popular posts from this blog

Articles