ప్రక్రుతి విలయతాండవం,హుదూద్, జె.పీ.ఎస్.
సరిగ్గా మూడేళ్ళక్రితం
ముచ్చెమటలు పట్టే రోజు
గుండె దడ పుట్టే రోజు
విశాఖ విల విల లాడే రోజు
అర చేతిలో ప్రాణం పెట్టుకున్న రోజు
భయాందోళనకు గురి కాబడిన రోజు
ప్రక్రుతి తల్లి ఆగ్రహానికి బలి ఐన రోజు
అస్తవ్యస్తంగా ఉన్నవిశాఖని చూసి ఏడ్చిన రోజు
మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన రోజు
ఎప్పుడు విశాఖని ప్రేమగా లాలించే ప్రకృతితల్లి
ఎందుకు కోపగించిందో తెలియని పరీస్థితి
వాతావరణ శాఖవారి హెచ్చరిక మామూలే అనుకున్నాం
ఇస్రో చెప్పినా ఖాతరు చేయకుండా చూసాం
కానీ అనుకున్నంతా ఐంది
భవంతులు సైతం ఉయ్యాల లూగాయి
వందల చరిత్ర మానులు కూకటి వేళ్ళతో నేలకొరిగాయి
నిద్రలేదు హారం లేదు
పాలులేవు నీళ్లు లేవు
విద్యుత్తు సౌకర్యం లేదు
సమాచార వ్యవస్థ కనుమరుగు
ఏ దిష్టి తగిలిందో అని ఒకటికి పదిసార్లు అనుకున్న రోజు
ఆసియాలోనే అభివృద్ధిపథంలో ప్రధమ స్థానం విశాఖ
అందం ఆనందం ఆహ్లాదానికి పెట్టింది పేరు విశాఖ
సాగర తీరం చల్లనిగాలితో పర్యాటకులను సమ్మోహనపరిచే విశాఖ
కానీ! గతం కంటే అందం రెట్టింపని జనం మెచ్చే రోజు! ఈ రోజు
మా విశాఖ ఎప్పటికీ ఇలానే వుండాలని కోరుకుంటున్నాము
పచ్చని గిరుల మధ్య పదిలంగా మము కాపాడే ప్రక్రుతి తల్లి
మరి ఎప్పటికి ఇలా చేయదని మాకు తెలుసు
మా విశాఖ తన ముద్దు బిడ్డ గారాలపట్టి
ప్రేమిస్తుంది లాలిస్తుంది చల్లని ఒడిలో సేద తీరమంటుంది
భరోసా ఇస్తుంది భయమెందుకని! అంతకంటే ఏం కావాలి

Comments
Post a Comment