DO SUY
బ్రిటిషువాళ్ళు మన భారతదేశానికి వచ్చి తిష్టవేసి, మనవాళ్లతో అడ్డమైన చాకిరీ చేయించుకొని, హింసలు పెట్టి మహదానందపడేవారు.ఇది అందరికి తెలిసిన విషయమే. అలాగే వంటలు కూడా వండించుకొని తినేవారట.ఏది చేసిన లొట్టలేసుకుని లాగించేవారట.కొన్ని సందర్భాల్లో,దీని పేరేమిటి అని అడిగేవారట.వీళ్ళకేమో ఇంగ్లీషు రాదు....వాళ్ళకేమో తెలుగు అర్ధం కాదు.ఎలాగోలా మేనేజ్ చేసేవారట మనవాళ్ళు భయంతో. దిన దిన గండం దీర్గాయుష్షులా గడిపేవారట కాలం.ఏది చేసిన,ఎలా చేసిన,దేనికైనా హింసించేవారేమో కానీ,వంట దగ్గిర మాత్రం తెగ మెచ్చుకొనేవారట.ఇది ఎలా చేశారు?అది ఎలా చేశారు?అని.అంత బాగా పొగిడేలా వంటలు చేసేవారట మనవాళ్ళు. మన" దోస " అంటే పడి చచ్చేవారట. ఎన్ని రకాల దోశలు చెయ్యాలో అన్ని రకాలు చేసి మనవాళ్ళు పెట్టేవారట.ఆ దోస తినేసరికి వాళ్ళ కోపం పటాపంచలైపోయేదట.ఒకసారి బ్రిటిషువాళ్ళతో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు,మనవాళ్ళు దోశలు తినడానికి మూటకట్టి తీసుకెళ్ళారట.మూట విప్పి పాపం మనవాళ్ళు అందరికి వడ్డించేసరికి,అందులో ఇక్కడున్న బ్రిటిషోళ్ళని చూడ్డానికి కొత్తగా వచ్చిన మరో బ్రిటీషోడికి,ఇదేదో అర్ధం కాక,అడిగాడట. చాల బాగుంది ఇదేంటని?.బుర్ర గోక్కొని, ఎలా చెప్పాలో తెలియక, ఆఖరికి ఒక ఆలోచన తట్టి, గబుక్కున పెన్ను, కాగితం తీసుకొచ్చి, పెనం బొమ్మ వేసి,దానిపై దోస వేస్తే, ఆ వేడికి "సుయ్" అని శబ్దం ఒకసారి,తిరగేసినప్పుడు మళ్ళీ "సుయ్" అని రెండోసారి వస్తుంది, కాబట్టి దీని పేరు"దోసుయ్" అని చెప్పేసరికి, తాతలు దిగొచ్చేరట. తెగ పొంగిపోయారట అలా చెప్పేసరికి.ఎంత బాగుందో అని. బతుకు జీవుడా అనుకున్నాట్ట మనోడు. లేకపోతె ఎక్కడ తాట తీస్తారో చెప్పకపోతే అని నూటొకటి కొట్టిందట.ఆనాటి పినపట్టు సంఘటనే.... కాలక్రమేణా"దోసుయ్" దోసగా మారిపోయింది. లేకపోతె అప్పటివరకు దీని పేరు మినపట్టే. ఆఖరికి మన వాళ్ళు తరిమినప్పుడు కూడా....ఎంతో బాధపడుతూ వెళ్లలేక వెళ్ళేరట.ఇలాంటి వంటకాలు మళ్ళీ తినలేమని. ఆనాటి సందర్భంలో మాత్రం మనవాళ్ళని సత్కరించి, బహుమానాలిచ్చి గౌరవించారట. అంతేకాదు... వాళ్లతోపాటు వస్తే తీసుకెళ్తామని, కోరినంత ఇస్తామని చెప్పిన కూడా మనవాళ్ళు సుతిమెత్తగా తిరస్కరించారట. అంతటి గొప్పవాళ్ళు మనవాళ్ళు.ఏ రంగంలో చూసినా నిష్ణాతులు. మరి అలాంటివారిని ఎంత పొగిడినా తక్కువే......మనం భారతీయులైనందుకు గర్విస్తూ...వుంటాను...నమస్కారం....ఇట్లు,జయప్రభాశర్మ..
Comments
Post a Comment