జానపద యుగళ గీతం ,రచన జె.పీ.ఎస్.
4 Years back c.d kosamai raasindi
తూటూ పూల రంగు కోకా......
తెచ్చానే నీకు కట్టుకోగా
ఉమ్మెత్తా పూల రంగు సొక్కా......
ఏసావంటే పూలరంగా
నీ సెవికి కమ్మలు ఎడతా
నువ్వు సెప్పినట్టు నేనింటా
నా పేనమంటె నువ్వంటా
నీ మాట జవదాటనంటా
నా నవ్వుల సింగారి
ముద్దుల బంగారి
నువ్వేను నా జాపత్రి
నీ ఏలి పట్టి నే నడుత్తా
నీతోనే నాకు లోకమంతా
నీ గుండెలోన నిదురపోతా
నీ యెంట తోడు నేనంటా
ఆ పూలన్ని ఏరీ
నీ పాదాల ఏసీ
చేస్తాను పూజను ఏటీ
Comments
Post a Comment