Veedi Kukka

చిత్తకుక్కలా తిరుగుతాడు!...పిచ్చికుక్కలా అరుస్తున్నాడు!....పోరా కుక్క!...కుక్కలా పడుండు!....ఏంటా మాటలు!. అంత చులకనైపోయానా!. మరీ ఇంత అన్యాయమా!.అసలు నాకున్న విశ్వాసం ఏ ప్రాణికయినా వుందా!.మీరు విసిరి పారేసిన నాలుగు ఎంగిలి మెతుకులు తిన్నా చాలు,మీ యింటి  చుట్టూ తిరుగుతూనేవుంటాను. ఎంత విసుక్కోని వెంట తగిలి కొట్టినా వదలను. ఎప్పుడూ మీరు బాగుండాలనే కోరుకుంటాను.అదే పిల్లైతే యింట్లో ఎవ్వరు ఉండకుండా పొతే,ఎంచక్కా పాలు అన్నీ  తాగెయ్యొచ్చు అనుకుంటుంది. నేనలాకాదు అందరు కిల కిలలాడుతూ ఇంటి నిండుగా ఉంటే నాకు ఏవైనా పెడతారు కదా అనుకుంటాను. నాకు, ఆ పిల్లికి అదే తేడా. వీధి కుక్కలంటే ఎంత అలుసో!  అర్ధరాత్రి ఏమాత్రం అలికిడైన,మేల్కొని అదే పనిగా అరుస్తూనేవుంటాయి.మీరు విసుక్కుంటారు గాని.మమ్మల్ని అసహ్యించుకొని మున్సిపాలిటివారికి పిర్యాదు చేసి పట్టించాలనుకుంటారు.వాళ్ళు బండి వేసుకొచ్చి అమానుషంగా మమ్మల్ని చంపడం ..చూసి భరించలేక, యువ సామ్రాట్,నాగార్జునగారి సతీమణి,శ్రీమతి అమలగారు, సంజయ్ గాంధీగారి సతీమణి, శ్రీమతి మేనకాగాంధీగారు, మూగప్రాణులను హింసించుట అన్యాయమని ఆపి పుణ్యం కట్టుకున్నారు.కోటీశ్వరుల ఇంటి కాపలాకి,వాళ్ళ హోదాకి గుర్తింపుగా మేముండాలి.కాకపొతే మా కంటే హోదా కలిగిన జాతి.రకరకాల పేర్లతో,యీసారి పిల్లలు పెడితే మావే అని అడ్వాన్స్ బుకింగులు కూడా.ఎంత డబ్బైనా ఖర్చుకి వెనకాడరు.ప్రత్యేకించి దుకాణాలు, వాటి అమ్మకాలు జరుగుతుంటాయి.అవి రోడ్డుమించి వెళుతుంటే, తెగ మురిసిపోతుంటారు చూసి జనాలు.వాటికి పుట్టినరోజులు,వైద్యుల పర్యవేక్షణ, మంచి ఆహరం.క్లూస్ టీం వాళ్ళు....క్లూ దొరక్క తల బద్దలైపోతుంటే...టక్కున మా వాళ్ళు రావాల్సిందే...క్లూ ఇవ్వాల్సిందే. బాంబు స్క్వాడు వాళ్ళు...బాంబు అని తెలియగానే....మమ్మల్ని పెట్టుకొని బాంబు భయం ఛేదించాల్సిందే.అంత గొప్ప జాతి మాది.మరి మేమేం చేశామని. వీధి కుక్కా,వీధి కుక్కా...అంటూ తిడుతుంటారు.మా కడుపుకి ఆకలెయ్యదా?...మాకు అనారోగ్యం రాదా? మా పిల్లలు పిల్లలు కాదా?...ఎండకు ఎండి వానకు తడుస్తూ....అరుచుకుంటూ బతకడమేనా?. మేము కరుస్తున్నామంటూ ఎంతో బాధపడుతుంటారు.నిజమే!. మాకూ బాధనిపిస్తుంది. ఎందుకిలా!అని!.కానీ క్షుద్బాధతో ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న మా దీనావస్థని కూడా సహృదయంతో అర్ధం చేసుకోవాలని, మమ్మల్ని బాధ పెట్టకుండా, మీరు బాధ పడకుండావుండాలని, దీనికోసం ప్రభుత్వం మంచిగా ఆలోచించాలని ఆశిస్తూ.....మీ  విశ్వాసపాత్రుడు.....మీరు పూజించే కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో వుండే మీ కాలభైరవుడు.....శునకమహారాజు.....వుంటాను...ఇట్లు, జయప్రభాశర్మ


Comments

Popular posts from this blog

Articles