అలంపురం జోగులాంబ, భక్తి గీతం,లిరిక్, జె.పీ.ఎస్. సి.డి.కోసం రాసినది.

రససిద్ధుడు కట్టించిన దేవాలయం
అలరారుతున్న మన అలంపురం
తపసు చేయ సిద్ధుడొచ్చె ఈ క్షేత్రం 
కాశీ విశ్వేశ్వరుని ప్రేరణం

బ్రహ్మెశ్వర శిరసు నుండి జోగులాంబ నోటినుండి
గణపతయ్య బొడ్డునుండి ఇచ్చినారు ఒక రసము
పరసవేదిని చేసి ఆలయాలు కట్టించి
పరమపావనంగ చరితలోన నిలిచీ

దండెత్తగా వచ్చాడు విలసద్రాజు
పరసవేదినీ కోసం ఆ మహారాజు
అసంపూర్తి నిర్మాణం ఆలయంలో ప్రవేశం
సిద్ధుడు అయినాడు బ్రహ్మస్వరునిలో లీనం

కలతచెంది సిద్ధుడు పెట్టినాడు శాపం
రాజ్యం పోగొట్టుకొని కష్టాలను అనుభవించి
పొందినాడు జింకచేత ఉపదేశం
చివరికి చేరాడు రాజు శివసాన్నిధ్యం

Comments

Popular posts from this blog

Articles