లలితగీతం,రచన,జె.పీ.ఎస్.

ఎందుకమ్మ కోయిలమ్మ
అంత స్వరం నీకు
ఎంత విన్నాగాన
తనివి తీరదు నాకు

భగవంతుడు నీకిచ్చిన మా గొప్ప వరమమ్మా
బాధ్యతగా శిరసావహించావు నీవమ్మా
అలసటంటు మరిచావు ఆనందం పంచావు
ఆమని కోయిల అంటు బిరుదును పొందావు

చిగురు తొడిగిన కొమ్మల తీయని రాగాలు తీయ
కమ్మగ ఆస్వాదించి అభివాదము చేయా
అభినందన వెల్లువా విన సొంపుగ గీతికా
ఆభేరి రాగాన అందుకొ ప్రియ మాలికా

Comments

Popular posts from this blog

Articles