జానపద గీతం,రచన: జయప్రభాశర్మ.
టెర్లీను కోకా కట్టీ
ముఖమల్లు రయికా తొడిగీ 
ఒయ్యారి నడిచొస్తుంటే
మనసంతా పరుగులు తీసే

సిలుకూ పంచెనూ కట్టీ
కద్దారు సొక్కా తొడిగీ
మీసం మెలిపెడుతొస్తుంటే
మదిలోన అలజడి రేగే
గున్నమావి తోటావుంది
గుబురు కంది సేనూఉంది
నీలాటి రేవూవుంది
నిమ్మసెట్టు నీడా వుంది

అందాలా మరదలు పిల్లా
పోదాం పద మరి అటు అల్లా
నువ్వే నా పనసాపండు
నీపై నా మోజే మెండు
నువ్వే నా మల్లెచెండు
నేనే నీ అత్తరు సెంటూ
సొగసైన పాలా ఎండి
పూసేస్తా గూడూబండి

Comments

Popular posts from this blog

Articles